రెట్టింపు డేటా ప్రయోజనంతో BSNL మిత్రామ్ ప్లస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కొత్త మార్పులు..
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే టెల్కో బిఎస్ఎన్ఎల్ 2021 లో తన యొక్క పూర్వ వైభవాన్ని పొందడానికి కొత్తగా చాలా ప్లాన్లను అందిస్తున్నది. అందులో భాగంగా రూ.109 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క డేటా ప్రయోజనాన్ని రెట్టింపు చేసింది. మిత్రామ్ ప్లస్ ప్రీపెయిడ్ ప్లాన్ పేరుతో లభించే రూ.109 ప్లాన్ వినియోగదారుల బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ నంబర్ను చురుకుగా ఉంచాలని చూస్తున్న వారికి గొప్ప ఎంపిక. ఈ ప్లాన్ ను మొదటిసారిగా 2019 డిసెంబర్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఈ ప్లాన్ 20 రోజుల చెల్లుబాటుతో 5GB డేటా మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందించేది. కొత్తగా అందుకున్న మార్పుల తరువాత ఈ ప్లాన్ 10GB డేటాను అందిస్తుంది. ఈ అదనపు డేటా ప్రయోజనం పరిమిత కాల ఆఫర్ లో భాగంగా మార్చి 31, 2021 వరకు చెల్లుబాటు అవుతుంది అని గమనించండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.109 మిత్రామ్ ప్లస్ ప్రీపెయిడ్ ప్లాన్ సవరణ
బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.109 మిత్రామ్ ప్లస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వచ్చిన కొత్త సవరణలో భాగంగా ఇది 10GB డేటాను 20 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. అలాగే ఎలాంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క USP అయితే 75 రోజుల చెల్లుబాటుతో రావడం గమనార్హం. తమ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే కస్టమర్లకు ఇది ఉపయోగపడుతుంది. కొత్త మార్పులు మార్చి 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

BSNL PV106 / PV107 రీఛార్జ్ ప్లాన్
రూ.109 మిత్రామ్ ప్లస్ ప్లాన్‌ను ఏప్రిల్ 1 నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ ఎందుకు తొలగిస్తుందో అన్న విషయం మీద ఎటువంటి సమాధానం లేదు. బహుశా బిఎస్ఎన్ఎల్ సంస్థ తన కస్టమర్లను PV106 లేదా PV107తో రీఛార్జ్ చేసుకోవాలని కోరుకుంటుంది. PV106 ప్లాన్ 3GB డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్, 60 రోజుల చెల్లుబాటు కాలానికి ఉచిత బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ సబ్స్క్రిప్షన్ మరియు 100 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. PV106 / PV107 ప్లాన్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ సవరించిన దాని ప్రకారం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రిలయన్స్ జియో మాదిరిగానే రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ఈ కొత్త ప్లాన్‌లతో బిఎస్ఎన్ఎల్ ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని టెల్కోకు గట్టి పోటీని ఇస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ.399 ధర వద్ద అందించే ఘర్ వాప్సీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 70GB డేటాను అందించడంతో పాటుగా 210GB వరకు రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది. అలాగే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను అనుమతించదు.

బిఎస్ఎన్ఎల్ యొక్క PV 2,399 లాంగ్ టర్మ్ ప్లాన్ల ప్రయోజనాలలో కూడా సవరణలు ఉన్నాయి. ఈ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అంతకుముందు బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలకు పరిమితం చేసింది. అలాగే ముంబై మరియు ఢిల్లీ టెలికాం సర్కిల్‌లలోని ఎమ్‌టిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కూడా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. అలాగే PV 2,399 ప్లాన్ ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులకు రోజుకు 100 SMS ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ తో ఈరోస్ నౌ సబ్స్క్రిప్షన్ మరియు అపరిమిత రింగ్ బ్యాక్ టోన్ ప్రయోజనాలను కూడా లభిస్తాయి.

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో రోజువారీ 1.5GB పరిమితి తర్వాత డేటా స్పీడ్ 40 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 90 రోజులు. ప్రైవేట్ టెల్కోలు తమ రోజువారీ 1.5GB ప్లాన్‌లను 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నాయి. వీటితో పోల్చిచూస్తే BSNL యొక్క ఈ ప్లాన్ ఆరు రోజుల అదనపు చెల్లుబాటుతో లభించడం గమనార్హం.


Click it and Unblock the Notifications








