దిగ్గజాలకు సవాల్ విసురుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8

Written By:

శాంసంగ్ నుంచి అందరూ ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్8కి సంబంధించిన వివరాలు ఎట్టకేలకు బయటకొచ్చాయి. ధర, కలర్ వేరియంట్స్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దీంతో పాటు కంపెనీ Bixby assistant ఫీచర్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ మార్క్ ని కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫోన్లకు బ్యాటరీలకు సోని కంపెనీ ధర్డ్ పార్టీగా ఉండనుంది.

ఒక్కటవుతున్న స్నాప్‌డీల్, పేటీఎమ్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లు బ్లాక్, గోల్డ్ ఆర్కిడ్ గ్రే కలర్స్ లో రానున్నాయి. ధర విషయానికొస్తే గెలాక్సీ ఎస్8 ధర దాదాపు రూ. 63,800 ఉండే అవకాశం ఉంది. ఎస్8 ప్లస్ ధర దాదాపు రూ. 70,500గా ఉండే అవకాశం ఉంది.

AI assistant ఫీచర్

గెలాక్సీ ఎస్8 large pressure sensitive displayతో పాటు డ్యూయెల్ కెమెరా సెట్ ఆప్ తో రానుంది. దీంతో పాటు కొత్తగా AI assistant ఫీచర్ ను పొందుపరిచినట్లు సమాచారం. దీంతో పాటు Bixby assistant కూడా పొందుపరిచినట్లు సమాచారం. దీని ద్వారా పే, వీడియోస్, క్యాలెండర్ ఈవెంట్స్ లాంటివి చూసేందుకు అవకాశం ఉంది.

24 గంటలు బ్యాటరీ లైఫ్

సోని కంపెనీ శాంసంగ్ బ్యాటరీలకు ధర్డ్ సప్లయిర్‌గా ఉండనుంది. శాంసంగ్ SDI ,Japan's Murataలతో కలిసి సోనీ పనిచేయనుంది. గెలాక్సీ ఎస్8 అలాగే ఎస్8 ప్లస్‌లు 3000mAh, 3,500mAh బ్యాటరీలతో వస్తాయని అంచనా. ఎంత రఫ్ గా వాడినా 24 గంటలు బ్యాటరీ లైఫ్ ఉండే విధంగా దీన్ని రూపొందించారు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికొస్తే గెలాక్సీ ఎస్8 5.8 హెచ్ డి డ్యూయెల్ ఎడ్జ్ కర్వ్డ్ గ్లాస్‌తో రానుంది. అలాగే గెలాక్సీ ఎస్8 ప్లస్ 6.2 హెచ్‌డి డ్యూయెల్ ఎడ్జ్ కర్వ్డ్ గ్లాస్‌తో రానుంది, కంపెనీ ఈ ఫోన్లను మార్చి 29న మార్కెట్లోకి తీసుకువస్తుందని అంచనా.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ ఉంటుందని సమాచారం.కెమెరా విషయానికొస్తే 16 ఎంపీ డ్యూయెల్ కెమెరాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాను నిక్షిప్తం చేసే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8 Price and Colour Variants Leaked read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot