బిఎస్ఎన్ఎల్‌ కొలువుల జాతర, రూ. 80 వేల జీతం

Written By:

ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాల వేటకు తెరలేపింది. న్యూ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న కంపెనీలో మేనేజర్ల కోసం నోటిఫికేషన్ వెలువరించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఇందులో సీనియర్ జనరల్ మేనేజర్లు అలాగే జనరల్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ సారి ఎయిర్‌సెల్ ఆఫర్లతో దుమ్మురేపింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

18 పోస్టులకు నోటిఫికేషన్

మొత్తం 18 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. టెలికాం ఫైనాన్స్ రంగంలో సీనియర్ జనరల్ మేనేజర్లు అలాగే జనరల్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి.

సంబంధిత రంగాల్లో అనుభవం

ఈ పోస్టులకు అప్లయి చేయాలనుకున్న వారికి సంబంధిత రంగాల్లో అనుభవం అవసరం. దీంతో పాటు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ గ్రేడ్ లో రెగ్యులర్ అనుభవం ఉండాలి. లేదా అదే రంగంలో ఇతర అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిఎస్ఎన్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులకు

ప్రత్యేకించి ఇండియన్ పోస్ట్, టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ రంగంలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. బిఎస్ఎన్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులకు సైతం అధిక ప్రాధాన్యత ఉంటుంది.

అర్హత వయస్సు 56 సంవత్సరాలు

పోస్టుకు అర్హత వయస్సు 56 సంవత్సరాలు. అంతకు మించి ఉంటే వారు అనర్హులు. రెండు రకాల టెస్ట్ లు పాస్ కావాల్సి ఉంటుంది. పరీక్షతో పాటు పర్సనల్ ఇంటర్యూ ఉంటుంది.

నెలకి రూ. 62 వేల నుంచి రూ. 80 వేల వరకు జీతం

సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకి రూ. 62 వేల నుంచి రూ. 80 వేల వరకు జీతం ఉంటుంది. అప్లికేషన్లు పంపించుటకు చివరి తేదీ నవంబర్ 30.

చిరునామా

ఉద్యోగానికి అప్లయి చేయాలనుకున్న వారు ఈ చిరునామాకు మీ వివరాలు, అలాగే అనుభవాన్ని తెలిపే డాక్యుమెంట్లు పంపగలరు. చిరునామా The office of the Deputy General Manager (SEA), Bharat Sanchar Nigam Limited (BSNL), SEA Section Corporate Office, 7th Floor, Bharat Sanchar Bhawan, Janpath, New Delhi - 110001'

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL New Delhi is looking for Managers: Salary is Rs 80,000 per month, apply now read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot