Home
News

200GB డాటా ప్రయోజనంతో BSNL Rs.698 ప్రీపెయిడ్ STV ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క 698 రూపాయల ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్త డేటా STV ని తీసుకువచ్చింది. ప్రస్తుతం చాలా మంది ప్రీపెయిడ్ కస్టమర్లు కేవలం ఎక్కువ డేటాను అందించే ప్లాన్ ల కోసం మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వారు తమ మొబైల్ ఫోన్‌ను ఇంటర్నెట్‌ను వినియోగించుకునే హాట్‌స్పాట్ పరికరంగా ఉపయోగిస్తున్నారు. దీపావళి 2019 సందర్భంగా ప్రారంభించిన బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా STV రూ.698 ప్లాన్ 180 రోజుల మొత్తం కాలానికి 200GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 2019 నవంబర్ 15 వరకు మాత్రమే చెల్లుతుందని తెలిపింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ లో మాత్రమే. ప్రభుత్వ టెల్కో నుండి వచ్చిన ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.56, రూ.109, రూ. 198 మరియు రూ.1,498 వంటి ఇతర డేటా STV ప్లాన్ లలో కలుస్తున్నది. ప్రస్తుతానికి BSNL ఈ ప్రీపెయిడ్ ప్రణాళికను ఇతర సర్కిల్‌లలో ప్రవేశపెడుతుందో లేదో తెలియదు. AP & Telangana సర్కిల్‌లో రీఛార్జ్ చేసుకోవడనికి ఈ ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దీపావళి సందర్భంగా ఇప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువస్తుంది. ఈ సంవత్సరం దీపావళి 2019 సందర్భంగా రాష్ట్ర టెల్కో రూ.698 ధరతో డేటా-ఓన్లీ ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రయోజనాల కోసం ఇది మొత్తం 200GB డేటాను అందిస్తుంది. దీని మొత్తం 180 రోజుల చెల్లుబాటు వ్యవధిలో 200 GB డేటాను ఉపయోగించవచ్చు. బిఎస్ఎన్ఎల్ లేదా ఇతర టెల్కోస్ నుండి వచ్చిన ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగా కాకుండా ఈ కొత్త డేటా STV ప్లాన్ కి రోజువారీ డేటా పరిమితి లేదు.

STV ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.698ల డేటా STV ప్లాన్ ని ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ను ఇతర సర్కిల్‌లలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోందో లేదో తెలియదు. బిఎస్ఎన్ఎల్ అధికారుల నుండి సేకరించిన రివర్ట్ ప్రకారం ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 180 రోజులు. కానీ ప్రీపెయిడ్ ప్లాన్ లభ్యత నవంబర్ 15, 2019 తో ముగుస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఇతర డేటా STVలు

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఇతర డేటా STVలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.7 నుంచి ప్రారంభమయ్యే డేటా STVలను కూడా అందిస్తోంది. టెల్కో నుండి ఇతర ప్రీపెయిడ్ డేటా STVలలో రూ .16, రూ. 56, రూ .109, రూ .198, రూ .1,498 ఉన్నాయి. రూ.7 మరియు రూ.16 డేటా ఎస్‌టివిలు వరుసగా 1 జిబి మరియు 2 జిబి డేటా ప్రయోజనాన్ని ఒక రోజు చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. రూ.56 డేటా ఎస్‌టివి 14 రోజులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుండగా, రూ.109 రీఛార్జ్ ప్లాన్ 1536MB డేటా మరియు ఉచిత పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ బెనిఫిట్‌తో వస్తుంది.

PRBT

తరువాతి జాబితాలో 54 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 2 జిబి డేటాతో పాటు PRBT ప్రయోజనాలను అందించే రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ ద్వారా సంస్థ ఎటువంటి అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందించడం లేదు. రూ .200 డేటా ఎస్టీవీ 54 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. చివరగా రూ.1,498 డేటా STV ప్లాన్ 365 రోజుల కాల వ్యవధిలో 91GB డేటాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Rs.698 Prepaid STV Plan: Data Benefits and Validity Details in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X