Home
News

BSNL రూ.1,999 వార్షిక ప్లాన్‌ మీద 30రోజుల అధిక వాలిడిటీ!! కొద్ది రోజులు మాత్రమే...

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ తన యొక్క ప్రస్తుత వినియోగదారుల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లను అప్పుడప్పుడు పరిమిత కాలానికి సవరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా రూ.1,999 ధర వద్ద లభించే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిపబ్లిక్ డే 2021 చివరి సవరణను ఇప్పుడు చందాదారులకు 30 రోజుల అదనపు వాలిడిటీని అందించడానికి మరోసారి సవరించబడింది. పరిమిత కాలంలో లభించే ఈ ఆఫర్ 2021 మార్చి 2 నుండి అమల్లోకి వచ్చింది. అలాగే ఈ ఆఫర్ మార్చి 31, 2021 తో ముగుస్తుంది. ఈ పరిమిత కాల ఆఫర్ వ్యవధిలో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే వారికి మొత్తంగా 395 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై గల సవరణల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 వార్షిక ప్లాన్ కొత్త సవరణలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 వార్షిక ప్లాన్ కొత్త సవరణలు

PV1999 పేరుతో లభించే బిఎస్ఎన్ఎల్ యొక్క వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ చందాదారులకు సాధారణంగా ఒక సంవత్సరం లేదా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలతో లభిస్తుంది. అయితే మార్చి 31 పరిమిత కాలం లోపు రీఛార్జ్ చేసుకున్న వారు 395 రోజుల వాలిడిటీ కాలానికి పొందవచ్చు. అంటే వినియోగదారులు 30 రోజుల అధిక వాలిడిటీకి సవరించబడింది. ఈ ఆఫర్ ఈ నెల చివరిలో ముగుస్తుంది మరియు ఇది అన్ని టెలికాం సర్కిల్‌లలో లభిస్తుంది.

BSNL రూ.1,999 వార్షిక ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.1,999 వార్షిక ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 వార్షిక ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేయగలరు. అలాగే వారికి రోజుకు 2GB డేటా ప్రయోజనం లభిస్తుంది. అలాగే మొత్తం చెల్లుబాటు కాలానికి రోజుకు 100 SMS ల ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో మొత్తం 365 రోజులకు అపరిమిత కాలర్ టూన్ మార్పు ఎంపికతో ఉచిత బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ చందాను, మొదటి 60 రోజులు లోక్ధన్ కంటెంట్ మరియు 365 రోజులకు ఎరోస్ నౌ కంటెంట్ కు ఉచిత యాక్సిస్ తో లభిస్తుంది.

BSNL జింగ్ యాప్ చందా ప్లాన్ లు

BSNL జింగ్ యాప్ చందా ప్లాన్ లు

బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇప్పుడు ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతో జింగ్ యాప్ చందాను ప్రారంభించింది. అప్పటికి ఇది ప్రచార ఆఫర్ లో భాగంగా ఉంది. కానీ తాజా అభివృద్ధి ప్రకారం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్లపై జింగ్ యాప్ చందాను క్రమబద్ధీకరించింది. రూ. 56, రూ .151, రూ .251, రూ .499, రూ .599, రూ.666 ధరల వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ జింగ్ యాప్ చందాను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs 1,999 Annual Prepaid Plan Limited Period New Changes: 30 Days Extra Validity and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X