BSNL అదరగొట్టేసిందిగా.. కేవలం రూ. 1499కే 365 రోజుల వ్యాలిడిటీ!
BSNL Prepaid Recharge : గత కొన్ని నెలలుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ టెలికాం సంస్థలకు దీటుగా కస్టమర్లకు సేవలను అందిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అనేక ప్రయోజనాలు అందిస్తూ ప్రజలను తెగ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే 17 ఏళ్ల తర్వాత బిఎస్ఎన్ఎల్ సంస్థ లాభాల్లోకి వచ్చిన సంగతి విధితమే.
ఎప్పటికప్పుడు బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా కొత్త ప్లాన్లను తీసుకొని వస్తూ ప్రవేట్ నెట్వర్క్ సంస్థలకు గట్టి పోటీని ఇస్తుంది. ఇకపోతే తాజాగా మరో బ్లాక్ బ్లాస్టర్ రీఛార్జ్ ను తీసుకొని వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

BSNL రూ. 1,499 ప్లాన్:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇది సంవత్సరం పొడవునా ( 365 రోజులు) సిమ్‌ను యాక్టీవ్ గా ఉంచడంతో పాటు సరసమైన ధరలో అపరిమిత కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1,499గా నిర్ణయించబడింది. ఇందులో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 24 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
ఈ ప్లాన్‌లో డేటాకు రోజువారీ పరిమితి లేకపోవడం ఒక ప్రత్యేకత. సాధారణంగా ఈ ప్లాన్‌కు 336 రోజుల చెల్లుబాటు ఉంటుంది. కానీ, హోలీ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అదనంగా 29 రోజులు చెల్లుబాటును జోడించింది. అంటే ఇప్పుడు మొత్తం 365 రోజులు ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్ వార్షిక రీచార్జ్ ఎంపిక కోసం వెతుకుతున్న వారికి అనువైనది. రూ. 1,499 ధరకే సంవత్సరం పొడవునా సేవలను అందించడంతో రీఛార్జ్ ఖర్చును తగ్గిస్తుంది. నిజానికి ఎవరైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ ను రెండో సిమ్ గా వాడుతున్న వారు, సిమ్ కార్డును ఎప్పుడు యాక్టివ్ గా ఉంచేందుకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ.
BSNL రూ. 2,399 ప్లాన్:
ఇకపోతే, బీఎస్ఎన్ఎల్ మరో దీర్ఘకాలిక ప్లాన్‌ను కూడా రూ. 2,399 ధరతో అందిస్తోంది. ఈ ప్లాన్ 395 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. హోలీ ఆఫర్‌లో భాగంగా 425 రోజుల వరకు ప్లాన్ వ్యాలిడితిని పొడిగించింది. ఇది నిజంగా ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్ లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది కూడా. ఈ రేచర్జ్ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి.
BSNL Holi Dhamaka continues!
— BSNL India (@BSNLCorporate) March 19, 2025
With the ₹1499 plan, enjoy 365 days of unlimited calls, 24GB of data, and 100 SMS per day—because the celebration never stops.
Visit our website for more: https://t.co/OlK8NMwIdK#BSNLIndia #HoliDhamaka #HoliKeRangBSNLKeSang pic.twitter.com/B6e3ejYwFz
ఏ ప్లాన్ బెటర్?
ఈ రెండు ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్, యాప్, థర్డ్-పార్టీ రీచార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫ్‌లైన్ రీచార్జ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సరసమైన ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. రోజువారీ డేటా పరిమితి లేని వారికి రూ. 1,499 ప్లాన్, దీర్ఘకాలిక వినియోగంతో పాటు డేటా కోసం రూ. 2,399 ప్లాన్ రెండూ వినియోగదారుల అవసరాలను బట్టి ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఈ ఆఫర్‌లు హోలీ పండుగ సందర్భంగా మరింత ఉపయోగకరంగా మారాయి. ఎందుకంటే, అదనపు చెల్లుబాటు రోజులు వినియోగదారులకు మరింత విలువను జోడిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లతో తన వినియోగదారులకు ఆర్థికంగా సమర్థవంతమైన, నమ్మదగిన టెలికాం సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








