Just In
- 4 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 7 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 10 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 11 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
Don't Miss
- News
వామ్మో.. హీరో కూడానా... తక్కువ ధరకు కార్లు అంటూ మోసం.. కేసు నమోదు..
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్‌లు... తక్కువ ధర వద్ద అన్ లిమిటెడ్ డేటా!!!!!
ప్రస్తుతం భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో తక్కువ ధర వద్ద అధిక ప్రయోజనాలను అందిస్తున్న వారిలో బిఎస్‌ఎన్‌ఎల్ అగ్ర స్థానంలో ఉంది. ఇది గత ఏడాది రోజువారీ డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల భావనను ప్రవేశపెట్టింది. BSNL నుండి లభించే మొబైల్ ఫోన్ ప్లాన్‌లలో ఎక్కువ భాగం అన్ని దాదాపు FTTH మరియు కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్‌లు రోజువారీ FUP పరిమితిని కలిగి ఉంటాయి.

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.777 మరియు రూ.1,277ల భారత్ ఫైబర్ ప్లాన్‌లతో పాటు రూ.2,499, రూ.3,999 వంటి ఇతర ప్లాన్‌లు రోజుకు 170GB వరకు రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. రోజువారీ FUP పరిమితి లేని కొన్ని బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఏదేమైనా రోజువారీ డేటా ప్రయోజనం ఉన్న వారితో పోల్చితే రోజువారేతర డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అందించే ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. BSNL యొక్క స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 99 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. కాని FUP పరిమితి లేని ప్లాన్‌లు వివిధ సర్కిల్‌లలో 555 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

డైలీ డేటా క్యాప్ లేని బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో తక్కువ బడ్జెట్ ధరలో వున్న ప్లాన్లు కూడా రోజువారీ డేటా క్యాప్ లేని ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఫైబ్రో 100 జిబి లేదా మంత్ CS106 అని పిలువబడే రూ .555 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ముందు వరుసలో ఉంది. రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ రూపొందించిన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలలో 100 జీబీ డేటాను 20mbps వేగంతో అందిస్తుంది. 100GB డేటా తరువాత దీని యొక్క వేగం 1 Mbps కి తగ్గుతుంది. చందాదారులు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు ఇతర నెట్‌వర్క్‌లకు రాత్రి 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు మరియు ఆదివారం అపరిమిత కాలింగ్ ప్రయోజనంను పొందుతారు.
ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

బిఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 300 జిబి ప్లాన్
ఈ వరుసలో వున్న తదుపరి ప్లాన్ బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న రూ.749 బ్రాడ్బ్యాండ్ ప్లాన్. దీనిని సూపర్ స్టార్ 300 జిబి ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్లాన్ పేరుకు తగ్గట్లుగా మొత్తం చెల్లుబాటు కాలంలో 300GB డేటాను 50 Mbps వేగంతో అందిస్తుంది. ఈ FUP డేటా అయిపోయిన తరువాత డేటా యొక్క వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్‌ను అందిస్తుంది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు రూ.745 మరియు అంతకంటే ఎక్కువ విలువైన అన్ని ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని సంవత్సరానికి అందిస్తుంది కాబట్టి ఈ ప్లాన్ యొక్క చందాదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతారు.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
ఈ జాబితాలోని మొదటి ప్లాన్ రూ.777ల ఫైబ్రో 500GB ప్లాన్. ఇది ఒక నెల చెల్లుబాటు కాలంతో 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో 500GB డేటాను అందిస్తుంది. దీని తరువాత డేటా యొక్క వేగం 2 ఎమ్‌బిపిఎస్ కు తగ్గించబడుతుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ప్రయోజనంను కూడా అందిస్తుంది. . ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తుంది.
జనవరి 2020 సెక్యూరిటీ అప్డేట్ను పొందిన గెలాక్సీ Aసీరీస్ స్మార్ట్ఫోన్లు

రూ.849 బ్రాడ్బ్యాండ్ ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క పోర్ట్‌ఫోలియోలో వున్న మరొక ప్లాన్ రూ.849 బ్రాడ్బ్యాండ్ ప్లాన్. ఇది రోజువారీ ఎఫ్‌యుపి పరిమితి లేకుండా 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో మొత్తం ఒక నెల చెల్లుబాటు కాలంలో మొత్తంగా 600 జిబి డేటాను అందిస్తుంది. అలాగే ఇది అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్ ప్రయోజనంను కూడా అందిస్తుంది. చందాదారులకు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో నెలకు 750 జిబి డేటాను అందించే రూ.1,277 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా పైన తెలిపిన ప్లాన్ యొక్క అన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.

హై రేంజ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
బిఎస్ఎన్ఎల్ యొక్క హై రేంజ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కూడా నెలవారీ ఎఫ్‌యుపితో వస్తాయి. ఇందులో 100 ఎంబిపిఎస్ వేగంతో నెలకు 2000 జిబి డేటాను రూ.2999 ప్లాన్ అందిస్తుంది. 100 ఎంబిపిఎస్ వేగంతో 2000 జిబి డేటాను రూ.4,999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ నుండి ఇదే తరహాలో వస్తున్న మరొక ప్లాన్ రూ.9,999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్. ఇది నెలకు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 2250 జిబి డేటాను అందిస్తుంది. అయితే ఎఫ్‌యుపి తర్వాత దీని వేగం 8 ఎమ్‌బిపిఎస్ కు తగ్గించబడుతుంది. పైన తెలిపిన అన్ని ప్లాన్లు అపరిమిత కాలింగ్ మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190