BSNL Prepaid Plans:తక్కువ ధరలో రోజువారీ 3GB డేటాను అందిస్తున్న ప్లాన్‌లు

|

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశం అంతటా వాయిస్ మరియు డేటా ఆధారిత కామన్ ఫీచర్లతో కూడిన ప్లాన్‌ల జాబితాలో మరిన్ని ప్లాన్ లను చేర్చుకున్నది. ముఖ్యంగా ఈ ఆపరేటర్ భారతదేశంలో టెలికం ఆపరేటర్ అందించే గరిష్ట డేటా ప్రయోజనాలలో 3GB రోజువారీ డేటాను అందించే మూడు వేర్వేరు ప్లాన్‌లను తన జాబితాలో చేర్చింది.

బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ తన డబుల్ డేటా ఆఫర్‌లో భాగం రోజువారీ 4GB డేటాను అందిస్తుండగా ఈ ప్లాన్‌లు రాబోయే నెలల్లో మార్కెట్ నుండి కనుమరుగయ్యే అవకాశం ఉంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్లాన్‌లు భారతదేశం అంతటా అనేక సర్కిళ్ళలో అందుబాటులో ఉన్నాయి. అయితే అండమాన్ మరియు నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్‌లతో సహా నిర్దిష్ట సర్కిల్‌లలో ఈ ఆపరేటర్ కొన్ని ప్లాన్‌లను అందించడం లేదు. బిఎస్ఎన్ఎల్ సంస్థ దేశంలో 3GB రోజువారీ డేటాను అందించే నిర్దిష్ట ప్లాన్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: ఇండియన్ ఇంజినీర్ చేసిన పనికి ఆశ్చర్యపోయిన నాసా శాస్త్రవేత్తలు!!!

BSNL డేటా రూ.78 ప్లాన్
 

BSNL డేటా రూ.78 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా 78 ప్లాన్ కేవలం ఎనిమిది రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి వరకు భారతదేశం అంతటా అపరిమిత కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. డేటా 78 ప్లాన్ రోజుకు 3GB FUP పరిమితిని దాటిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 80 Kbps కు తగ్గించి అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ 8 రోజుల పాటు ఈరోస్ నౌ వినోద సేవలకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అనుమతిస్తుంది. Also Read:Realme Narzo 10A Sale : కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను తగ్గింపు ధర వద్ద పొందే గొప్ప అవకాశం....

BSNL డేటా రూ.78 ప్లాన్ లభ్యత

BSNL డేటా రూ.78 ప్లాన్ లభ్యత

బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా 78 ప్లాన్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్, చండీగడ్, చెన్నై, డామన్ మరియు డియు, దాద్రా మరియు నగర్ హవేలి, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లతో సహా నిర్దిష్ట సర్కిల్‌లలో లభిస్తుంది. జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడఖ్, లక్షద్వీప్, ఒడిశా, పంజాబ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, యుపి ఈస్ట్, యుపి వెస్ట్, ఉత్తరాఖండ్ లోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు డేటా 78 ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందవచ్చు. Also Read:Amazon- Airtel $2 బిలియన్ల పెట్టుబడుల ఒప్పందం మీద క్లారిటీ ఇచ్చిన ఎయిర్‌టెల్‌

బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌టివి 247 ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌టివి 247 ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క STV 247 ప్లాన్ వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటుతో రోజుకు 100 SMSలను మరియు రోజుకు 250 నిమిషాల FUP పరిమితితో అపరిమిత కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. STV 247 ప్లాన్ 3GB రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత డేటా వేగాన్ని 80 Kbps కు తగ్గించి అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అండమాన్, నికోబార్ దీవులతో సహా భారతదేశంలోని చాలా సర్కిల్‌లలో నెలకు రూ.247 ధర గల ఎస్‌టివి 247 ప్లాన్ అందుబాటులో ఉంది.

బిఎస్ఎన్ఎల్ PV 997 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ PV 997 ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్‌ యొక్క ప్లాన్ వోచర్ (పివి) 997 ప్లాన్‌ను మొదటి రీఛార్జ్ కూపన్‌గా (FRC) ఉపయోగించవచ్చు. ఇది వినియోగదారులకు 180 రోజుల చెల్లుబాటు కాలంలో అపరిమిత కాల్‌లు చేయడానికి మరియు అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇతర బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌ల మాదిరిగానే అపరిమిత కాల్‌లకు రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితి ఉంటుంది. అయితే ఆపరేటర్ రోజుకు 3GB తర్వాత వేగాన్ని 80Kbps ‌కు తగ్గిస్తుంది. పివి 997 ప్లాన్ యూజర్లు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపవచ్చు. అదనంగా, బిఎస్ఎన్ఎల్ తన వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (PRBT) సేవలో రెండు నెలల కాలర్ ట్యూన్లను అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Offers 3GB Daily Data: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X