BSNL నుంచి వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్... 4G అప్‌గ్రేడ్ ఫ్రీగా....
బిఎస్‌ఎన్‌ఎల్ తన 2G / 3G నెట్‌వర్క్ సైట్‌లను 4Gకి అప్‌గ్రేడ్ చేయడానికి వేగంగా పనిచేస్తోంది. ఇతర టెల్కోలకు బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కఠినమైన గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ పోటీ ఎలా ఉండబోతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్ దాదాపు ఐదేళ్ల ఆలస్యంగా 4G మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నది.

రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ వంటి ఇతర టెల్కోలు ఇప్పటికే ఇండియాలో తన 4G నెట్‌వర్క్ లను ప్రారంభించి చాలా మంది కస్టమర్లను సంపాదించాయి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన 4G మొబైల్ సేవలను ప్రారంభిస్తున్నందున ఇతర టెల్కోల నుంచి ఎంత మొత్తంలో కస్టమర్ బేస్ను రాబడుతుందో వేచి చూడాలి.

ఇతర టెల్కోలు కూడా పోటీలో ముందు వరుసలో ఉండడానికి ఒకరికి మించి ఒకరు అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కావున బిఎస్ఎన్ఎల్ సంస్థ మిగిలిన సంస్థల ఆఫర్లను అధిగమించి కస్టమర్లను ఆకర్షించగల అద్భుతమైన ఆఫర్లతో ముందుకు వస్తే కనుక కస్టమర్ బేస్ ను పెంచుకోగలదు. అలాంటి ఒక ఆఫర్ తో బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఇది మీ ప్రస్తుత BSNL సిమ్ కార్డును 4G సిమ్ కార్డుకు ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ 4G సిమ్ అప్‌గ్రేడ్ స్కీమ్
బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ అప్‌గ్రేడ్ స్కీమ్ యొక్క ఆఫర్ ను కేవలం పరిమిత కాలానికి మాత్రమే ఉంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో ఈ ఆఫర్ ను కేవలం 90 రోజుల వరకు మాత్రమే ఉంచింది. కాబట్టి మీలో ఎవరైనా బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వాడుతూ ఉంటే కనుక దానిని ఎటువంటి ఖర్చు లేకుండా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

అప్‌గ్రేడ్ విధానం
అప్‌గ్రేడ్ విధానంతో మీ ప్రస్తుత సిమ్ కార్డులను మార్చబడి మీకు కొత్త 4G సిమ్ కార్డు అందించబడుతుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో చెల్లుతుంది. ఇది ఏప్రిల్ 1, 2020 న ప్రారంభించబడింది. ఇందులో గమనించదగ్గ మరొక విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ లో చేరి రూ.100 లకు పైగా రీఛార్జ్ చేస్తున్న కొత్త కస్టమర్లు 4G సిమ్ కార్డును ఉచితంగా పొందవచ్చు. ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంతో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుత వినియోగదారులకు 4G సిమ్ కార్డును ఉచితంగా పొందే అవకాశం లభించింది.

4G సేవలతో బిఎస్‌ఎన్‌ఎల్ సవాళ్లు
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే 4G సేవలు ఇన్ని రోజులు లేకపోవడం. ప్రస్తుతం ఉన్న సైట్‌లలో 4G సేవలతో ఇతరులకు పోటీగా అద్భుతమైన ప్రయోజనాలను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ కంపెనీలను స్వయంచాలకంగా మినహాయించే విధంగా కాంట్రాక్టులు ఇవ్వడం కోసం టెలికాం ఎక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (TEPC) టెల్కోను అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చే ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి వ్యతిరేకం అని TEPC గుర్తించింది. ఏదేమైనా ఇప్పుడే సైట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ZTE మరియు నోకియా ఒప్పందాలను బిఎస్‌ఎన్‌ఎల్ ఆమోదించింది. అతి త్వరలో 4G మార్కెట్లో వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌ను చూడవచ్చు.


Click it and Unblock the Notifications








