BSNL వసంతం గోల్డ్ - PV96 రీఛార్జ్ ప్లాన్‌

|

బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో కొత్త కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఇప్పుడు వున్న చందాదారులు కాకుండా మరింత మంది చందాదారులను ఆకర్షించే మార్గంగా కొత్త ప్రీపెయిడ్ వోచర్లు మరియు స్పెషల్ టారిఫ్ వోచర్లు (ఎస్‌టివి)లను ప్రవేశపెడుతున్నారు . రాష్ట్ర నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ గత కొన్ని నెలల్లో అనేక కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది.

BSNL వసంతం గోల్డ్ - PV96 రీఛార్జ్ ప్లాన్‌

 

ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరియు ఎస్‌టివిలకు కొన్ని సుదీర్ఘ సవరణలను చేసింది. ఈ కొత్త అప్డేట్ లలో కొన్ని ఉత్తేజకరమైన కంటెంట్ సమర్పణలు కూడా వస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ గతంలో చందాదారులను ఆకర్షించడానికి ఉపయోగించిన కొన్ని ప్లాన్‌లను మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతున్నారు.

BSNL వసంతం గోల్డ్ - PV96 రీఛార్జ్ ప్లాన్‌

ఇప్పుడు ఆ మార్గాల్లో బిఎస్ఎన్ఎల్ యొక్క వసంతం గోల్డ్ - PV96 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది 90 రోజుల కాల పరిమితితో అందుబాటులో ఉంటుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .96 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు:

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .96 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు:

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం వసంతం గోల్డ్ - PV96 రీఛార్జ్ ప్లాన్‌ను చెన్నై మరియు తమిళనాడు సర్కిల్‌లో మాత్రమే ప్రారంభించబడింది.ఈ ప్లాన్‌ జూలై 5, 2019 నుండి అమలులోకి వస్తుంది. ఇది చందాదారులకు 90 రోజుల ప్రమోషనల్ సమయానికి అందుబాటులో ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రూపొందించిన రూ.96 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది ముంబై మరియు ఢిల్లీ సర్కిల్స్ మినహా అపరిమిత లోకల్ మరియు ఎస్‌టిడి కాల్‌లను రోమింగ్ తో సహా ఏ నెట్‌వర్క్‌కైనా అందిస్తుంది. దానితో పాటు చందాదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందుతారు. ఈ ఫ్రీబీస్ యొక్క చెల్లుబాటు 21 రోజులు మాత్రమే. కాల్స్ కోసం ఫ్రీబీస్ తర్వాత వర్తించే బేస్ టారిఫ్ "నిమిషానికి " ప్రకారం ఉంటుందని బిఎస్ఎన్ఎల్ గుర్తించింది. ఈ ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాలనుకునే బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు 123 కు SMS PLAN VOICE96 ను పంపడం ద్వారా పొందవచ్చు.

బిఎస్ఎన్ఎల్ 2.2 జిబి అదనపు డేటాను అందించే బంపర్ ఆఫర్‌:
 

బిఎస్ఎన్ఎల్ 2.2 జిబి అదనపు డేటాను అందించే బంపర్ ఆఫర్‌:

ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ఈ కొత్త ప్లాన్ కాకుండా బిఎస్ఎన్ఎల్ ఈ నెలలో మరో వినియోగదారు-కేంద్రీకృత కదలికను చేసింది. ఇది టెల్కో చందాదారులకు బాగా నచ్చింది. రాష్ట్ర నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ తన పాపులర్ బంపర్ ఆఫర్‌ను సవరించింది. ఇది ప్రతి నెలా చందాదారులకు 2.2GB డేటాను అదనంగా అందిస్తుంది. జూన్ చివరితో ముగియనున్న ఈ ఆఫర్ జూలై మొదటి వారంలో సవరించబడింది. ఇప్పుడు ఇది అక్టోబర్ 2019 వరకు పొడగించబడింది. ఈ ప్రణాళిక ప్రకారం చందాదారులు తమ ప్రస్తుత డేటా పైన వారి ఖాతాలకు 2.2GB డేటాను అదనంగా పొందుతారు. ఈ ఆఫర్ కింద అర్హత సాధించే ఎస్‌టివిలు మరియు ప్రీపెయిడ్ వోచర్‌లను కూడా బిఎస్‌ఎన్‌ఎల్ జాబితా చేసింది.

STV లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు:

STV లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు:

ఉదాహరణకు సాధారణంగా STV లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే BSNL చందాదారుడు రోజుకు 1GB డేటాను పొందుతుంటే ఈ ఆఫర్‌తో కలిపి కస్టమర్ ఇప్పుడు రోజుకు 3.2GB డేటాను పొందగలుగుతారు. అదేవిధంగా రోజుకు 2GB డేటాను ఆస్వాదించే చందాదారులు ఈ ఆఫర్ సౌజన్యంతో రోజుకు 4.2GB డేటాను యాక్సెస్ చేస్తారు. ఈ ఆఫర్‌కు అర్హత సాధించే కొన్ని ప్లాన్‌లను బిఎస్‌ఎన్‌ఎల్ జాబితా చేసింది. వీటిలో రూ .186 , రూ. 429 ప్లాన్ , రూ .485 మరియు రూ 666 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తున్నాయి .

భారత్ ఫైబర్ కింద బిఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు:

భారత్ ఫైబర్ కింద బిఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు:

రిలయన్స్ జియో గిగా ఫైబర్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి భారత్ ఫైబర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించినట్లు బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల ప్రకటించింది. ఈ ప్లాన్‌లు 349 రూపాయల సరసమైన ధరతో ప్రారంభమవుతాయి. అవి 8 Mbps, 10 Mbps, 25 Mbps, 50 Mbps, 75 Mbps మరియు 100 Mbps వంటి వివిధ స్పీడ్ ఆప్షన్ల వద్ద వస్తాయి. కొత్త బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలలో రోజువారీ లేదా నెలవారీ డేటాతో ఎంపికలు ఉన్నాయి మరియు ఈ ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ మరియు హాట్స్టార్ వంటి చందాలను కూడా అందిస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
bsnl rs96 prepaid voucher

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more