2జీ, 3జీ ఫోన్లకు కూడా జియో వాడుకోవచ్చు: రిలయన్స్

Written By:

ఇప్పుడు ఎక్కడ చూసినా రిలయన్స్ జియో హవానే కనిపిస్తోంది. ఉచిత ఆపర్లతో టెల్కోలకు చుక్కలు చూపిస్తున్న జియో ఇప్పుడు 2జీ, 3జీ ఫోన్లకు కూడా జియోని వాడుకోవచ్చంటోంది. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఇంకా 2జీ, 3జీ ఫోన్లను వాడుతున్న నేపథ్యంలో జియో వారిని ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే 2జీ, 3జీ ఫోన్లలో జియో సిమ్ ఎలా వాడతారనే దానిపై చాలా మంది సందేహాలకు జియో సమాధానం ఈ విధంగా ఇస్తోంది.

ఏపీ పర్స్ రెడీ, అదనపు ఆదాయం సంపాదించుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోఫై డివైస్‌లో

సిమ్ తీసుకున్న తరువాత మీరు జియోఫై డివైస్‌లో దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో 4జీ వాయిస్ అప్లికేషన్

ఆ తర్వాత మీరు మీ 2జీ, 3జీ ఫోన్లలో జియో 4జీ వాయిస్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతోంది.

మీ ఫోన్ లో జియో సిమ్ వేసి

ఆ ప్రాసెస్ అయిన తరువాత మీరు మీ ఫోన్ లో జియో సిమ్ వేసి యాక్టివేట్ కాగానే జియోకి సంబంధించిన ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, డేటా సేవలు పొందవచ్చు.

భిన్న వాదనలు

మరి ఈ పద్దతిలో జియో 2జీ, 3జీ ఫోన్లలో పనిచేస్తుందని రిలయన్స్ కంపెనీ చెబుతోంది. అయితే అది సపోర్ట్ చేయడంలేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

జియో డేటా స్పీడ్

దీంతోపాటు 4జీ ఫోన్లలోనే జియో డేటా స్పీడ్ చాలా స్లోగా ఉందని ఇక 2జీ, 3జీ ఫోన్లలో జియో డేటా స్పీడ్ ఇంకెంత స్లోగా ఉంటుందోనని యూజర్లు పెదవి విరుస్తున్నారు.

ఫోన్ బ్యాటరీ లైఫ్

అంతేకాకుండా జియో సిమ్ వేసిన దగ్గర్నుంచి ఫోన్ చార్జింగ్ వెంటనే తగ్గిపోతోందని, ఉచిత సేవల కోసం సిమ్ తీసుకుంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడంపై మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Can I use a Reliance Jio 4G sim in a 2G and 3G phones read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot