జియో,Vi,ఎయిర్‌టెల్ టెల్కోలకు మించిన ప్రయోజనాలతో BSNL దీర్ఘకాలిక ప్లాన్

|

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారతదేశంలోని తన యొక్క వినియోగదారులను తిరిగి పొందడం కోసం ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిచయం చేస్తూ ప్రైవేట్ టెలికాం ఆపరేట్లకు సవాల్ విసురుతున్నది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా (Vi) తో సహా అన్ని ప్రైవేట్ ఆపరేటర్‌ల కంటే ప్రభుత్వరంగ టెలికం సంస్థ ఇప్పటికి తక్కువస్థాయిగా పరిగణించబడుతుంది. దీనికి గల కారణం ప్రస్తుతం పాన్-ఇండియా 4G నెట్‌వర్క్ లేకపోవడమే.

4G నెట్‌వర్క్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో అనేక ప్రాంతాలలో 4G నెట్ వర్క్ అందుబాటులో ఉండడం వలన BSNL యొక్క అన్ని రకాల ప్లాన్ లు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా అధికంగా డేటా అవసరం ఉన్న వారికి మరింత ఉపయోగకరముగా ఉంటాయి. దేశం అంతటా 4G నెట్‌వర్క్ లేకపోయినప్పటికీ దానితో సంబంధం లేకుండా BSNL దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు విస్మరించలేని కొన్ని 3G/4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అలాంటి ప్లాన్ లలో ఒకటి కొత్తగా విడుదలైన రూ.997 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రైవేట్ పోటీదారుల కంటే ఎంత మెరుగ్గా ఉందొ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.997 ప్లాన్ ప్రయోజనాల వివరాలు

BSNL రూ.997 ప్లాన్ ప్రయోజనాల వివరాలు

BSNL టెల్కో తన వినియోగదారులకు రూ.997 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉంది. ఇది PV_997 ప్లాన్ వోచర్ కింద 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది సరసమైన ధర వద్ద దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు గొప్పదిగా ఉంటుంద. ఈ ప్లాన్ వినియోగదారులకు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది.

జియో రూ .999 ప్లాన్‌ ప్రయోజనాల వివరాలు

జియో రూ .999 ప్లాన్‌ ప్రయోజనాల వివరాలు

BSNL యొక్క కొత్త PV_997 ప్లాన్ వోచర్ అందించే ప్రయోజనాలకు పోటీగా ప్రైవేట్ టెల్కోలలో రిలయన్స్ జియో రూ.999 ధర వద్ద లాంగ్ టర్మ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో వస్తుంది. కానీ ఈ ప్లాన్ కేవలం 84 రోజుల చెల్లుబాటుతో మాత్రమే వస్తుంది. ఇది BSNL యొక్క ప్లాన్‌తో అందించే దానికంటే 96 రోజులు తక్కువ. అయితే జియో వినియోగదారులు అదనంగా జియోసినిమా, జియోటీవీ, జియోన్యూస్, జియోక్లౌడ్ మరియు జియోసెక్యూరిటీ వంటి జియో యాప్‌ల సూట్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా స్వీకరించడానికి వినియోగదారులకు అర్హత ఉంది.

ఎయిర్‌టెల్‌

BSNL యొక్క PV_997 లాంగ్ టర్మ్ ప్లాన్ కు పోటీగా ఈ రేంజ్‌ ధరలో భారతీ ఎయిర్‌టెల్‌కు ఇప్పటివరకు ఎలాంటి ప్లాన్స్ లేవు. అయితే టెల్కో ఇంతకు ముందు రూ.998 ప్లాన్‌ను అందిస్తోంది. కానీ అది కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదు. భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల విధేయత మరియు ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం ఎక్కువ చెల్లించే సామర్థ్యంతో ప్రయోగాలు చేయడానికి ఇది మంచి ధర పరిధి. అందువల్ల జియో మరియు బిఎస్‌ఎన్‌ఎల్‌లకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ రేంజ్‌లో ఒక్క ప్లాన్‌ను కూడా అందించకపోవడం పూర్తిగా వెనుకబడి ఉంది.

Vi

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో కూడా ఈ ధర పరిధిలో ఒక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందించడం లేదు. కానీ Vi ఇంతకు మునుపు రూ.999 ధర వద్ద ప్లాన్‌ను ఆఫర్ చేసింది. కానీ దీనిని కంపెనీ నిలిపివేసింది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎయిర్‌టెల్ మరియు Vi రెండూ కూడా తమ రూ.998 మరియు రూ.999 ప్లాన్‌లతో ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో రోజువారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) పరిమితి లేకుండా సంవత్సరానికి 12GB డేటా మాత్రమే అందించేవి. కానీ ఈ ప్లాన్‌లు 336 (ఎయిర్‌టెల్) మరియు 365 (Vi) రోజుల వాలిడిటీలతో లభించేవి. కాబట్టి ప్రస్తుతానికి ఎవరైనా రూ.1,000 ధర లోపు ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే BSNL వారికి ఉత్తమమైన ఆఫర్‌ను పొందింది.

BSNL రూ.1,999 ప్లాన్‌ ప్రయోజనాలు

BSNL రూ.1,999 ప్లాన్‌ ప్రయోజనాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెల్కో ఇటీవల తన యొక్క ప్లాన్ లలో కొన్నిటికి మార్పులు చేసింది. వీటిలో రూ.1,999 ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100GB అదనపు డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా లోక్‌ధన్ కంటెంట్ మరియు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ కంపెనీ ఈ ప్లాన్‌తో 500GB సాధారణ డేటాను అందించేది కానీ ఇప్పుడు అది మొత్తంగా 600GB డేటాను అందిస్తుంది. అయితే FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు డేటాను 80 Kbps వేగంతో బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Rs.997 Long-Term Plan Comes With More Benefits Beyond Jio, Vi, Airtel Private Telcos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X