BSNL - YuppTV స్కోప్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లలో ఊహించని మార్పులు
బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి గత నెలలో యుప్ టివితో కలిసి 'యుప్ టివి స్కోప్' అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. యుప్ టివి స్కోప్ ZEE5 ప్రీమియం, YuppTV, SonyLIV మరియు Voot Select వంటి నాలుగు OTTల కంటెంట్‌ను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్లు ఈ యుప్ టివి స్కోప్ ప్యాకేజీని కేవలం రూ.129 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే నాలుగు చందాలను ఒక్కొక్కటిగా ఎంచుకుంటే కనుక నెలకు రూ.250లకు పైగా ఖర్చు అవుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ పరిచయ ఆఫర్లో భాగంగా రూ.129 ధర వద్ద మొదటి మూడు నెలలకు మాత్రమే అందిస్తుంది. మూడు నెలల తరువాత ఈ చందాను నెలకు రూ.199 ధర వద్ద పొందగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL-YuppTV స్కోప్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్
యుప్ టివి స్కోప్ అనేది కంటెంట్ అగ్రిగేటర్ యాప్. ఇది ఈ రోజు అందుబాటులో ఉన్న ZEE5 ప్రీమియం, సోనీలైవ్, వూట్ సెలెక్ట్ మరియు YuppTV నాలుగు ప్రసిద్ధ OTT యాప్ కంటెంట్‌ను బండిల్ చేస్తుంది. YuppTV సహకారంతో బిఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ సేవను పరిచయం చేసింది. యుప్ టివి స్కోప్ తో కస్టమర్లు లైవ్ టివి ఛానెళ్ళను చూడవచ్చు ఎందుకంటే ఇది యుప్ టివి చందాతో కూడా బండిల్ చేయబడి ఉంది. YuppTV స్కోప్ మొత్తంగా 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

BSNL-YuppTV స్కోప్ పరిచయ ఆఫర్
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం యుప్ టివి స్కోప్ ను నెలకు కేవలం రూ.199 ధరతో ఒక ప్లాన్ ను కలిగి ఉంది. అయితే ఇప్పటికే ఉన్న మరియు కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు మొదటి మూడు నెలలకు చెల్లుబాటు అయ్యే పరిచయ ఆఫర్‌ను పొందవచ్చు. ఇది నెలవారీ సభ్యత్వాన్ని రూ.199 నుండి రూ.129 కి తగ్గిస్తుంది.

ZEE5 ప్రీమియం, సోనీలైవ్ మరియు వూట్ సెలెక్ట్ సబ్‌స్క్రిప్షన్ యొక్క ధరలు నెలకు రూ.99 కాగా, యుప్ టివి సబ్‌స్క్రిప్షన్ లో మాత్రం నెలకు కేవలం రూ.49 ధరకే లభిస్తుంది. వీటిని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర వద్ద వ్యక్తిగతంగా ఎంచుకుంటే కనుక నెలకు రూ.346 ఖర్చు అవుతుంది. కానీ వీటిని కేవలం పరిచయ ఆఫర్లో భాగంగా రూ.129 వద్ద మరియు దాని తరువాత రూ.199 ధర వద్ద పొందవచ్చు. యుప్ టివి 300 కి పైగా లైవ్ టివి ఛానెళ్లను అందిస్తుండటం అనేది మంచి ఒప్పందం అని చెప్పాలి. అదనంగా స్టాండర్డ్ యుప్ టివి చందాను కెనడా, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలోని వినియోగదారులు కూడా కొనుగోలు చేయవచ్చు.

బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొన్ని ప్లాన్లు డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వంతో కలిగి ఉన్నాయి. కానీ అది కాకుండా ఇతర OTT సభ్యత్వాలను అందించడం లేదు. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు యుప్ టివి స్కోప్ నెలవారీ సభ్యత్వాన్ని అదనంగా కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇది మొత్తం కంటెంట్ను ఒకే చోట చూడడానికి అనుమతిని ఇస్తుంది. జియోఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటి ఇతర ISP లు అదనపు ఖర్చు లేకుండా చాలా OTT లను అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








