BSNL నుంచి ఊహించని షాక్!!!! ఏమిటో చూడండి....

|

బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఇప్పుడు మార్పులు చేసింది. బిఎస్ఎన్ఎల్ సంస్థ తన ప్రసిద్ధ రూ .1,699 వార్షిక ప్లాన్‌ యొక్క చెల్లుబాటును అధికారికంగా 300 రోజులకు తగ్గించింది. బిఎస్‌ఎన్‌ఎల్ నుండి అపరిమిత కాంబో వార్షిక ప్లాన్‌లలో ఇటీవల ప్రారంభించిన రూ.1,999 ప్యాక్ మరియు రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో మరో ఐదు ప్లాన్‌లను కూడా సవరించింది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ సవరించిన ప్లాన్‌లలో PV186, STV 187, STV 98, STV 99 మరియు STV 319 వంటివి కూడా ఉన్నాయి. PV186 మరియు STV 187 ప్లాన్ లు ఇప్పుడు తక్కువ డేటా ప్రయోజనాన్ని అందిస్తుండగా STV 98, STV 99 మరియు STV 319 తక్కువ వాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి. సవరించిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతున్నాయి. భారతీయ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్‌కోస్‌లను ఓడించడానికి బిఎస్‌ఎన్‌ఎల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఇది మాత్రం దీనికి చేదు వార్తను అందించవచ్చు.

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు 2019 డిసెంబర్‌లో ధరల పెరుగుదలను అమలులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా వారు సుంకాల ధరలను 40% వరకు పెంచారు. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరలను పెంచలేదు ఎందుకంటే దీనికి 3G సేవలు లేనందువలన ప్రీపెయిడ్ ప్లాన్ ల యొక్క ధరలను పెంచడానికి కూడా అర్ధమే లేదు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ధరల పెరుగుదలను కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసింది కానీ ఇప్పుడు చివరకు అమలు చేసింది. ప్లాన్ ల యొక్క ధరలను సవరించడానికి బదులుగా ప్రస్తుత ప్లాన్ ల యొక్క డేటా ప్రయోజనం మరియు వాలిడిటీని బిఎస్ఎన్ఎల్ తగ్గించింది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,699 వార్షిక ప్లాన్‌ యొక్క కొత్త ప్రయోజనాలు
 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,699 వార్షిక ప్లాన్‌ యొక్క కొత్త ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,699 వార్షిక ప్లాన్‌ను ఇప్పుడు తక్కువ వాలిడిటీను అందించే విధంగా సవరించబడింది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ముందు అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలు 300 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. 250 నిమిషాలు పూర్తయిన తరువాత వినియోగదారులకు బేస్ ప్లాన్ ప్రకారం ఛార్జ్ చేయబడుతుంది. అలాగే వారికి కేటాయించిన రోజువారీ డేటా ప్రయోజనం తర్వాత దాని యొక్క డేటా వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది.

బిఎస్ఎన్ఎల్ PV186 మరియు STV187 డేటా ప్రయోజనం

బిఎస్ఎన్ఎల్ PV186 మరియు STV187 డేటా ప్రయోజనం

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,699 వార్షిక ప్లాన్‌తో పాటు PV186 మరియు STV187 యొక్క బడ్జెట్ కాంబో ప్లాన్‌లలో కూడా మార్పులను చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌లు రెండూ ఇప్పుడు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్‌లను మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తాయి. అలాగే 2GB రోజువారీ డేటా ప్రయోజనం తర్వాత డేటా స్పీడ్ 80kbps కు తగ్గించి అపరిమిత డేటా ప్రయోజనంను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. .

STV 187 మరియు PV 186

STV 187 మరియు PV 186

మార్పులు చేయడానికి ముందు STV 187 మరియు PV 186 రోజువారీ 3GB డేటా ప్రయోజనంను అందిస్తుండేది కానీ ఇది ఇప్పుడు 2GB కి తగ్గించబడింది. అనేక మంది పౌరులు ఇంటి నుండి పని చేస్తున్నందున బడ్జెట్‌లో ఇటువంటి అధిక డేటా ప్రణాళికల కోసం వెతుకుతున్నారని పరిగణనలోకి తీసుకోవడం బిఎస్‌ఎన్‌ఎల్ నుండి అసాధారణమైన మార్పు.

బిఎస్‌ఎన్‌ఎల్ STV 98, STV 99 ప్లాన్‌

బిఎస్‌ఎన్‌ఎల్ STV 98, STV 99 ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ చివరగా మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కూడా మార్పులను తీసుకువచ్చింది.ఈ మూడు ప్లాన్‌ల యొక్క వాలిడిటీని తగ్గించింది. బిఎస్ఎన్ఎల్ నుండి ఉత్తమమైన డేటా-ఓన్లీ ప్లాన్లలో ఒకటిగా ఉన్న STV98 ఇప్పుడు రోజుకు 2GB చొప్పున అపరిమిత డేటాను 22 రోజుల చెల్లుబాటు కాలానికి ఈరోస్ నౌ చందా యొక్క ప్రయోజనాలతో అందిస్తుంది. రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను వినియోగించుకునే వినియోగదారుని అనుమతించే ఎస్‌టివి 99 కూడా వాలిడిటీని 24 రోజుల నుండి 22 రోజులకు తగ్గించింది.

బిఎస్‌ఎన్‌ఎల్ STV 319 వాయిస్-ఓన్లీ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ STV 319 వాయిస్-ఓన్లీ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న మరొక వాయిస్-ఓన్లీ ప్లాన్ STV 319 యొక్క వాలిడిటీ కూడా ఇప్పుడు మునుపటి 84 రోజుల నుండి 75 రోజులకు తగ్గించబడింది. STV 319 యొక్క ప్రయోజనాలు ముంబై & డిల్లీ సర్కిల్‌లను మినహాయించి హోమ్ LSA & నేషనల్ రోమింగ్‌లో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ ప్రయోజనాలు ఉన్నాయి. సవరించిన అన్ని ప్రయోజనాలు ఏప్రిల్ 1, 2020 నుండి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పనిచేస్తున్న అన్ని సర్కిల్‌లలో అమలులోకి వస్తుంది. .

Best Mobiles in India

English summary
BSNL Annual Plans Validity Reduced: Check Full Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X