Home
News

BSNL 365 రోజుల వాలిడిటీ ప్రోగ్రామ్‌లో మరో కొత్త STV డేటా ప్లాన్...

ఇండియాలో ఉన్న టెలికాం సంస్థలు అన్ని ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో తమ వినియోగదారులకు ఇంటర్నెట్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందించడానికి ప్రత్యేక డేటా వోచర్‌లను అందిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ఇంటి వద్ద నుండి పని చేసే వారి యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా డేటాను అందించే డేటా వోచర్‌లను విడుదల చేసాయి.

బిఎస్ఎన్ఎల్

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కూడా తమ వినియోగదారులకు కొత్తగా రూ.1,498 ధర వద్ద మరొక కొత్త డేటా ఎస్టివిని ప్రకటించింది. Realme Buds, Powerbank 2 Sale ఈ రోజే!!! డిస్కౌంట్ ధరకే...

బిఎస్ఎన్ఎల్ రూ.1,498 STV ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ రూ.1,498 STV ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ టెలికామ్ సంస్థ తన వినియోగదారులకు డేటా వోచర్‌ల సహాయంతో ఇంటర్నెట్ అనుభవాన్ని మెరుగ్గా అందించడానికి కొత్త డేటా ఎస్టివిని రూ.1,498 ధర వద్ద అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రోజువారీ డేటా వాడకంలో రోజువారీ క్యాప్స్ లేకుండా మొత్తంగా 91GB హై-స్పీడ్ డేటాను 365 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తున్నది. ఈ మొత్తం డేటాను మీరు ఒకే రోజులో లేదా దాని చెల్లుబాటు వ్యవధిలో ఉపయోగించవచ్చు. ఈ డేటా యొక్క వినియోగం మీపై ఆధారపడి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ నుండి ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించే వారికి ఇది మంచి ప్లాన్.

BSNL యొక్క ఇతర ఆసక్తికరమైన STV ప్లాన్‌లు

BSNL యొక్క ఇతర ఆసక్తికరమైన STV ప్లాన్‌లు

అదనపు డేటా కోసం మీరు రూ.1,498 ఖరీదైన ప్లాన్‌ను కొనుగోలు చేయకూడదనుకుంటే BSNL అందిస్తున్న ఇతర ఆసక్తికరమైన STV లను ఉపయోగించవచ్చు. ఇందులో మొదటి వరుసలో గల ఎస్టీవీలలో ఒకటి రూ.96 వోచర్ ప్లాన్. ఇది రోజువారీ డేటాలో క్యాప్ లేకుండా 11GB డేటాను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే BSNL యొక్క రూ.48ల మరో STV డేటా ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి మొత్తంగా 5GB డేటాను అందిస్తుంది. WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

BSNL డేటా ప్లాన్లు

BSNL డేటా ప్లాన్లు

ఒకవేళ మీకు అన్ని రకాల ప్రయోజనాలతో కూడిన చందా ప్లాన్ ను కావాలంటే మీరు రూ.98 వోచర్‌ను ఎంచుకోవచ్చు. ఇది మీకు 2GB రోజువారీ డేటాను 20 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ మీకు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్ యొక్క ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది. రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందించే మరో STV రూ.198 ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.

BSNL డేటా & వాయిస్ కాలింగ్ ప్లాన్లు

BSNL డేటా & వాయిస్ కాలింగ్ ప్లాన్లు

కేవలం నిర్దిష్ట డేటాను అందించే ప్లాన్ లే కాకుండా డేటాతో పాటు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందించే STVలను కూడా BSNL అందిస్తున్నది. రూ.247 ధర వద్ద వచ్చే STV ప్లాన్ వినియోగదారులకు 3GB డైలీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. వీటితో పాటుగా ఇది రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

BSNL తెలంగాణ, ఆంధ్ర ప్లాన్లు

BSNL తెలంగాణ, ఆంధ్ర ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ తెలంగాణ మరియు ఆంధ్ర సర్కిళ్ళలో మాత్రమే ఇవ్వబడుతున్న మరో రెండు ప్లాన్లు కూడా ఉన్నాయి. వాటి యొక్క ధరలు వరుసగా రూ.228 మరియు రూ.268. ఈ ప్లాన్లతో మీకు 40GB డేటా 30 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Introduced New STV Data Plan at Rs.1498: 91GB Data and 365 Days Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X