BSNL రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో జియోకు సమానంగా కొత్త మార్పులు!!
రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలతో సరిపోయేలా బిఎస్ఎన్ఎల్ మరోసారి తన రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను సవరించింది. డిసెంబర్ 2020 లో బిఎస్ఎన్ఎల్ నెలకు కేవలం 300 ఆఫ్-నెట్ నిమిషాల ఆన్-నెట్ కాలింగ్ ప్రయోజనంను అందించేది. తాజా సవరణలో భాగంగా రూ.199 బిఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ముంబై, ఢిల్లీతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. రూ.199 ప్లాన్ యొక్క రోజువారి 100SMSలు మరియు 75GB వరకు రోల్‌ఓవర్‌తో 25GB డేటా వంటి ఇతర ప్రయోజనాలు అలాగే ఉన్నాయి. రిలయన్స్ జియో కూడా ఇటీవల దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో తన రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను సవరించింది. బిఎస్ఎన్ఎల్ కొత్త సవరణతో రాబోయే నెలల్లో మరింత ఎక్కువ మంది సభ్యులు చేరే అవకాశం ఉంది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత ప్రయోజనాలు
తాజా అప్ డేట్ ప్రకారం రూ.199 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు అపరిమిత ఆన్-నెట్ మరియు ఆఫ్-నెట్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (IUC) తొలగించిన తరువాత రిలయన్స్ జియో రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో సమానంగా దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది.

బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల అపరిమిత ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ టెల్కో జనవరి 2021 నుండి తన యొక్క కొన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందివ్వడం ప్రారంభించింది. అయితే రూ.199 ధర వద్ద గల పోస్ట్ పెయిడ్ ప్లాన్ కొన్ని కారణాల వల్ల వదిలివేయబడింది. రూ.399 మరియు అంతకంటే ఎక్కువ ధర గల బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో సవరణ వెంటనే లభించింది. రూ.399 ధర పైన గల అన్ని ప్లాన్‌లతో అంతకుముందు బిఎస్‌ఎన్‌ఎల్ రోజుకు 250 నిమిషాలకు వాయిస్ కాల్స్‌ను పరిమితం అందించేది. అయితే రూ.199 ప్లాన్‌లో 250 నిమిషాల రోజువారీ పరిమితితో పాటు అపరిమిత ఆన్-నెట్ కాలింగ్ మరియు 300 ఆఫ్-నెట్ నిమిషాలు అందించబడ్డాయి.

బిఎస్ఎన్ఎల్ Vs రిలయన్స్ జియో
ఈ కొత్త మార్పుతో బిఎస్ఎన్ఎల్ రిలయన్స్ జియోను సులభంగానే ఓడించింది. ఈ రెండు ప్లాన్‌లు అపరిమిత కాలింగ్, 25GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో వస్తాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌లో డేటా రోల్‌ఓవర్ సౌకర్యం ఉంది. అయితే జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అలాంటి ప్రయోజనం అందుబాటులో లేదు. అయితే జియోటివి మరియు జియో సినిమా వంటి అన్ని రకాల యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అలాంటి ప్రయోజనాలు ఏవీ లభించవు.


Click it and Unblock the Notifications








