భారీ పెట్టుబడులతో పంజా విప్పిన Bsnl

By Hazarath
|

ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎసఎన్ఎల్ ఇప్పుడు పెట్టుబడుల పంజా విప్పింది. ప్రైవేట్ రంగ టెలికం కంపెనీలకు ధీటుగా వాటికి సవాల్ విసిరేందుకు భారీ పెట్టుబడులతో ముందుకు దూసుకువస్తోంది. తమ నెట్ వర్క్ సామర్ధ్యాలను మరింత మెరుగుపరుచుకునే దిశలో ముందుకు సాగుతోంది. మరి ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుందనే అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

జియోకి మైండ్ బ్లాక్ : 1+1 ఆఫర్‌తో దడ పుట్టిస్తున్న BSNL

ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను

ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని బిఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైఫై హాట్‌స్పాట్‌లు,

వైఫై హాట్‌స్పాట్‌లు,

వైఫై హాట్‌స్పాట్‌లు, మొబైల్ టవర్ల ఏర్పాటు, కోర్ నెట్‌వర్క్ విస్తరణ సహా పలు రకాల ప్రాజెక్టులపై ఈ నిధులను వినియోగించనుంది. ‘పూర్తి ఆర్థిక సంవత్సరంలో మా పెట్టుబడులుగా రెండు భాగాలుగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.

సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు
 

సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు

బీఎస్‌ఎన్‌ఎల్ సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు, ప్రభుత్వ నిధుల సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై రూ.3,000 కోట్లు ఖర్చు చేయనున్నాం' అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై

సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై

సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.1,500 కోట్లు వ్యయం చేశామని, అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో మిగిలిన రూ.2,500 కోట్లను వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, జీఎస్‌ఎం నెట్‌వర్క్ విస్తరణ, నెట్‌వర్క్ బలోపేతానికి ఖర్చు చేయనున్నట్టు అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు, స్పెక్ట్రమ్ ప్రాజెక్టు ‘భారత్‌నెట్ అండ్ డిఫెన్స్' నెట్‌వర్క్ ఈ రెండూ ప్రభుత్వ నిధులతో బీఎస్‌ఎన్‌ఎల్ అమలు చేస్తున్న ప్రాజెక్టులన్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జీఎస్‌ఎం విస్తరణ ప్రాజెక్టులో

జీఎస్‌ఎం విస్తరణ ప్రాజెక్టులో

జీఎస్‌ఎం విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 20వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్)లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది.

2018 నాటికి 40,000కు

2018 నాటికి 40,000కు

బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 2,700 వైఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేసింది. ఈ సంఖ్యను 2018 నాటికి 40,000కు పెంచనున్నాం' అని శ్రీవాస్తవ వివరించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం

తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం

ఈ హాట్‌స్పాట్లన్నింటినీ తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తామని, దీని వల్ల తమ కస్టమర్లు వాటి పరిధిలోకి వెళ్ళగానే డేటా సెషన్‌ వైఫై హాట్‌స్పాట్‌ కనెక్ట్‌ కావడం వల్ల వారికి నిరంతరాయంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.

అదనపు భారం లేకుండానే హైస్పీడ్‌ డేటా

అదనపు భారం లేకుండానే హైస్పీడ్‌ డేటా

ఇది కూడా కస్టమర్‌ డేటా ప్యాకేజిలో భాగం కావడం వల్ల వారికి అదనపు భారం లేకుండానే హైస్పీడ్‌ డేటా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
BSNL to pump in Rs 2,500 cr for expansion of network read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X