రూ.50 ల వరకు టాక్ టైమ్ లోన్ ఆఫర్‌లను అందిస్తున్న BSNL
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ తన పూర్వవైభవాన్ని పొందడానికి మరియు వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి కూడా రకరకాల ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా మరియు మరిన్ని కారణాల వలన రీఛార్జ్ చేసుకోలేకపోతుంటారు.

బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్
అటువంటి వారి కోసం బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ ప్లాన్ లను అందిస్తున్నది. ఈ లోన్ ధరలు రూ.10 ల నుండి రూ.50 వరకు ఉన్నాయి. ఈ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ కింద వస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవడం కష్టమవుతున్న సమయంలోనే ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. ఇతర టెల్కోలు కూడా తమ వినియోగదారులకు ఇటువంటి ఆఫర్లను అందించడం లేదు. కానీ బిఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం టాక్ టైమ్ లోన్ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ ప్లాన్ల ధరల వివరాలు
బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ ఆఫర్ కింద తన వినియోగదారులకు రూ.50 వరకు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది. టాక్ టైమ్ లోన్ ఆఫర్ కింద రూ.10, రూ.20, రూ.30 మరియు రూ.50 ధరల వద్ద ప్లాన్ లు ఉన్నాయి. మీరు టాక్ టైమ్ లోన్ పొందాలనుకుంటే USSD కోడ్ డయల్ చేసి మీకు కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ ను పొందే విధానం
బిఎస్ఎన్ఎల్ సంస్థ తన వినియోగదారులకు టాక్ టైమ్ లోన్ ను పొందడానికి * 511 * 7 # USSD కోడ్‌ను డయల్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత మీరు ఒక SMS ను స్వీకరిస్తారు. ఇందులో మీకు కావలసిన రుణ మొత్తాన్ని ఎన్నుకోమని ప్రాంప్ట్ చేయబడి ఉంటుంది. మీకు కావలసిన లోన్ మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత ‘సెండ్' బటన్‌ను నొక్కాలి. దీని తరువాత మీకు కావలసిన లోన్ మొత్తాన్ని పొందుతారు. బిఎస్ఎన్ఎల్ టెల్కో నుండి వస్తున్న ఈ ప్లాన్ లు వినియోగదారులకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయి.

బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ లోన్ వివరాలు
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ టాక్ టైమ్ లోన్ ఆఫర్ మొదటి సారిగా 2016 లో ప్రారంభించింది. ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ టాక్ టైమ్ కోసం SMS సహాయంతో వినియోగదారులకు రూ.10 రుణం అందించింది. ఈ టెల్కో తరువాత వినియోగదారుల అకౌంట్ నుండి రూ.11 లను వసూలు చేసేది. కానీ ఇప్పుడు టాక్ టైమ్ లోన్ ఆఫర్ కింద కస్టమర్లు ఎంచుకోవడానికి నాలుగు రకాల ప్లాన్ లను అందిస్తున్నది. బకాయిలను క్లియర్ చేయడానికి కస్టమర్ యొక్క బ్యాలెన్స్ నుండి బిఎస్ఎన్ఎల్ తరువాత ఎంత మొత్తాన్ని స్వీకరిస్తుంది అన్న దాని మీద ఎటువంటి స్పష్టమైన వివరణ లేదు.


Click it and Unblock the Notifications








