ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
ప్రభుత్వ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు అధ్భుతమైన కానుకను అందించింది. బంపర్ ఆఫర్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ ఆగస్టు 15 నుంచి ప్రతి ఆదివారంఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ గా ప్రీ కాల్స్ చేుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెలస్తోంది. ఈ ప్లాన్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే. ల్యాండ్ ఫోన్ బిజినెస్‌ను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఉచిత కాల్ ప్లాన్ కు ఇది అదనం. నైట్ కాలింగ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు తాజాగా సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తుంది.
రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకూ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్ ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకూ అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్, సెల్‌ఫోన్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
మినిమం చార్జితోనే ఈ ఉచిత కాల్స్‌ను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఉచిత కాల్స్ తో మళ్లీ ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెలలోనే బీఎస్‌ఎన్‌ఎల్ దాదాపు తొమ్మిదివేల కొత్త కనెక్షన్లను ఇచ్చినట్లు తెలిపింది.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
ఇక ఇంటర్నెట్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ సేవల డేటా డౌన్‌లోడ్ వేగాన్ని (ఎఫ్‌యూపీ పరిమితి తర్వాత) ఈ నెల 1 నుంచి 1 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. గతంలో ఇది 512 కేబీపీఎస్‌గానే ఉండేదని పేర్కొంది.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
ప్రస్తుత, కొత్త వినియోగదారులందరికీ తాజా మార్పు వర్తిస్తుందని...ఇందుకోసం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఓ ప్రకటనలో వివరించింది.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
అలాగే హైదరాబాద్ టెలికం జిల్లా బీబీజీ కాంబో 470 ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. ఈ ప్లాన్ కింద రూ. 470 రెంటల్ చార్జీతో 1 ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని అందించడంతోపాటు రెంట్‌ఫ్రీ ల్యాండ్‌లైన్‌ను అందిస్తున్నామని తెలిపింది.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో బ్రాడ్ బ్యాండ్, వైఫై కలిగిన రెండు మోడెంలను రూ.1500లకే అందిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం రవిబాబు అన్నారు. ఈ ఆఫర్ ద్వారా నెలకు వంద రూపాయల చొప్పున వారికి మేమే 15 నెలలు తిరిగి చెల్లిస్తామన్నారు.

ఆగస్టు 15 నుంచి బంపరాఫర్..ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్
మరి ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల దెబ్బకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పరిస్థితి అంత బాగోలేదు. ఇలాంటి ఆఫర్లు అయిన ఈ ప్రభుత్వ రంగ సంస్థను బతికిస్తే మంచిదే!

Click it and Unblock the Notifications