Home
News

చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ ను అందిస్తున్న BSNL

చౌకైన ప్లాన్‌లలో కూడా ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌న్ని అందించే విధంగా బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను బిఎస్‌ఎన్‌ఎల్ సవరించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్లేయర్ ఇప్పుడు 499 రూపాయల కంటే తక్కువ ధరతో కూడిన ప్లాన్‌లలో కూడా ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని అందిస్తుంది.

bsnl offers free amazon prime subscription with broadband plans under rs 499

గతంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ రూ.745 కంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లతో అందించబడేది. వార్షిక ప్రైమ్ మెంబర్ షిప్ కాస్ట్ రూ.999 లను పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి ఒప్పందంగా అనిపిస్తుంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కొన్ని మార్పులతో ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌న్ని అందిస్తోంది.

bsnl offers free amazon prime subscription with broadband plans under rs 499

అంతే కాకుండా తన వార్షిక ప్రణాళికలపై క్యాష్‌బ్యాక్ ప్లాన్‌న్ని కూడా మార్చింది.ఇప్పటికే ఉన్న మరియు కొత్త బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ చందాను 499 రూపాయల కన్నా తక్కువగా వున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో ఉచితంగా పొందవచ్చు.

BSNL యొక్క ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌న్ని ఎలా పొందాలి :

BSNL యొక్క ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌న్ని ఎలా పొందాలి :

బిఎస్ఎన్ఎల్ రూ. 745 కంటే ఎక్కువ ధరల వద్ద తీసుకున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆపరేటర్ ప్రైమ్ ప్రయోజనాలను అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలపై తన క్యాష్‌బ్యాక్ పథకంలో కూడా మార్పులను ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై 25 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అనుమతించబడిన ప్లాన్‌లలో DSL, భారత్ ఫైబర్ మరియు BBoWiFi ఉన్నాయి. 900 రూపాయల లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకునే ప్రస్తుత మరియు కొత్త కస్టమర్‌లు ప్రతి ఒక్కరు క్యాష్‌బ్యాక్ ఆఫర్ మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వానికి రెండింటికి అర్హులు.

క్యాష్‌బ్యాక్ ఎంత లభిస్తుంది:

క్యాష్‌బ్యాక్ ఎంత లభిస్తుంది:

499రూపాయల కన్నా తక్కువ ధరతో వున్న ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ 15 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే 499 నుంచి 900 రూపాయల మధ్య గల ప్లాన్‌లపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. 900రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధర గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 25 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందడానికి బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు 12 నెలల పాటు ఒకే ప్లాన్‌ను ఎంచుకోవాలి. బిఎస్ఎన్ఎల్ అదనపు ప్రయోజనం కోసం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌న్ని ఉచితంగా అందిస్తోంది.

 ప్రయోజనాలు:

ప్రయోజనాలు:

ఒక్కమాటలో చెప్పాలంటే బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్రతి వార్షిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 25 శాతం క్యాష్‌బ్యాక్ మరియు రూ .999ల విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌న్ని అందిస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్‌తో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, ఫాస్ట్ షిప్పింగ్ మరియు అమ్మకాల సమయంలో అన్ని ఒప్పందాలకు త్వరిత యాక్సిస్ లభిస్తుంది. ఈ సంవత్సరం 2019 జూలై 15 మరియు జూలై 16 న జరుగుతున్న ప్రైమ్ డే సందర్భంగా కూడా మీరు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు లేకుండా వార్షిక ల్యాండ్‌లైన్ ప్లాన్‌లపై కూడా క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వార్షిక ప్రణాళిక తీసుకున్నప్పుడు వినియోగదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
bsnl offers free amazon prime subscription with broadband plans under rs 499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X