రోజుకు 5GB డేటాతో ప్రైవేట్ టెల్కోలకు అందనంత ఎత్తులో BSNL

|

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రీపెయిడ్ చందాదారులకు రూ.599 రీఛార్జి ప్లాన్ ని అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ.599 ప్లాన్ ఎయిర్టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా సంస్థల రూ.600 లోపు లంబించే ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే 84 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కాకపోతే డేటా బెనిఫిట్ విభాగంలో మాత్రం అన్నిటికి భిన్నంగా రోజుకు 5GB డేటాను అందిస్తోంది. కేరళ, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, గుజరాత్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ వంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రారంభించింది. కావున తెలుగు రాష్ట్రాలలో బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ టెల్కో రూ.599 ధర వద్ద అపరిమిత కాంబో పేరుతో అందించే రీఛార్జ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటుగా రోజుకు 5GB డేటా బెనిఫిట్స్‌తో 84 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. FUP పరిమిత డేటా యొక్క మొత్తం ప్రయోజనం చెల్లుబాటు కాలంలో 420GB వరకు ఉంటుంది. ఇంత మొత్తం డేటా ప్రయోజనం ఈ ప్రైవేట్ టెల్కో అందివ్వకపోడం గమనార్హం. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలలో 4G సేవలు అందుబాటులో ఉన్నందున ప్రైవేట్ టెల్కోల కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది.

అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో BSNL ప్లాన్లు
 

అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో BSNL ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనంతో లభిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్లు ఇప్పటికీ రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితిని నివేదించలేదు. జనవరి 10, 2021 నుంచి బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాలింగ్ పై FUP పరిమితిని తొలగిస్తున్నట్లు గత వారంమే ప్రకటించింది కానీ బిఎస్ఎన్ఎల్ అధికారిక ధృవీకరణను ఇంకా విడుదల చేయలేదు. PV1,999 మరియు PV 2,399 ప్లాన్ లు రోజుకు 250 నిమిషాల పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఇప్పటికే అందిస్తున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ ధృవీకరించింది. కాబట్టి ఈ మార్పు ఇతర ప్లాన్ లకు కూడా ప్రభావవంతంగా ఉండవచ్చు.

BSNL vs ప్రైవేట్ టెల్కోస్

BSNL vs ప్రైవేట్ టెల్కోస్

బిఎస్ఎన్ఎల్ సంస్థ రూ.599 ధర వద్ద గల రీఛార్జి ప్లాన్ తో అందించే అందించే డేటా ప్రయోజనాలు ప్రైవేట్ టెల్కోస్ అందించే ప్రయోజనాలతో పోలిస్తే అందనంత మైళ్ళ దూరంలో ఉంది. ప్రైవేట్ టెల్కోలు రోజుకు 1.5GB డేటా లేదా రోజుకు 2GB డేటాను రూ.600 ధర వద్ద మరియు దాని కంటే తక్కువ ధర వద్ద లభించే ప్లాన్ లతో అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 4G సేవలు లేకపోవడం అనేది బిఎస్‌ఎన్‌ఎల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో బిఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్ ఉన్నందున రూ.599 రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ధర వద్ద రోజుకు 2GB పొందడం కంటే 5GB పొందడం ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా మన రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ సమస్య లేకపోవడం గమనార్హం.

Best Mobiles in India

English summary
BSNL Rs.599 Prepaid Plan Offers 5GB Daily Data: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X