BSNL సంక్రాంతి ఆఫర్!! లాంగ్ టర్మ్ ప్లాన్‌లలో మార్పులు గమనించారా??
బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం సంస్థ ఇండియాలో 72 వ గణతంత్ర దినోత్సవం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా PV1,999, PV2,399 యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. PV 1,999 ప్లాన్ మీద 21 రోజుల అదనపు యాక్సిస్ లభిస్తుండగా, PV 2,399 ప్లాన్ యొక్క చెల్లుబాటును మాత్రం తగ్గించింది. ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వారు 365 రోజులు లేదా పూర్తిగా ఒక సంవత్సరం చెల్లుబాటుతో లభించే ఈ ప్లాన్లు మరింత ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి యొక్క వాలిడిటీ మరియు డేటా ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL PV 2,399 లాంగ్ టర్మ్ ప్లాన్ మార్పులు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క PV 2,399 ప్లాన్ అనేక పునర్విమర్శలను పొందుతూ ప్రస్తుతం 600 రోజుల చెల్లుబాటును 365 రోజులకు తగ్గించింది. కానీ 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా PV 2,399 ప్లాన్ మరో 72 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తుంది. అంటే దీని మొత్తం వాలిడిటీ 437 రోజులుగా ఉంది. ఇది ప్రమోషనల్ ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 10 నుండి 2021 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి PV2,399 ప్లాన్ తిరిగి 365 రోజుల చెల్లుబాటుతో మాత్రమే లభిస్తుంది.

BSNL PV 2,399 ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క PV 2,399 లాంగ్ టర్మ్ ప్లాన్ల ప్రయోజనాలలో కూడా సవరణలు ఉన్నాయి. ఈ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అంతకుముందు బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలకు పరిమితం చేసింది. అలాగే ముంబై మరియు ఢిల్లీ టెలికాం సర్కిల్‌లలోని ఎమ్‌టిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కూడా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. అలాగే PV 2,399 ప్లాన్ ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులకు రోజుకు 100 SMS ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ తో ఈరోస్ నౌ సబ్స్క్రిప్షన్ మరియు అపరిమిత రింగ్ బ్యాక్ టోన్ ప్రయోజనాలను కూడా లభిస్తాయి.

BSNL PV 1,999 లాంగ్ టర్మ్ ప్లాన్ మార్పులు
బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్‌లలో అందించే మరొక ప్లాన్ PV 1,999 ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అయితే కంపెనీ ఇప్పుడు దీని యొక్క యాక్సిస్ ను మరొక 21 రోజులపాటు పెంచుతూ వాలిడిటీని 386 రోజులకు అందిస్తున్నది. ఈ ప్లాన్ రోజుకు 3GB డేటా, దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, రెండు నెలలు లోక్‌ధన్ కంటెంట్ మరియు 365 రోజుల ఈరోస్ నౌ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








