జియో రూ.247 కొత్త ప్లాన్‌ కంటే అధిక డేటాను అందిస్తున్న BSNL 4G ప్లాన్‌లు ఇవే...

|

రిలయన్స్ జియోటెలికాం సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం కొద్ది రోజుల క్రితం కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు రోజువారీ FUP పరిమితులు లేకుండా వినియోగదారులకు డేటాను అందిస్తుంది. ఒక రోజులో అధికంగా డేటా అవసరం ఉండే వినియోగదారులకు FUP నిర్దిష్ట డేటా పరిమితిని పరిమితం చేయని ఈ ప్లాన్‌లు మెరుగ్గా ఉంటాయి. అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా వోచర్ అనేది రిలయన్స్ జియో ఇటీవల ప్రారంభించిన రూ.247 ప్లాన్‌ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. BSNL యొక్క వోచర్ చౌకైనది మాత్రమే కాకుండా జియో యొక్క ప్లాన్‌తో పోలిస్తే అధిక డేటాను కూడా అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

బిఎస్ఎన్ఎల్ 4G రూ.151 వోచర్ Vs జియో రూ .247 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ 4G రూ.151 వోచర్ Vs జియో రూ .247 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం హోమ్ డేటా వోచర్లను ప్రకటించింది. ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులు తమ పనిని సజావుగా నిర్వహించడానికి ఎక్కువ డేటాను పొందడంలో ఇవి అధికముగా సహాయపడతారు. ఆ సమయంలో ప్రకటించిన 4G డేటా వోచర్‌లలో ఒకటి రూ.151 ప్లాన్ తక్కువ మొత్తంలో లభించే వాటికి అనుగుణంగా ఉంటాయి.

బిఎస్‌ఎన్‌ఎల్

బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ.151 ధర వద్ద అందించే 4G ప్లాన్ వినియోగదారులకు 40GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా జింగ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. రిలయన్స్ జియో నుండి ఇటీవల వచ్చిన రూ.247 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 25GB డేటాను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు జియో కంటే దాదాపు రూ.100 తక్కువ ధరకు తమ ప్లాన్ ను అందిస్తున్నప్పటికి జియో కంటే 15GB డేటాను అధికంగా అందిస్తుంది.

జియో
 

కానీ మీరు పరిగణించవలసిన కొన్ని అదనపు విషయాలు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో యొక్క రూ.247 ప్లాన్ రోజుకు 100SMS మరియు 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులు జియో అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా కూడా అందిస్తుంది. అయితే బిఎస్ఎన్ఎల్ నుండి చౌకైన టాక్-టైమ్ ప్యాక్ మరియు SMS ప్యాక్ ను కొనుగోలు చేసిన కూడా జియో యొక్క రూ.247 ప్లాన్ కన్నా తక్కువ ఖర్చు చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వినియోగదారుడు బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రణాళికతో చాలా అధిక మొత్తంలో డేటాను పొందుతారు.

కేవలం డేటా

వినియోగదారుడు కేవలం డేటాను మాత్రమే కోరుకుంటే కనుక మరియు రిలయన్స్ జియో నుండి లభించే రూ.247 ప్లాన్ లో తన డబ్బును పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేకుండా ఉంటే కనుక వారు బిఎస్ఎన్ఎల్ అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో లభించే రూ .251 4G ప్లాన్ ను కూడా పరిగణించవచ్చు. బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ ప్లాన్ జియో ప్లాన్ కంటే రూ.4 మాత్రమే ఖరీదైనది. అయితే మొత్తంగా 70GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

BSNL

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ యొక్క ప్లాన్ లు చౌకగా ఉంటాయి మరియు ఎక్కువ డేటాను అందిస్తాయి. ఇవి జియో యొక్క ప్లాన్ల మాదిరిగానే 28 రోజులు మరియు 30 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. అయితే BSNL యొక్క ఈ ప్లాన్ లకు వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు ఏవి లేవు. కాబట్టి బిఎస్‌ఎన్‌ఎల్ 4G ప్లాన్‌లు రిలయన్స్ జియో రూ.247 ప్లాన్ అందించే డేటా ప్రయోజనాల కంటే ముందున్నాయి. మొత్తం ప్రయోజనాల విషయానికి వస్తే Jio యొక్క ప్లాన్ సౌకర్యవంతంగా ముందు వరుసలో ఉంటుంది. ఇంకా BSNL యొక్క ప్లాన్ లతో మీరు పొందే దానికంటే జియో యొక్క ప్లాన్ తో డేటా స్పీడ్ చాలా బాగుంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL These 4G Plans Offer More Data Than Jio New Rs.247 Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X