BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొత్తగా వచ్చిన మార్పులు గమనించారా??

|

ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు పరిమిత కాలానికి మూడు ప్రీపెయిడ్ STVలను మరియు రెండు PV వోచర్‌లను సవరించింది. ఈ మూడు STVలలో STV 99, STV 298 మరియు STV 319 తో పాటుగా PV399 మరియు PV699 కూడా ఉన్నాయి. ఇందులో బిఎస్‌ఎన్‌ఎల్ PV699 యొక్క వాలిడిటీని పొడిగించడంతో పాటు మిగిలిన ప్లాన్‌లలో అదనపు డేటా మరియు SMS ప్రయోజనాలను జోడించింది. తాజా పునర్విమర్శ తరువాత బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లలోని అదనపు ప్రయోజనాలు మార్చి 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఆ తరువాత టెల్కో తన యొక్క పాత ప్రయోజనాలకు తిరిగి వస్తుంది. సవరించిన బిఎస్‌ఎన్‌ఎల్ ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV 99 కొత్త ప్రయోజనాలు

BSNL STV 99 కొత్త ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ నుండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో STV 99 ఒకటి. ఈ ప్లాన్ సాధారణంగా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను మరియు 22 రోజుల పాటు ఉచిత పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ (PRBT) ను అందిస్తుంది. ఈ ప్లాన్ పాత వాలిడిటీతోనే వస్తుంది. అయితే ఈ కొత్త పునర్విమర్శలో భాగంగా ఈ ప్లాన్ 99 SMS‌లను కూడా అందిస్తుంది.

BSNL STV 298 కొత్త ప్రయోజనాలు

BSNL STV 298 కొత్త ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క STV 298 ప్లాన్ పునర్విమర్శకు ముందు ఎటువంటి FUP పరిమితి లేకుండా దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1GB డేటా మరియు 100 SMS లను 54 రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. అయితే ఇప్పుడు కొత్త మార్పుల తరువాత ఈ ప్యాక్ రోజుకు 2GB డేటాతో 56 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఈ పునర్విమర్శలో ఈరోస్ నౌ సబ్స్క్రిప్షన్ యొక్క ప్రయోజనంలో ఎటువంటి మార్పులు లేవు.

BSNL STV 319 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

BSNL STV 319 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

అధికంగా వాయిస్ కాలింగ్ ను ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బిఎస్‌ఎన్‌ఎల్ మూడేళ్ల క్రితం STV319 ప్లాన్ ను పరిచయం చేసింది. STV 319 గతంలో చాలా పునర్విమర్శలను అందుకున్నది. కాని అవి ప్రధానంగా వాలిడిటీ తగ్గింపులు మాత్రమే. ఇప్పుడు వచ్చిన కొత్త పునర్విమర్శ కొద్దిగా ప్రత్యేకమైనది. ఎందుకంటే బిఎస్‌ఎన్‌ఎల్ అదనంగా 10GB డేటా బెనిఫిట్ మరియు 300 SMS‌లను ఈ ప్లాన్‌కు జోడించింది. అయితే అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనంలో ఎటువంటి మార్పు లేదు. అలాగే ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 75 రోజులు కూడా ఒకే విధంగా ఉంది.

BSNL PV 399 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

BSNL PV 399 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

BSNL కొత్తగా సవరించిన ప్లాన్ లలో తదుపరిది PV 399 వోచర్. ఇది 1GB రోజువారీ డేటా, దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు, ఉచిత BSNL ట్యూన్స్ మరియు లోక్‌ధన్ కంటెంట్‌తో అపరిమిత కాంబో ప్లాన్ 80 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అయితే పునర్విమర్శ తరువాత PV 399 వోచర్ అదే 80 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాతో వస్తుంది.

BSNL PV 699 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

BSNL PV 699 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

పునర్విమర్శను స్వీకరించిన బిఎస్‌ఎన్‌ఎల్ చివరి ప్రీపెయిడ్ ప్లాన్ PV 699. ఇది రోజుకు 0.5GB డేటా, రోజుకు 100 SMS ‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు మొదటి 60 రోజుల ఉచిత పిఆర్‌బిటి కలిగిన అపరిమిత కాంబో ప్లాన్. ఈ ప్లాన్ సాధారణంగా 160 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే మార్చి 31, 2021 వరకు బిఎస్ఎన్ఎల్ అదనంగా 20 రోజుల వాలిడిటీను అందిస్తుంది. దీని అర్థం PV699 రీఛార్జ్ తేదీ నుండి 180 రోజుల వరకు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL's STV, PV Prepaid Plans Validity and Benefits New Changes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X