Amazon- Airtel $2 బిలియన్ల పెట్టుబడుల ఒప్పందం మీద క్లారిటీ ఇచ్చిన ఎయిర్‌టెల్‌

|

అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో భారీగా పెట్టుబడులను పెడుతున్నది. ఇండియాలోని టెలికామ్ ఆపరేటర్లలో ఒకరైన భారతి ఎయిర్‌టెల్‌లో సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన వాటాను అమెజాన్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

Amazon- Airtel ఒప్పందం

Amazon- Airtel ఒప్పందం

ఈ కొత్త ఒప్పందం పూర్తయిన తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌లో 5% వాటాను అమెజాన్‌ కొనుగోలు చేయనున్నది. ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్న చర్చలు మారవచ్చు అని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ ఇండియాలో 28.38% మార్కెట్ వాటాతో మూడవ అతిపెద్ద టెలికం ప్రొవైడర్ గా కొనసాగుతున్నది.

భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం మీద క్లారిటీ

భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం మీద క్లారిటీ

భారతీ ఎయిర్‌టెల్ ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ తమ ఉత్పత్తులను ఎయిర్‌టెల్ వినియోగదారులకు పరిచయం చేయడానికి మామూలుగా డిజిటల్ ప్లేయర్‌లతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. మేము మామూలుగా అన్ని డిజిటల్ మరియు OTT ప్లేయర్‌లతో కలిసి పని చేస్తున్నాము. అలాగే మా విస్తృత కస్టమర్ బేస్ కోసం OTT ప్లేయర్‌ల యొక్క ఉత్పత్తులు, కంటెంట్ మరియు వాటి సేవలను తీసుకురావడానికి వారితో లోతైన విషయాన్ని కలిగి ఉన్నాము. అంతకు మించి రిపోర్ట్ చేయడానికి ఇతర సమాచారం లేదు అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

అమెజాన్ నివేదిక
 

అమెజాన్ నివేదిక

అమెజాన్ ప్రతినిధి ఈ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ "భవిష్యత్తులో మనం ఏదైనా చేయగలం లేదా చేయలేకపోవడం అనే దానిపై మీరు ఊహించే ఉహాగానాలపై కంపెనీ ఎటువంటి వ్యాఖ్యలు ఇవ్వదు అని తెలిపారు.

రిలయన్స్ జియో -KKR- ఫేస్‌బుక్ ఒప్పందం

రిలయన్స్ జియో -KKR- ఫేస్‌బుక్ ఒప్పందం

ఏప్రిల్ నెల‌లో రిలయన్స్ జియో ఫేస్‌బుక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి యుఎస్ టెక్ దిగ్గజాలు భారతీయ టెలికాం ఆపరేటర్లపై ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని నివేదికలు ప్రచురించాయి. KKR జనరల్ అట్లాంటిక్ మరియు విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ కూడా గత నెలలో జియో ప్లాట్‌ఫామ్‌లలో భారీగా పెట్టుబడులను పెట్టారు. ఇండియా యొక్క జియో సంస్థలో కేవలం ఒక నెల వ్యవధిలో విదేశి సంస్థలు సుమారు 2000 కోట్ల పెట్టుబడులను పెట్టారు.

వోడాఫోన్ ఐడియా - గూగుల్

వోడాఫోన్ ఐడియా - గూగుల్

ఇండియాలోని జియో తరువాత అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న వోడాఫోన్ ఐడియాలో 5% వాటాను కొనుగోలు చేయడానికి ప్రముఖ గూగుల్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. బ్రిటీష్ టెలికాం సంస్థ వోడాఫోన్ తన ఆదాయాలలో హైలైట్ చేసినందున ఈ నివేదికలు పుట్టుకొచ్చాయి. ఏదేమైనా వోడాఫోన్ ఐడియా స్టాక్ ఎక్స్ఛేంజీలతో దాఖలు చేసిన మీడియాలో నివేదించినట్లు ఎటువంటి ప్రతిపాదన లేదు అని చెప్పారు.

 

Also Read: Jio-KKR Deal: జియో ప్లాట్‌ఫామ్‌లో KKR ₹11,367కోట్ల పెట్టుబడులు..Also Read: Jio-KKR Deal: జియో ప్లాట్‌ఫామ్‌లో KKR ₹11,367కోట్ల పెట్టుబడులు..

ఇండియాలో అమెజాన్ 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ఇండియాలో అమెజాన్ 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

భారతదేశం అంతటా జనవరి ప్రారంభంలో అమెజాన్ సంస్థ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను (MSMEs) మరియు వ్యాపారులను డిజిటలైజ్ చేయడానికి 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ గతంలో కూడా సుమారు 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఇండియాలో పెట్టింది. అమెజాన్ పెట్టుబడిలో ఎక్కువ భాగం దాని ఇ-కామర్స్ అడుగుజాడలను విస్తరించే దిశగా ఉన్నప్పటికీ రిలయన్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కూడా జియోమార్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా వాణిజ్య వ్యాపారాన్ని మెరుగుపరిచే దిశగానే ఉందని గమనించాలి.

Best Mobiles in India

English summary
Amazon Investing 2 Billion Dollors in Bharti Airtel: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X