జనవరి 1, 2021 నుండి BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరగనున్నాయి!!! ఎంతనో తెలుసా??

|

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు అన్ని టెలికాం సర్కిల్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.199 STV ప్లాన్, PV186 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు స్పష్టం చేసింది. PV186 ప్లాన్ ధరను రూ.199లకు మరియు STV199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను రూ.120కు పెంచింది. ఈ కొత్త ధరల మార్పులు రేపటి నుంచి అంటే జనవరి 1, 2021 నుండి అమలులోకి వస్తాయి. ఇండియాలోని అన్ని సర్కిల్‌లలో లభించే ఈ కొత్త ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ పెంచిన కొత్త ధరల వివరాలు

బిఎస్ఎన్ఎల్ పెంచిన కొత్త ధరల వివరాలు

PV186 పేరుతో లభించే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ధరను రూ.199కు పెంచారు. ఇప్పుడు దీనిని PV199 పేరుతో పిలుస్తారు. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రోజుకు 250 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ లలో MTNL ముంబై & డీల్లీతో సహా జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అలాగే రోజుకు 2GB డేటా మరియు 100 SMS ల ప్రయోజనాలను 28రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ కొత్త STV 201 ప్లాన్ వివరాలు

బిఎస్ఎన్ఎల్ కొత్త STV 201 ప్లాన్ వివరాలు

బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ ఇది వరకు రూ.199 ధర వద్ద STV199 పేరుతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.201కు పెంచింది. STV201 పేరుతో ఇప్పుడు లభించే ఈ ప్లాన్ హోమ్ LSAలోని ఏ నెట్‌వర్క్‌కైనా రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 1GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ STV 201 ప్లాన్‌తో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా క్రికెట్ PRBT, ఉచిత PRBT మరియు క్రికెట్ SMS అలెర్టులను కూడా బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ సంస్థ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద కొత్తగా లభిస్తున్న ధరల పెరుగుదల పెద్దది కానప్పటికి కొంతమంది వినియోగదారులు BSNL యొక్క ఈ చర్యను ఇష్టపడకపోవచ్చు. PV186 అనేది దేశంలోని అన్ని సర్కిల్‌లలో బిఎస్‌ఎన్‌ఎల్ నుండి బడ్జెట్ ధరలో లభించే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాన్‌లలో ఒకటి. ఇది ఆఫర్‌లలో భాగంగా 56GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Price Increases From January 1, 2021 !!! Do You Know How Much ??

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X