మే 1 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్

|

దేశీయంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ల సంఖ్యను మరింత విస్తరింపచేసేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రాత్రివేళల్లో అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని ప్రకటించింది. మే 1వ తేది నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వస్తుంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కలిగి ఉన్న యూజర్లు ఏ ప్యాకేజీలో ఉన్నప్పటికి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్ లేదా ఏ ఫోన్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆఫర్ ఏ స్కీమ్ లేదా ప్యాకేజీలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌కైనా వర్తిస్తుంది. (ఇంకా చదవండి: యూట్యూబ్‌ మొదటి వీడియోకు 10 సంవత్సరాలు)

మే 1 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్

మొబైల్‌ మార్కెట్‌ను కైవసం చేసుకున్న ప్రైవేటు టెలికం ఆపరేటర్లు ల్యాండ్‌లైన్‌ మార్కెట్‌లోకి కూడా దూసుకొస్తుండడంతో బీఎస్ఎన్ఎల్ ఈ అన్‌లిమిటెడ్‌ దారిలోకి వచ్చిందని విశ్లేషకుల అంచనా. రాత్రంతా ఫ్రీ: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్, మార్కెటింగ్ నిలుపుకు మొబైల్‌ ఫోన్లలో పెద్దగా ప్రభావం లేకున్నా ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్లలో మాత్రం దేశంలో బీఎస్ఎన్ఎల్‌దే పైచేయి. ఇలాంటి మార్కెట్‌లోకి ప్రైవేట్‌ ఆపరేటర్లు వస్తున్నారు.

మే 1 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్

ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,62,556 మంది కస్టమర్లను బీఎస్ఎన్ఎల్ కోల్పోయింది. వీరిలో ఎక్కువ మంది ఎయిర్‌టెల్‌ కనెక్షన్లను తీసుకున్నారు. అయినా ఇప్పటికీ దేశంలోని ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లలో 62.26 శాతం బీఎస్ఎన్ఎల్‌వే.

దేశంలో 96 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉంటే, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 2.70 కోట్లకు పడిపోయింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. గత ఫిబ్రవరి ఆఖరుకు దేశంలో బీఎస్ఎన్ఎల్‌కు 1.66 కోట్ల ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పథకం వల్ల ల్యాండ్ లైన్ ఫోన్లకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, దీనిని ఆరు నెలల తర్వాత సమీక్షిస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.

Best Mobiles in India

English summary
BSNL offers free calls on landline phones at night from May 1. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X