Home
News

BSNL అందిస్తున్న RS.108 ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు చెన్నై, తమిళనాడు టెలికాం సర్కిల్‌లలో ఉన్న కొత్త వినియోగదారుల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. 108 రూపాయల బిఎస్‌ఎన్‌ఎల్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ 28 రోజులు ఫ్రీబీలను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 180 రోజులు. ఈ రీఛార్జిని ఎంచుకునే కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ (రోజుకు 250 నిమిషాలు క్యాప్డ్), రోజుకు 1GB డేటాను మరియు 28 రోజుల కాల వ్యవధికి గాను 500 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు లభిస్తాయి. ముంబై, డిల్లీ టెలికాం సర్కిల్‌లలో పనిచేసే ఎమ్‌టిఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

బిఎస్ఎన్ఎల్  RS.108 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ RS.108 ప్లాన్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ప్రస్తుతం చెన్నై, తమిళనాడు సర్కిళ్లలో మాత్రమే 108 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ప్రయోజనాల విషయానికొస్తే ఈ ప్లాన్ రోజుకు 1GB డేటాను అందిస్తుంది. తరువాత దీని వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. దేశవ్యాప్తంగా MTNL తో సహా ఏ నెట్‌వర్క్‌కైనా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు చేయగలరు. చివరగా బిఎస్ఎన్ఎల్ మొత్తం చెల్లుబాటు వ్యవధికి 28 రోజులకు 500SMS లను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుందని బిఎస్ఎన్ఎల్ చెబుతున్నప్పటికీ ఇది రోజుకు 250 నిమిషాలకు వాయిస్ కాల్స్ క్యాప్ చేస్తుంది. ఆ తరువాత ప్రతి వాయిస్ కాల్ ప్రామాణిక రేట్లకు వసూలు చేయబడుతుంది.

BSNL

BSNL అందిస్తున్న FRC 108 గురించి గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.ఇందులో మొదటది ఇది కొన్ని సర్కిల్‌లలోని క్రొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తరువాత ఇది ఇప్పటికే ఉన్న ప్లాన్ నుండి ఇతర ప్లాన్‌లకు మారాలని చూస్తున్న వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రణాళికకు బ్లాక్అవుట్ రోజులు వర్తించవని బిఎస్ఎన్ఎల్ ధృవీకరించింది.

MTNL వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్ అందిస్తున్న BSNL

MTNL వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్ అందిస్తున్న BSNL

ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ ముంబై మరియు డిల్లీ టెలికాం సర్కిళ్ళలో ఉన్న MTNL మొబైల్ నంబర్లకు ఉచిత వాయిస్ కాల్స్ ఇవ్వడం ప్రారంభించింది. 2 టెలికాం సర్కిల్‌లలో ఎమ్‌టిఎన్‌ఎల్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ కూడా తన కార్యకలాపాలను 20 సర్కిల్‌లలో కలిగి ఉంది. మొత్తంగా ఈ రెండు కలిపి దేశం మొత్తంగా 22 సర్కిల్ లలో వాటి కార్యకలాపాలు చేస్తున్నాయి. ఎమ్‌టిఎన్‌ఎల్ ప్రస్తుతం ముంబై, డిల్లీ సర్కిల్‌లలో టెలికాం, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తోంది. ఇటీవల MTNL డిల్లీలో 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను 2,990 రూపాయల నుండి ప్రారంభించింది.

 

రిలయన్స్ జియో ప్రవేశించిన వెంటనే బిఎస్ఎన్ఎల్

భారతీయ మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశించిన వెంటనే బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. అయినప్పటికీ టెల్కో MTNL నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందించలేదు. MTNL మరియు BSNL విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపినందున ఇది ఇప్పుడు దాని పరిణామాలు పూర్తిగా మారిపోయింది. అక్టోబర్ 24 నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ. 429, రూ. 485, రూ. 666 కూడా ఎమ్‌టిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఉచిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తున్నాయి.

MTNL& BSNL

BSNL తో విలీనం తరువాత MTNL& BSNL అనుబంధ సంస్థగా పనిచేస్తుందని తెలిపారు. కాని రెండు PSU ల విలీనానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలుపుతారు. టెలికం పరిశ్రమలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రణాళికల కోసం ఫ్లోర్ ధరను కూడా పరిగణించటానికి ట్రాయి చూస్తున్నది. రిలయన్స్ జియో వినియోగదారులకు సరసమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను అందించడంపై దృష్టి పెట్టింది. ఇది ఇతర టెల్కోలు కస్టమర్ల స్థావరాన్ని నిలుపుకోవటానికి చౌకైన ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రవేశపెట్టడానికి దారితీసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS.108 prepaid plan: Offers and More Details in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X