Home
News

BSNL యూజర్‌లకు గుడ్‌న్యూస్‌.. రూ.319 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 65 రోజుల వ్యాలిడిటీ..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. గత సంవత్సరం జులైలో ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లు భారీగా రీఛార్జ్ ధరలు పెంచడంతో అనేక మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు పోర్టింగ్ అయ్యారు. అయితే ఇటీవల కాలంలో నెట్‌వర్క్‌ సమస్యలు, కాల్‌ డ్రాప్‌ల కారణంగా లక్షల మంది యూజర్లు మరోసారి బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అవుతున్నారు.

దీంతోపాటు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. నెట్‌వర్క్ సమస్యలు లేకుండా టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేస్తోంది. మరియు ఇతర సమస్యలను పరిష్కారం చేస్తోంది. దీంతోపాటు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు తక్కువ ధరలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్‌ చేస్తోంది.

BSNL Rs319 Recharge plan

BSNL రూ.319 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (BSNL Rs319 Recharge Plan) భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్‌ మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 10GB డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఏకంగా 65 రోజులుగా ఉంది. కాలింగ్ అవసరాలు ఎక్కువగా మరియు తక్కువ డేటాను వినియోగించే వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. మరియు BSNL రెండో సిమ్‌ కార్డుగా ఉపయోగిస్తున్న వారికి కూడా ఈ ప్లాన్‌ అనుకూలం.

రూ.345 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (BSNL Rs345 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతి రోజు 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది. డేటా, కాలింగ్‌ సదుపాయం రెండూ కావాలనే యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

రూ.347 రీఛార్జ్ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లు ఈ ప్లాన్‌లో (BSNL Rs347 Recharge Plan) భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. డేటా పరంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీతో మొత్తంగా 108GB డేటాను వినియోగించుకోవచ్చు. డేటాతోపాటు, కాలింగ్‌ అవసరం ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఇదే డేటా, వ్యాలిడిటీ కోసం ఇతర నెట్‌వర్క్స్‌లో ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.439 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (BSNL Rs439 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఏకంగా 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో కేవలం వాయిస్‌, SMS ప్రయోజనాలను మాత్రమే అందిస్తోంది. ఎటువంటి డేటాను అందించడం లేదు.

BSNL 4G నెట్‌వర్క్ కోసం శరవేగంగా పనిచేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 70 వేలకు పైగా యాక్టిగా ఉన్నాయి. ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా కీలక వివరాలు వెల్లడించారు.

ఈ సంవత్సరం మే - జూన్‌ నాటికి లక్ష 4G టవర్లను యాక్టివ్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. మరియు జూన్‌ నుంచి 5G కి అప్‌గ్రేడ్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గత సంవత్సరంలోనే 5G నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్‌ఎల్‌ టెస్టింగ్ చేసింది

FAQs
BSNL 4G నెట్‌వర్క్ ఎప్పటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది?

BSNL 4G నెట్‌వర్క్ మే- జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

BSNL 4G పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?

ఇటీవల కేంద్ర మంత్రి ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా 70 వేలకు పైగా టవర్లు యాక్టివ్‌గా ఉన్నాయి. లక్షల టవర్ల ఏర్పాటు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నారు.

BSNL 5G నెట్‌వర్క్ ఎప్పటికి ప్రారంభం కానుంది?

ఈ సంవత్సరం జూన్ నుంచి 4G నుంచి 5G అప్‌గ్రేడ్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని ఇటీవలే మంత్రి జోతిరాధిత్య సింధియా తెలిపారు.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs319 Recharge plan offers 65 days validity with unlimited calling and 10GB Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X