WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

|

ప్రపంచం మొత్తంగా అధిక మంది యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఒకటి. 2 బిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులతో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ కూడా ఒక పెద్ద లోపంను కలిగి ఉంది.

వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్స్ స్కామ్

వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్స్ స్కామ్

దీని యొక్క లోపాన్ని స్కామర్లు వారికి అనుకూలంగా ఉపయోగించుకొని ప్లాట్‌ఫామ్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ లో కొన్ని రకాల స్కామ్ లను చేసారు. ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మరొక స్కామ్ ప్రస్తుతం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్కామ్ ముఖ్యంగా వినియోగదారుల నుండి డేటా లేదా ధృవీకరణ కోడ్‌లను పొందడానికి ప్రయత్నిస్తుంది.

Vivo Days Sale: గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో వివో ఫోన్‌ల కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!!Vivo Days Sale: గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో వివో ఫోన్‌ల కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!!

 

వాట్సాప్ అకౌంటు

వాట్సాప్ అకౌంటు

ఇది వందకి వంద శాతం ఖచ్చితంగా నకిలీది. స్కాట్ చేసేవారు గతంలో వాట్సాప్ అకౌంటులను హ్యాక్ చేయడానికి నకిలీ ధృవీకరణ కోడ్‌లను పంపడానికి ప్రయత్నించారు కూడా. ఈ కొత్త స్కామ్ గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వాట్సాప్ ట్విట్టర్

WABetaInfo ట్విట్టర్‌లో తెలిపినట్లుగా వాట్సాప్ సంస్థ తన వినియోగదారులకు తమ ప్లాట్‌ఫామ్‌లో ఎటువంటి మెసేజ్ కూడా పంపదు. ఇది ఎప్పుడైనా ఏదైనా సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటే కనుక తమ అధికారిక ఛానెల్‌లలో బ్లాగ్ పోస్ట్‌లు మరియు అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా మాత్రమే పోస్ట్ చేస్తుంది. వాట్సాప్ యొక్క ఏదైనా కొత్త అప్ డేట్ ను వారి యొక్క అకౌంటులో గుర్తించడానికి సులభమైన మార్గం నెంబర్ పక్కన "గ్రీన్ వెరిఫైడ్" సూచిక కోసం వెతకడం.

వాట్సాప్ స్కామ్

వాట్సాప్ స్కామ్

స్కామర్ పంపే మెసేజ్ లో స్పానిష్ భాషలో పంపినట్లు మరియు సెషన్ చట్టబద్ధమైనదా అని ధృవీకరించమని పేర్కొంటారు. మెసేజ్ రహస్య సమాచారాన్ని మరియు కార్యాచరణ లాగ్‌ల గురించి వినియోగదారులు మరింతగా తెలుసుకోవడానికి "ధృవీకరించడానికి గుర్తింపు ధృవీకరణ కోసం మేము మీకు అభ్యర్థన పంపాము" అని అనువదించబడిన మెసేజ్ ను పంపుతారు. అతెంటిక్ మెసేజ్ అనేది స్కామర్ అనుసరిస్తున్న స్మార్ట్ ట్రిక్.

రెండు-దశల ధృవీకరణ ఫీచర్

రెండు-దశల ధృవీకరణ ఫీచర్

ధృవీకరించబడిన హ్యాండిల్ ద్వారా మాత్రమే ఈ సర్వీస్ కమ్యూనికేట్ అవుతుందని వాట్సాప్ వినియోగదారులను నమ్మబలికాడు స్కామర్లు ప్రయత్నిస్తారు. ప్రైవసీ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌గా పేరు గల వాట్సాప్ అతెంటిక్ కోడ్‌లను ఎప్పటికీ అడగదు. మీ అకౌంటును రెండు-దశల ధృవీకరణను ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

రెండు-దశల ధృవీకరణ ఫీచర్ను ప్రారంభించడం ఎలా?

రెండు-దశల ధృవీకరణ ఫీచర్ను ప్రారంభించడం ఎలా?

వాట్సాప్ రెండు-దశల ధృవీకరణ ఫీచర్ ని ప్రారంభించడానికి ఎగువవైపు కుడి మూలలో గల మూడు చుక్కలపై క్లిక్ చేసి ఆపై సెట్టింగులను ఎంచుకొని అందులో "మై అకౌంట్" మీద క్లిక్ చేసి తరువాత రెండు-దశల ధృవీకరణను ఎంచుకోండి. ఈ ఫీచర్ స్కామర్ల నుండి మీ అకౌంటును భద్రపరచడానికి ప్రారంభించండి. మీరు అప్రమత్తంగా ఉండాలని మరియు అలాంటి మోసానికి పాల్పడవద్దని సిఫార్సు చేయబడింది.

Best Mobiles in India

English summary
WhatsApp New scam: Users Be Alert on verification codes Asking

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X