జియోతో పోటీకి సై..దుమ్మురేపుతున్న Bsnl కొత్త ఆఫర్లు

Written By:

టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని టెల్కోలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రైవేట్ టెలికం సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ..సమ్మర్ డాటా బొనాంజా పేరుతో ప్రత్యేక డాటా ఆఫర్లను ప్రకటించింది. ఆపర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జీమెయిల్ వాడుతున్నారా, ఈ ప్రమాదకర వార్త మీ కోసమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.78లతో రీచార్జి

రూ.78లతో రీచార్జి చేసుకున్న వారు ఐదు రోజుల్లో 2.2 జీబీ డాటాను వాడుకోవచ్చు.

రూ.98లకు

అలాగే రూ.98లకు 1.2 జీబీ డాటాను 14 రోజుల్లో, రూ.155లకు 2.2 జీబీని 15 రోజుల్లో వినియోగించుకోవచ్చు.

రూ.156

రూ.156తో 3.2జీబీని 10 రోజుల్లో, రూ.198తో రీచార్జి చేసుకున్న వారు 3.2 జీబీ డాటాను 24 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రూ.212

దీంతోపాటు 30 రోజుల కాలపరిమితితో రూ.212తో రీచార్జ్ చేసుకున్నవారు 10 జీబీ డాటాను పొందవచ్చునని తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌టీవీ రూ. 3099

అదేవిధంగా కాంబో ఎస్‌టీవీ రూ. 3099 రీచార్జీతో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 1500 ఎస్‌ఎంఎస్, రోజుకు 80 కేబీపీఎస్ స్పీడ్‌తో 1జీబీ డాటాను, 90 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL launches 'Summer Data Bonanza' - Extra Data Offer on prepaid 3G Data STVs from 7th May 2017 on wards in all the circles read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot