Home
News

BSNL - Eros Now ఫ్రీ ఆఫర్... ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ల మీద మాత్రమే...

ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన వ్యాపార విస్తరణను టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించాలి అని చూస్తున్నది. ఇందుకోసం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఈరోస్ నౌతో జతకట్టింది. ఆన్-డిమాండ్ వినియోగాన్ని మరియు వినోదాన్ని పెంచే ఉద్దేశ్యంతో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఈరోస్ నౌతో జతకలిసింది.

బిఎస్ఎన్ఎల్ - ఈరోస్ నౌ

బిఎస్ఎన్ఎల్ - ఈరోస్ నౌ

బిఎస్ఎన్ఎల్ యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ ల వినియోగదారులకు మాత్రమే ఈ ఈరోస్ నౌ ప్రత్యేక కంటెంట్ సభ్యత్వాన్ని అందిస్తుంది. ప్రతి చందాదారుడు ఆన్‌లైన్ కంటెంట్‌ను ఆస్వాదించేలా చూడటానికి బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఈరోస్ నౌ ప్రత్యేకమైన వోచర్‌లను సరసమైన మరియు సౌకర్యవంతంగా ధరల వద్ద నిర్ణయించాయి. బిఎస్ఎన్ఎల్ ఈరోస్ నౌతో జతకట్టిన తరువాత ఈరోస్ నౌలో అనేక రకాల ప్రీమియం కంటెంట్లను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ మరియు ఈరోస్ నౌ ప్లాన్ల వివరాలు

బిఎస్ఎన్ఎల్ మరియు ఈరోస్ నౌ ప్లాన్ల వివరాలు

బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు త్రీ-ప్యాక్ స్పెషల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ను విడుదల చేసింది. ఇది తన చందాదారులకు ఈరోస్ నౌ కంటెంట్ను ఉచితంగా అందిస్తుంది. రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జిని చందాదారులు ఎంచుకుంటే వారికి ఇతర ప్రయోజనాలతో పాటు 24 రోజులు ఈరోస్ నౌ చందాను ఉచితంగా లభిస్తుంది. అలాగే చందాదారులు రూ .298 లేదా రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జిని ఎంచుకున్న వారికి ఈరోస్ నౌ యొక్క ప్రీమియం కంటెంట్‌ను వరుసగా 54 రోజులు మరియు 60 రోజులపాటు ఆస్వాదించగలుగుతారు. BSNL యొక్క రూ.1,999 ల వన్ ఇయర్ ప్లాన్ 60 రోజుల ఈరోస్ నౌ చందాను ఉచితంగా అందిస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్

బిఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్

ఇటీవలి కాలంలో టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో అధికంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కీలకమైన వాటిలో వినోదం ఒకటి. ఈ ధోరణి రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుంది. BSNL ఎల్లప్పుడూ వినియోగదారులకు సరసమైన ధరల వద్ద అసమానమైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నది. ఈరోస్ నౌ కంటెంట్‌ను అందించే త్రీ-ప్యాక్ సబ్‌స్క్రిప్షన్ వోచర్‌లు ప్రేక్షకులకు ఉత్తమమైన ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ మరియు దాని భారీ కంటెంట్ లైబ్రరీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్‌ను అన్వేషించడానికి అనుమతిస్తుంది అని బిఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ (సిఎం) సుశీల్ కుమార్ మిశ్రా అన్నారు.

ప్రీమియం మీడియా సర్వీస్

ప్రీమియం మీడియా సర్వీస్

ఓవుమ్-అమ్డాక్స్ నివేదిక ప్రకారం మొబైల్ వినియోగదారులలో దాదాపు 50% మంది టెలికాం ఆపరేటర్లు ప్రీమియం సేవలను ఉచితంగా లేదా రాయితీ ధర వద్ద ఎంచుకుంటారు. మొబైల్ వినియోగదారులు వినోదం వంటి వాటి ప్రయోజనం యొక్క అవసరాలను తీర్చగల సేవలు మరియు ఆఫర్లను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి టెలికాం ఆపరేటర్లు OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా అందిస్తున్నారు.

 

 

 

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ల చెల్లుబాటు పొడిగింపు

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ల చెల్లుబాటు పొడిగింపు

బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ చందాదారుల అకౌంట్ చెల్లుబాటును ఏప్రిల్ 20, 2020 వరకు పొడిగించింది. ఇది మాత్రమే కాదు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా రూ.10 టాక్ టైమ్ క్రెడిట్ను కూడా అందిస్తోంది. లాక్డౌన్ వ్యవధిలో చందాదారులకు సహాయం చేయడానికి క్యారియర్ చేసిన చర్య ఇది. అలాగే తక్కువ-ఆదాయ సమూహానికి చెందిన చందాదారులు వారి అకౌంట్ బ్యాలెన్స్ సున్నా అయినప్పటికీ ముందు జాగ్రత్తగా లాక్డౌన్ వ్యవధిలో వారి ప్రియమైన మరియు సన్నిహితులతో కనెక్ట్ అవ్వగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Provide Free Eros Now Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X