జీమెయిల్ వాడుతున్నారా, ఈ ప్రమాదకర వార్త మీ కోసమే !

Written By:

మీరు జీమెయిల్‌ వాడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వార్త గురించి తెలుసుకోవాల్సిందే. హ్యాకర్స్ కొత్త రకం దాడులతో జీ మెయిల్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. కొత్త రకం ఫైళ్లను పంపి మీ ఖాతాలను హ్యాక్ చేస్తున్నట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. గూగుల్ డాక్ అనే కొత్త రకం ఫైళ్లతో హ్యాకర్లు మన ఖాతాల మీద విరుచుకుపడుతున్నారు.

ధన్ ధనా ధన్ ఆఫర్‌కు క్లీన్ చిట్, మీకు తెలియని విషయాలు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌ డాక్‌ ఫైళ్లను

మీకు ఎవరి నుంచైనా గూగుల్‌ డాక్‌ ఫైళ్లను మీకు షేర్‌ చేసినట్లు ఈమెయిల్‌ వచ్చిందా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మెయిల్‌ తెరవకండి. వెంటనే ఇన్‌బాక్స్‌ నుంచి ఆ మెయిళ్లను డిలీట్‌ చేయడం మేలు.

జీమెయిల్‌ ఖాతాలపై హ్యాకర్లు

ఇప్పుడు జీమెయిల్‌ ఖాతాలపై హ్యాకర్లు కొత్తరకం దాడులకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమైన ఫైళ్లు పంపినట్లుగా జీమెయిల్‌ ఖాతాదారులను నమ్మిస్తూ వారి ఖాతాలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని నిపుణులు గుర్తించారు.

ఆ లింకును క్లిక్‌ చేస్తే

మీకు తెలిసిన వ్యక్తి ఈ ఫైల్‌ను షేర్‌ చేశాడు. ఆ ఫైల్‌ను గూగుల్‌ డాక్స్‌లో ఓపెన్‌ చేయండంటూ హ్యాకర్లు లింకును పంపిస్తారు. ఆ లింకును క్లిక్‌ చేస్తే అల్లో అనే బటన్‌ వస్తుంది. ఆ బటన్‌ను నొక్కితే చాలు.. మన గూగుల్‌ ఖాతాను పూర్తిగా హ్యాకర్ల వాడుకునే వీలుంటుందట.

మన కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరికీ

అంతేకాదు.. మన కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరికీ మన పేరుతోనే ఆ ప్రమాదకర ఈమెయిల్‌ వెళ్తుందట. దాంతో ఇతరులు కూడా హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌ డాక్స్‌ రూపంలో వస్తున్న నకిలీ ఈమెయిళ్లపై

జీమెయిల్‌ ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ కొత్తరకం దాడుల విషయంపై గూగుల్‌ స్పందించింది. గూగుల్‌ డాక్స్‌ రూపంలో వస్తున్న నకిలీ ఈమెయిళ్లపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. అలాంటి లింకులను క్లిక్‌ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని ట్విటర్‌లో కోరింది.

లింకులను క్లిక్‌ చేసినట్లయితే

ఇప్పటికే ఎవరైనా అలాంటి లింకులను క్లిక్‌ చేసినట్లయితే గూగుల్‌ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఖాతాకు ఏఏ యాప్‌లు అనుసంధానమై ఉన్నాయో చూసుకోవాలి.

సెక్యూరిటీ అండ్‌ కనెక్టెడ్‌

ఇందుకోసం గూగుల్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యి సెక్యూరిటీ అండ్‌ కనెక్టెడ్‌ యాప్స్‌ అనే ట్యాబ్‌ క్లిక్‌ చేయాలి. అందులో గూగుల్‌ డాక్స్‌ కనిపిస్తే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Google Docs attack took over a million Gmail accounts in an hour read more at gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot