65 శాతం మంది ఐటీ ఉద్యోగులకు అసలు ఏమి రాదు !

Written By:

ఇప్పుడున్న ఉద్యోగుల్లో చాలా మంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనని దిగ్గజ ఐటీ సంస్థ క్యాప్‌ జెమిని అంటోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 60-65 శాతం మందికి కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా శిక్షణ కూడా ఇచ్చే పరిస్థితి కనబడటం లేదని, పరిశ్రమకు ఇది చాలా పెద్ద సవాలే అని కంపెనీ ఇండియా సీఈఓ శ్రీనివాస్‌ కందుల వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో కోతలు భారీగానే ఉండొచ్చని చెబుతున్నారు.

దిగ్గజాలకు సవాల్ విసురుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లక్ష మంది ఉద్యోగులు

ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమినీలో ప్రస్తుతం దేశీయంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

పెద్ద సంఖ్యలోనే ఐటీ ఉద్యోగాల కోత

భారత్‌లో పెద్ద సంఖ్యలోనే ఐటీ ఉద్యోగాల కోత ఉండొచ్చని మధ్య, సీనియర్‌ స్థాయిలో తొలగింపులు అత్యధికంగా చోటుచేసుకోవచ్చని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

15 లక్షల మందికి మళ్లీ శిక్షణ

డిజిటల్‌ టెక్నాలజీలకు అనుగుణంగా ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల్లో 15 లక్షల మందికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాజాగా పరిశ్రమ చాంబర్‌ నాస్కామ్‌ చెప్పడం తెలిసిందే.

80 శాతం మంది పనికిరారన్న ఆస్పైరింగ్‌ మైండ్స్‌

80 శాతం మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాలకు పనికిరారంటూ ‘ఆస్పైరింగ్‌ మైండ్స్‌' అనే సంస్థ అధ్యయన నివేదిక కొద్ది నెలల క్రితం వెల్లడించిన నేపథ్యంలో శ్రీనివాస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నాసిరకం కాలేజీల నుంచి

నాసిరకం కాలేజీల నుంచి ఇప్పు డు ఎక్కువ మంది విద్యార్ధులు ఐటీ రంగంలోకి అడుగుపెడుతున్నారని అందువల్ల వాళ్ల నైపుణ్యాలు పెద్దగా పనికిరావడం లేదని ఆయన తెలిపారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Capgemini India chief executive feels that 65% of his employees are not trainable to the new technologies read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot