BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్

|

టెలికామ్ రంగంలో ఇప్పుడు అన్ని సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. అన్ని టెల్కోలు తమ తమ ప్రీపెయిడ్ ప్లాన్ ల ధరలను అధిక మొత్తంలో పెంచాయి. ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ తన రూ.29 & రూ.47 రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల చెల్లుబాటు సమయాన్ని తగ్గించింది. అలాగే తన సర్కిల్‌లలో వున్న మూడు ప్రీపెయిడ్ STVలను రూ.7, రూ.9 మరియు రూ.192 ప్లాన్‌లను తన పోర్టుఫోలియో నుండి తొలగించింది.

 

BSNL

BSNL యొక్క రూ.29 ప్రీపెయిడ్ STV ప్లాన్ ఒక వారపు చెల్లుబాటుతో అందిస్తున్న ప్లాన్‌లలో ఉత్తమమైనది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క యాక్సిస్ ఐదు రోజులకు తగ్గించబడింది. అలాగే ముందు తొమ్మిది రోజులపాటు తన ప్రయోజనాలను అందిస్తున్న రూ.47 STV ప్లాన్ ఇప్పుడు ఒక వారం వాలిడిటీతో మాత్రమే వస్తుంది.

బిఎస్ఎన్ఎల్

ఇప్పటికే ఉన్న ప్లాన్‌ల చెల్లుబాటు కాలాన్ని తగ్గించడం ద్వారా సుంకం ధరలను పెంచడంలో BSNL సంస్థ కూడా ప్రైవేట్ ఆపరేటర్లను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతర వర్గాల సమాచారం ప్రకారం బిఎస్ఎన్ఎల్ ఇంకా కొత్త ప్లాన్‌లపై ఎలాంటి వివరాలు లేవు. అయితే ఇది త్వరలో పోటీకి సరిపోయే కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ సంస్థ టెలికం పరిశ్రమలో ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఎందుకంటే మొదటి మూడు ప్రైవేట్ ఆపరేటర్లు పెరిగిన ధరలతో కొత్త టారిఫ్ ప్రణాళికలను ప్రకటించారు.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.29, రూ.47 STV ప్లాన్‌ల వాలిడిటీ
 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.29, రూ.47 STV ప్లాన్‌ల వాలిడిటీ

రిలయన్స్ జియో మరియు బిఎస్ఎన్ఎల్ సంస్థలు మాత్రమే రూ.50 ధర వద్ద కాంబో ప్లాన్‌లను అందించారు. అక్టోబర్లో జియో తన రూ.19 మరియు రూ.52ల అన్‌లిమిటెడ్ సాచెట్ ప్యాక్‌లను తొలగించింది. ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ తన రూ.29 & రూ .47 ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించింది. ఏదేమైనా బిఎస్ఎన్ఎల్ సరసమైన కాంబో ప్లాన్‌లను అందిస్తూనే ఉన్నది. కాకపోతే చెల్లుబాటు సమయం మాత్రం తగ్గించారు.

రూ.29ల STV ప్లాన్‌

రూ.29ల STV ప్లాన్‌

రూ.29ల STV ప్లాన్‌ అపరిమిత ఆఫ్-నెట్ మరియు ఆన్-నెట్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోజువారీగా 250 నిమిషాల క్యాప్ ఉంది. ఈ ప్లాన్‌ ద్వారా 1 జీబీ డేటా, 300 SMSలు వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కొత్త అప్డేట్ తర్వాత ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు ఇప్పుడు కేవలం ఐదు రోజులు మాత్రమే. అంతకుముందు ఈ ప్లాన్ ఏడు రోజుల వాలిడిటీతో లభించేది.

 

 

ఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

రూ.47 STV ప్లాన్

రూ.47 STV ప్లాన్

రూ.47 STV ప్లాన్ విషయానికి వస్తే ఇది రోజుకు 250 నిమిషాల పరిమితి చొప్పున అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 1 జిబి డేటా వంటి ప్రయోజనాలతో ఏడు రోజుల వాలిడిటీతో లభిస్తుంది. గతంలో PRBT ప్రయోజనాన్ని అందించడానికి ఉపయోగించిన ప్రణాళికను ఇప్పుడు తాజా సవరణలో భాగంగా టెల్కో ఈ ప్రయోజనాన్ని తొలగించింది. రూ .29 మరియు రూ.47STV ప్లాన్ లు రెండూ ఎమ్‌టిఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ లను విలీన నిర్ణయం తీసుకున్న తరువాత డిల్లీ మరియు ముంబై టెలికాం సర్కిళ్ళలోని ఎంటీఎన్ఎల్ మొబైల్ నంబర్లకు ఉచిత వాయిస్ కాల్స్ ఇవ్వడం ప్రారంభించింది.

 

 

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండిరిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన రూ.7, రూ.9, రూ.192 ప్రీపెయిడ్ STV ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన రూ.7, రూ.9, రూ.192 ప్రీపెయిడ్ STV ప్లాన్‌లు

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) రూ .29, రూ .47 STVల చెల్లుబాటు సమయాన్ని తగ్గించడంతో పాటు తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో నుండి మూడు STV లను కూడా తొలగించింది. ఇందులో వున్న మూడు STVలు రూ.7, రూ.9 మరియు రూ.192 ప్లాన్‌లు. రూ .7 ఎస్‌టివి ఒక రోజుకు 1 జిబి డేటాను అందించేది. అలాగే రూ.9 ఎస్‌టివి 250 నిమిషాల క్యాప్, 100 ఎమ్‌బి డేటా మరియు 100 ఎస్‌ఎంఎస్‌లతో ఒక రోజుకు చెల్లుబాటు అయ్యే అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందించింది.

 

ఎయిర్‌టెల్ & వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లు...ధరల పెంపులో పోటా పోటీఎయిర్‌టెల్ & వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లు...ధరల పెంపులో పోటా పోటీ

రూ .198 ప్రీపెయిడ్ STV

రూ .198 ప్రీపెయిడ్ STV వినియోగదారులకు STV 187 యొక్క అన్ని ప్రయోజనాలతో పాటు ఉచిత పిఆర్‌బిటి (పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్) మరియు ఉచిత డిస్కౌంట్ కూపన్‌లను ప్రతిరోజూ అందించింది. STV 187 యొక్క ప్రయోజనాలు అపరిమిత వాయిస్ కాలింగ్ (రోజుకు 250 నిమిషాలు), 3GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్

చివరగా బిఎస్ఎన్ఎల్ పిఆర్బిటి సదుపాయాన్ని రూ .108, రూ.199,రూ.260 మూడు ప్రీపెయిడ్ ప్లాన్ల నుండి తొలగించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల సవరణ ఇటీవల కంపెనీ టారిఫ్ ధరల పెంపులో భాగమే. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ప్రైవేట్ టెల్కోస్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలను అంచనా వేస్తోంది. ఇది వచ్చే వారంలో కొత్త లేదా సవరించిన ప్రణాళికలతో రావచ్చు.

Best Mobiles in India

English summary
BSNL Reduces Prepaid Plans Validity: Check Full Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X