BSNL Work@Home Broadband Plan ఉచిత ఆఫర్ మీద మరో గుడ్ న్యూస్...

|

ప్రభుత్వ యాజమాన్యంలోని సర్వీస్ ప్రొవైడర్ బిఎస్‌ఎన్‌ఎల్ వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లభ్యతను 2020 మే 19 వరకు విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ తన సర్కిల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. ట్విట్టర్ హ్యాండిల్ షేరింగ్ ద్వారా ఒక ఫోటోను కూడా అప్‌లోడ్ చేశారు.

బిఎస్‌ఎన్‌ఎల్ వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్

బిఎస్‌ఎన్‌ఎల్ వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులు 5GB రోజువారీ డేటాను 10Mbps వేగంతో పొందవచ్చు. ఒక రోజులో 5GB డేటా అయిపోయిన తరువాత దాని యొక్క వేగం 1 Mbps కి తగ్గించబడుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మొదట మార్చిలో ప్రారంభమైనప్పుడు ఏప్రిల్ 14 తో ముగుస్తుంది అని ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ ను పొడిగించినందున ప్రజలు తమ ఇళ్ల నుండి పని చేయాల్సిన సమయం మరి కొన్ని రోజులు పెరిగింది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటును మే 19 వరకు పొడిగించింది. టెల్కో అందిస్తున్న ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

BSNL వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ప్రస్తుత సమయంలో ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడం వలన వారు ఉపయోగించే డేటా వినియోగం కూడా డిమాండ్ కంటే రెండు రెట్లు పెరిగింది. దీనిని గ్రహించిన బిఎస్ఎన్ఎల్ తన వర్క్ @ హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తో ఉచితంగా వచ్చింది. ఈ ప్లాన్ లో ఉన్న ఏకైక విషయం ఏమిటంటే క్రొత్త కస్టమర్‌లు దీనిని తమకు తాముగా పొందలేరు. టెల్కో యొక్క ప్రస్తుత కస్టమర్లు మాత్రమే ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. మీరు ఎటువంటి భద్రతా రహిత లేదా ఇన్‌స్టాలేషన్ ఖర్చును అందించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి BSNL 5GB రోజువారీ ఇంటర్నెట్‌ను 10 Mbps వేగంతో అందిస్తుంది. రోజువారీ పరిమితి ధాటిని తరువాత దీని యొక్క వేగం 1 Mbps కు తగ్గించబడుతుంది.

BSNL వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను పొందడం ఎలా?

BSNL వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను పొందడం ఎలా?

BSNL వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మాత్రం మీరు టెల్కో యొక్క ఇప్పటికే ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారు అయి ఉండాలి. ఒకవేళ మీరు కాకపోతే మీరు దాని కోసం దరఖాస్తు చేయలేరు. టోల్ ఫ్రీ బిఎస్ఎన్ఎల్ - 1800-345-1504 ను సంప్రదించి ఈ సర్వీసును పొందవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. మీరు మీ సాధారణ ల్యాండ్‌లైన్ బిల్లును మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. బిఎస్ఎన్ఎల్ నుండి ఈ చర్య దాని ప్రస్తుత ల్యాండ్లైన్ వినియోగదారులను బ్రాడ్బ్యాండ్ వినియోగదారులుగా మార్చడానికి ప్రేరేపించడం. అదే సమయంలో ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు బిఎస్ఎన్ఎల్ నుండి ఉచిత ఇంటర్నెట్ సేవల సహాయంతో తమ పనిని సజావుగా చేసుకోవచ్చు. కనుక ఇది బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఇది అదనపు ప్రయోజనం.

బిఎస్ఎన్ఎల్ Rs 5,999, Rs 9,999 and Rs 16,999 భారత్ ఫైబర్ ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ Rs 5,999, Rs 9,999 and Rs 16,999 భారత్ ఫైబర్ ప్లాన్‌

భారత్ ఫైబర్ ప్లాన్‌లలో ప్రీమియం విభాగానికి వస్తే రూ.5,999 ప్లాన్ రోజుకు 80 జిబి డేటాను మరియు రూ .9,999 ప్లాన్ రోజుకు 120 జిబి డేటాను అందిస్తాయి. రూ .16,999 ధర వద్ద గల భారత్ ఫైబర్ ప్లాన్ వినియోగదారుడికి 170 జిబి రోజువారీ డేటాను వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. మూడు ప్లాన్‌లు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో వస్తాయి. ఎఫ్‌యుపి తర్వాత దీని యొక్క వేగం 10Mbps కు తగ్గించబడుతుంది.

బిఎస్ఎన్ఎల్ 33GB, 40GB and 55GB  భారత్ ఫైబర్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ 33GB, 40GB and 55GB భారత్ ఫైబర్ ప్లాన్

రోజువారీ డేటా పరిమితితో బిఎస్ఎన్ఎల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.1,277 ధర వద్ద లభిస్తుంది. రూ.1,999 భారత్ ఫైబర్ ప్లాన్ 100 ఎంబిపిఎస్ వేగంతో రోజుకు 33GB డేటాను అందిస్తుంది. రూ .2,499 ప్లాన్ రోజుకు 40 జిబి డేటాను అందిస్తుంది. చివరగా 55 జీబీ డైలీ డేటా ప్లాన్ రూ.4,499 ధర వద్ద లభిస్తుంది. పైన పేర్కొన్న మూడు ప్రణాళికలు 100 Mbps వేగం మరియు FUP పరిమితి తర్వాత 4 Mbps వేగంను అందిస్తాయి.

బిఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్ ప్రయోజనాలు

సూపర్ స్టార్ 300 ప్లాన్ మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన సూపర్ స్టార్ 500 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తుంది. డేటా ప్రయోజనం విషయానికి వస్తే ఇది 500GB FUP డేటా పరిమితిని 50 Mbps వేగంతో అందిస్తుంది. అలాగే FUP పరిమితి తరువాత డేటా యొక్క వేగం 2Mbps కి తగ్గించబడుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Work@Home Broadband Plan Free Offer Validity Extended

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X