5GB రోజువారి డేటాతో ప్రైవేట్ టెల్కోలకు సవాల్ విసిరిన BSNL....
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ.599 వర్క్ ఫ్రమ్ హోమ్ STV ప్లాన్ తో అందిస్తున్న రోజువారీ 5GB డేటా పరిమితి అయిపోయిన తరువాత డేటా వేగం 80Kbps కు తగ్గించబడుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తన రూ.599 కొత్త ప్లాన్‌తో మొత్తం చెల్లుబాటు కాలంలో 450GB డేటాను అందిస్తున్నది.

బిఎస్ఎన్ఎల్ వర్క్ @ హోమ్ STV ప్లాన్
కొరోనావైరస్ కారణంగా ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వారిలో భారీ డేటా అవసరం ఉన్న వారికి సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు ప్రత్యాన్మాయంగా దీనిని ఎంచుకోవడానికి మంచి ఎంపికగా ఉంది.

BSNL STV ప్లాన్‌లు
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు దీటుగా బిఎస్ఎన్ఎల్ ఇటీవల కొత్త కొత్త ప్లాన్ లను అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రీపెయిడ్ చందాదారులకు ఇప్పుడు ఉత్తమమైన ప్లాన్ లను అందించడంలో కంపెనీ వెనక్కి తగ్గకుండా రోజువారి 5GB డేటాతో రూ.599 STV ధర వద్ద ‘వర్క్ ఫ్రమ్ హోమ్ STV' ప్లాన్ ను తీసుకువచ్చింది. గతంలో ఈ ప్లాన్ కేవలం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ టెలికాం సర్కిల్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క తాజా రూ .599 ప్రీపెయిడ్ ఎస్‌టివి ప్లాన్ దేశవ్యాప్తంగా 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అదనంగా ఇది వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ .599 వర్క్ ఫ్రమ్ హోమ్ STV ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ.599 ధర వద్ద లభిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ STV ప్లాన్ అపరిమిత కాంబో ఆఫర్లను అందిస్తున్నది. ఈ ప్లాన్ రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్, రోజుకు 5GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఈ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్న అన్ని టెలికాం సర్కిళ్ళలో (ముంబై & ఢిల్లీ మినహా) కొత్త రూ.599 ప్రీపెయిడ్ STV ప్లాన్ ను అందించనుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.599 STV ప్లాన్ ఇతర ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ.599 వర్క్ ఫ్రమ్ హోమ్ STV ప్లాన్ తో అందిస్తున్న రోజువారీ 5GB డేటా పరిమితి అయిపోయిన తరువాత డేటా వేగం 80Kbps కు తగ్గించబడుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తన రూ.599 కొత్త ప్లాన్‌తో మొత్తం చెల్లుబాటు కాలంలో 450GB డేటాను అందిస్తున్నది. కొరోనావైరస్ కారణంగా ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వారిలో భారీ డేటా అవసరం ఉన్న వారికి సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు ప్రత్యాన్మాయంగా దీనిని ఎంచుకోవడానికి మంచి ఎంపికగా ఉంది.

బిఎస్ఎన్ఎల్ STV Vs ప్రైవేట్ టెల్కోస్
బిఎస్ఎన్ఎల్ సంస్థ తన కొత్త రూ .599 ప్లాన్‌తో ప్రైవేట్ టెల్కోస్ అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను అధిగమిస్తోంది. ప్రైవేట్ టెల్కోలు అందరూ కూడా గరిష్టంగా కేవలం రోజువారీ 3GB డేటాను మాత్రమే అందిస్తున్నారు. 2019 డిసెంబర్‌లో టారిఫ్ రివిజన్‌కు ముందు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రోజుకు 4GB వరకు డేటాను అందించేవి. కానీ ఈ మూడు టెల్కోలు ప్రస్తుతం తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనంను మాత్రమే అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ సంస్థ అందిస్తున్న 5GB రోజువారీ డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌కు ప్రతిస్పందనగా ప్రైవేట్ టెల్కోలు ఎలా స్పందిస్తాయో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications








