BSNL నుంచి కొత్తగా FRC మరో ప్లాన్!! రోజుకు 2GB డేటా ప్రయోజనంతో..

|

బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ ఇప్పుడు కొత్తగా మరొక ప్లాన్ ను విడుదల చేసింది. మొదటిసారి రీఛార్జ్ చేసే వారి కోసం రూ.249 ధర వద్ద మొదటి రీఛార్జ్ కూపన్ (FRC) ను విడుదల చేసింది. అయితే ఈ కొత్త వోచర్ వినియోగదారులకు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ FRC 249 అనేది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 60 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ వోచర్ ప్లాన్ 2021 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉందని గమనించండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL FRC 249 ప్లాన్ ప్రయోజనాలు

BSNL FRC 249 ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క FRC249 కొత్త పాన్-ఇండియా అంతటా అందుబాటులో ఉంది. ఈ కొత్త వోచర్ వినియోగదారులకు మాత్రమే కాకుండా చిల్లర వ్యాపారులు మరియు ప్రభుత్వంచే నడుస్తున్న టెల్కో యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లకు (DSA) కూడా అందుబాటులో ఉంది. FRC 249 ప్లాన్ తో DSA తీసుకువచ్చే ప్రతి కొత్త కనెక్షన్‌కు బిఎస్‌ఎన్‌ఎల్ 224 రూపాయలు కమీషన్‌గా ఇస్తోంది. కొత్త కనెక్షన్లను అధికంగా విక్రయించడానికి, DSAలు మరియు చిల్లర వ్యాపారులను ప్రోత్సహించడానికి BSNL చేసిన మంచి ప్రయత్నం ఇది. ఈ ఆఫర్ కారణంగా టెల్కో కొత్త వినియోగదారులను అధికంగా పొందే అవకాశం ఉంది.

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వోచర్‌ ఆఫర్లు

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వోచర్‌ ఆఫర్లు

బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ లు మరియు డేటా వోచర్లు ఇతర ప్రైవేట్ టెల్కోస్ అందించే ఓవర్-ది-టాప్ (OTT) వంటి ప్రయోజనాలతో రాకపోయినప్పటికీ ఆసక్తికరమైన ఆఫర్లతో అందుబాటులోకి రావడంతో ఇది వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించింది. వినియోగదారుల యొక్క దృష్టిని ఆకట్టుకున్న ఆఫర్లలో ఒకటి ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 4G సిమ్ కార్డుకు రూ.20 మాత్రమే ఖర్చవుతున్నప్పటికీ ఇప్పుడు ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్‌తో పాటు రీఛార్జ్ షరతులు లేదా ప్రీపెయిడ్ వోచర్‌లు టెల్కోకు బాగా పనిచేశాయి.

బిఎస్ఎన్ఎల్ DSL బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య

బిఎస్ఎన్ఎల్ DSL బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య

బిఎస్ఎన్ఎల్ తన DSL బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్రతిపాదనలను కూడా ప్రారంభించింది. ఈ టెల్కో భారతదేశంలో సుమారు 7 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను కలిగి ఉంది. వీరిలో ఫైబర్ వినియోగదారులు కేవలం 1 మిలియన్లను మాత్రమే కలిగి ఉన్నారు. టెల్కో యొక్క మెజారిటీ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు DSL కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నారని దీని అర్థం.

Best Mobiles in India

English summary
BSNL Released FRC 249 New Plan With 2GB Daily Data Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X