ఐడియా అదరగొట్టింది

Written By:

దేశంలో కాల్ డ్రాప్స్ సమస్య ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతోంది. ఇది ఇంకా మెరుగుపడేందుకు ట్రాయ్ అన్ని టెల్కోలను అలర్ట్ చేస్తోంది. ఇదే విషయంపై వచ్చే వారం అన్ని టెల్కోలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐడియా మాత్రం పుల్ సిగ్నల్ ఇస్తూ ఎటువంటి కాల్ డ్రాప్స్ లేకుండా అగ్రభాగంలో నిలిచినట్లు ట్రాయ్ చెబుతోంది.

జియోకి కౌంటర్, మేము ఫ్రీ కాల్స్ ఇస్తాం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాల్ డ్రాప్స్ రేటు

దేశంలో కాల్ డ్రాప్స్ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్ మార్క్ (0.5 శాతం) స్థారుు కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

బెంచ్ మార్క్ స్థాయి కన్నా దిగువకు

టెల్కోలన్నీ వాటి కాల్ డ్రాప్స్ రేటును వీలైనంత త్వరగా బెంచ్ మార్క్ స్థాయి కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వచ్చే వారంలో పలు టెలికం సంస్థలతో సమావేశం

కాల్ డ్రాప్ సమస్యలో పురోగతి కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలి. అయితే కొన్ని చోట్ల కాల్ డ్రాప్ సమస్య అలాగే ఉంటోంది. దీనిని పరిష్కరించేందుకు వచ్చే వారంలో పలు టెలికం సంస్థలతో సమావేశం నిర్వహిస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు.

ఐడియాకు సంబంధించి

ఐడియాకు సంబంధించి ఏ సర్కిల్లో కూడా కాల్ డ్రాప్స్ లేవు. ఎయిర్‌టెల్ ఏడు సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ 0.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నాయి. వొడాఫోన్కు 11 సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు

కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి మేం తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపామని ఆయన వివరించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Call drop way above benchmark; meet with telecom companies next week: TRAI read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot