Rs.299 ప్రారంభ ధరకే DSL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్న BSNL...

|

బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఇటీవల రూ.299, రూ.399 మరియు రూ.555 తక్కువ ధరల వద్ద మూడు డిఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను విడుదల చేసింది. సాధారణంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ తో వచ్చే ఫైబర్-టు-హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల మాదిరిగా కాకుండా DSL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ PSU స్లో స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ భారతదేశం అంతటా ఏడు మిలియన్లకు పైగా వైర్‌లైన్ చందాదారులను కలిగి ఉంది. అయితే టెల్కో యొక్క FTTH కస్టమర్ బేస్ (భారత్ ఫైబర్) కేవలం ఒక మిలియన్ మాత్రమే. బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులలో ఎక్కువ భాగం డిఎస్‌ఎల్ ప్లాన్‌లను ఉపయోగిస్తున్నారు. కావున తక్కువ ధర వద్ద లభించే డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.299 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.299 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ .299 ప్రారంభ ధర వద్ద '100GB CUL' పేరుతో లభించే బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అండమాన్ & నికోబార్ దీవులు మినహా అన్ని సర్కిల్‌లలో కొత్త వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఆరు నెలలకు మాత్రమే లభిస్తుంది. తర్వాత వారు రూ.399 డిఎస్‌ఎల్ ప్లాన్‌కు మరవలసి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కొత్త డిఎస్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దీనిని పొందవలసి ఉంటుంది. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది.

BSNL రూ.399 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.399 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

దీనిని '200GB CUL' బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. రూ.399 ధర వద్ద లభించే ఈ డిఎస్‌ఎల్ ప్లాన్ 10 ఎమ్‌బిపిఎస్ వేగంతో 200GB వరకు డేటాను అందిస్తుంది. తరువాత డేటా స్పీడ్ 2Mbps కి తగ్గించబడుతుంది. ఈ డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను పొందడానికి 500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అవసరం మరియు ఈ ప్లాన్‌కు కనీస అద్దె కాలం ఒక నెల. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

BSNL రూ.555 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు
 

BSNL రూ.555 డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

చివరగా కొత్తగా ప్రారంభించిన రూ.555 డిఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ కూడా అదే 10Mbps వేగంతో 500GB వరకు అందిస్తుంది. దీని తరువాత డేటా స్పీడ్ 2Mbpsతో అపరిమిత డేటాను అందిస్తుంది. రూ.299 మరియు రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగానే ఈ బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.299 మరియు రూ.555 డిఎస్ఎల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్‌లు కొత్త మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువ చెల్లుబాటు కాలం సభ్యత్వంతో కూడా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL Released Three New DSL Broadband Plans With 10 Mbps Speed and very Less Price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X