BSNL యూజర్లకు హోలీ కానుక.. ఆ ప్లాన్‌పై 30 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ.. అదనపు ఛార్జీలు లేవ్!
BSNL Holi Offer: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, తన వినియోగదారులకు హోలీ కానుక ప్రకటించింది. ఇకపై రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, ఏకంగా 30 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు 395 రోజులు ఉన్న ఈ ప్లాన్, ఇప్పుడు ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీతో మీ ముందుకు రానుంది. అంటే మీరు చెల్లించేది రూ.2,399 మాత్రమే అయినా, 13 నెలలకు బదులు ఏకంగా 14 నెలల పాటు ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ అదనపు వ్యాలిడిటీ కోసం ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్‌ఎన్ఎల్ సిగ్నల్స్ మంచిగా అందుకునేవారికి ఈ ప్లాన్ ఒక వరం అని చెప్పవచ్చు. హోలీ ధమాకా అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా గుడ్‌న్యూస్ చెప్పింది BSNL. దీంతో చాలామంది ఖుషి అవుతున్నారు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ యూజర్లు సంతోషిస్తున్నారు.

* ప్లాన్ బెనిఫిట్స్
రూ.2,399 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2GB హై-స్పీడ్ డేటా, రోజుకి 100 SMSలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రోజుకిచ్చే 2GB డేటా అయిపోతే, ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకి తగ్గుతుంది. కానీ బ్రౌజింగ్ చేసుకోవచ్చు, బేసిక్ యాప్స్ వాడుకోవచ్చు. డేటా రోమింగ్ ఆన్ చేసుకుంటే BSNL నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ పొందవచ్చు.
* ఈ ఆఫర్ ఎందుకంత స్పెషల్
BSNL తీసుకొచ్చిన ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ వల్ల, రూ.2,399 ప్లాన్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌లోకెల్లా బెస్ట్ వాల్యూ ప్లాన్‌గా మారిపోయింది. చాలా టెలికాం కంపెనీలు లాంగ్ టర్మ్ ప్లాన్స్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంటే, BSNL మాత్రం ఏకంగా 425 రోజులు ఆఫర్ చేస్తోంది.
దీంతో ఇది ఇండియాలోనే అత్యధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ఈ అదనపు 30 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అదనంగా 60GB డేటా కూడా ఫ్రీగా వస్తుంది. OTT, యూట్యూబ్ వీడియోలతో పాటు ఆన్‌లైన్ కోర్సులకు హాజరయ్యే స్టూడెంట్స్‌కి కూడా ఈ డేటా పనికొస్తుంది.
* రూ.2,399 ప్లాన్ పూర్తి ప్రయోజనాలు..
వ్యాలిడిటీ 425 రోజులు (ఇంతకుముందు 395 రోజులు), ఎంత సమయమైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇండియాలో ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. డైలీ డేటా 2GB కాగా మొత్తం 425 రోజులకు 850GB డేటా లభిస్తుంది. అంతే కాదు, BSNL మొబైల్ యూజర్లందరికీ BiTV సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇస్తోంది.
ఇంకా కొన్ని ఓటీటీ (OTT) అప్లికేషన్లకు కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ కాలం పాటు కనెక్షన్ కావాలనుకునేవారికి బాగా సరిపోతుంది. అంతేకాదు అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా కావాలనుకుంటారో వాళ్లకి ఇది ఉత్తమ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు.
లెక్కేసుకుంటే, ఈ ప్లాన్ రోజుకి దాదాపు రూ.5.6 మాత్రమే ఖర్చవుతుంది. మొబైల్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వాళ్లకి ఇది నిజంగా మంచి డీల్. అయితే, BSNL ఈ హోలీ ధమాకా ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో ఇంకా చెప్పలేదు. కాబట్టి, ఈ అదనపు 30 రోజుల ఫ్రీ వ్యాలిడిటీని అందుకోవాలనుకునే వాళ్లు ఆఫర్ ముగిసేలోపు వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








