టైటాన్‌‌ను మంచు మేఘాలు కప్పేశాయి

By Hazarath
|

టైటాన్‌‌ను మంచు మేఘాలు కప్పేశాయి. అవును..శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై భారీస్థాయిలో మంచు మేఘాలు ఉన్నట్లు 'నాసా' ప్రకటించింది. టైటాన్ స్ట్రాటో ఆవరణం దిగువ మధ్యభాగంలో ఇవి ఉన్నట్లు కేసినీ వ్యోమనౌక గుర్తించింది. టైటాన్ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఇవి ఉన్నట్లు నాసా తెలిపింది. భూమిపై ఉన్న పొగమంచు మాదిరిగా ఈ మేఘాలు అత్యల్ప సాంద్రతను కలిగి ఉన్నాయి. కాని పైభాగం మాత్రం చదునుగా ఉంది. ఇవి భూమిపై వర్షాన్నిచ్చే మేఘాల మాదిరిగా ఏర్పడవు. వెచ్చని అర్థగోళంలోని వాతావరణం నుంచి వేడి వాయువులు దక్షిణార్థగోళంలోని చల్లని ప్రాంతానికి ప్రసరిస్తాయి. ఈ టైటాన్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ఆకాశం నుంచి అంతు చిక్కని వస్తువులు

సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద గ్రహమైన శనికి 62 ఉపగ్రహాలు ..

సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద గ్రహమైన శనికి 62 ఉపగ్రహాలు ..

శనిగ్రహం చందమామ.. టైటాన్‌పై వాతావరణం ఊహించిన దాని కన్నా ఎక్కువగానే భూవాతావరణాన్ని తలపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద గ్రహమైన శనికి 62 ఉపగ్రహాలు (చందమామలు) ఉన్నాయి.

వీటిలో టైటాన్‌ అతిపెద్దది

వీటిలో టైటాన్‌ అతిపెద్దది

వీటిలో టైటాన్‌ అతిపెద్దది. మొత్తం సౌర కుటుంబంలో భూవాతావరణంతో సరిపోల్చదగిన వాతావరణ పరిస్థితులు టైటాన్‌పై ఉన్నాయని గతంలోనే పరిశోధకులు గుర్తించారు.సముద్రాలు, నదులు, వర్షపాతం, రాతి నేలలు అన్నీ భూమిపై ఉన్నట్లే ఇక్కడా ఉంటాయి. దీంతో టైటాన్‌ కేంద్రంగా పరిశోధనలు ఊపందుకున్నాయి.

యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు ..

యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు ..

‘ఇంటర్నేషనల్‌ కేసిని ప్రోబ్‌' ప్రాజెక్టులో భాగంగా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు సుమారు ఏడేళ్లుగా టైటాన్‌పై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో టైటాన్‌ ధ్రువపుగాలులు సైతం భూమిపై వీచే ధ్రువపు గాలులను పోలి ఉన్నాయని గుర్తించారు.

ఇంతకు ముందే టైటాన్ పై నైలు నది లాంటి నది ఉన్నదని..

ఇంతకు ముందే టైటాన్ పై నైలు నది లాంటి నది ఉన్నదని..

ఇంతకు ముందే టైటాన్ పై నైలు నది లాంటి నది ఉన్నదని శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఏంటి ఉపగ్రహంపై నైలు నది ఉందా? అని ఆశ్చర్యపడిపోకండి. అది నిజమే. టైటాన్ ఉత్తరార్ధగోళం నుంచి ఓ పెద్ద సముద్రంగా సుమారు 400 కి.మీ పొడవు వరకూ ఆ నదీలోయ ఏర్పడిందట.

నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ..

నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ..

ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తెలిపింది. భూమిపై 6,700 కి.మీ వరకూ ఉన్న నైలు నది మాదిరిగానే టైటాన్ నది కూడా ఉందని తెలిపింది. క్యాసినీ వ్యోమనౌక తీసిన ఛాయాచిత్రాల ఆధారంగా ఆ నదిని గుర్తించినట్లు వెల్లడించింది.

ఇతర గ్రహాలపై ఇలా ఒక నదివ్యవస్థను ఇంత స్పష్టంగా గుర్తించడం

ఇతర గ్రహాలపై ఇలా ఒక నదివ్యవస్థను ఇంత స్పష్టంగా గుర్తించడం

భూమికాకుండా ఇతర గ్రహాలపై ఇలా ఒక నదివ్యవస్థను ఇంత స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమిపై నీరు ద్రవ రూపంలో ఉండగా, అక్కడ మీథేన్, ఈథేన్ వంటి హైడ్రోకార్బన్లు ద్రవరూపంలో ఉన్నాయట.

 టైటాన్‌పై దట్టమైన వాతావరణం కారణంగా ద్రువాలు

టైటాన్‌పై దట్టమైన వాతావరణం కారణంగా ద్రువాలు

అయితే టైటాన్‌పై దట్టమైన వాతావరణం కారణంగా ద్రువాలు సదూర తీర ప్రాంతాలకు ప్రవహించ కుండా అక్కడి పరిస్థితులను బట్టి అక్కడక్కడా నదీప్రవాహాలుంటాయని భావిస్తున్నారు.

టైటాన్‌ ఉపరితలం వద్ద భూమి కన్నా దట్టమైన వాతావరణం..

టైటాన్‌ ఉపరితలం వద్ద భూమి కన్నా దట్టమైన వాతావరణం..

ఇక టైటాన్‌ ఉపరితలం వద్ద భూమి కన్నా దట్టమైన వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. టైటాన్‌ వాతావరణంలోని రసాయన మూలకాలను ఒక గణిత నమూనా లెక్కించిన పరామితులతో శాస్త్రవేత్తలు పోల్చి చూసి, ఈ మేరకు నిర్ధరించారు.

లోగడ రూపొందించిన ఆ గణిత నమూనాలో..

లోగడ రూపొందించిన ఆ గణిత నమూనాలో..

లోగడ రూపొందించిన ఆ గణిత నమూనాలో 83 న్యూట్రల్‌ అణువులు, 33 అయాన్లు, వాటి మధ్య జరిగే 420 భిన్న రసాయన చర్యలను పరిగణనలోకి తీసుకొన్నారు. వీటి ఆధారంగా టైటాన్‌ వాతావరణాన్ని వివరించారు.

కేసిని ఉపగ్రహం ఎక్కువ వివరాలు ..

కేసిని ఉపగ్రహం ఎక్కువ వివరాలు ..

ఆ ఉపగ్రహం వాతావరణంలోని మూలకాల డేటాను వివిధ వనరుల నుంచి సేకరించారు. ఇందులో ప్రధానంగా కేసిని ఉపగ్రహం ఎక్కువ వివరాలు అందించింది. అందులో అతినీలలోహిత, పరారుణ స్పెక్ట్రోమీటర్లు సహా టైటాన్‌ నుంచి అంతరిక్షంలోకి వెలువడే అయాన్లను అధ్యయనం చేయడానికి అనేక పరికరాలు ఉన్నాయి.

టైటాన్‌లోని ఏరోసాల్స్‌ వివరాలను

టైటాన్‌లోని ఏరోసాల్స్‌ వివరాలను

దీనికితోడు హెర్షెల్‌ పరారుణ అబ్జర్వేటరీ, భూమి మీదున్న ఇరామ్‌ సబ్‌ మిల్లీమీటర్‌ టెలిస్కోపు అందించిన డేటాను కూడా ఉపయోగించుకున్నారు. టైటాన్‌లోని ఏరోసాల్స్‌ వివరాలను ఆ ఉపగ్రహంపై తొలిసారిగా దిగిన హయ్‌గన్స్‌ వ్యోమనౌక అందించింది.

వాస్తవ పరిస్థితితో సరిపోలిందని ..

వాస్తవ పరిస్థితితో సరిపోలిందని ..

ఈ డేటా మొత్తాన్ని లోగడ రూపొందించిన గణిత నమూనాలతో పోల్చి చూశారు. టైటాన్‌ వాతావరణానికి సంబంధించిన సిద్ధాంతపరమైన వివరణ.. వాస్తవ పరిస్థితితో సరిపోలిందని మాస్కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన వ్లాదిమిర్‌ క్రాస్నోపోల్స్కీ చెప్పారు.

భూమితో పోలిస్తే ఆ ఉపగ్రహం ఉపరితలం వద్ద

భూమితో పోలిస్తే ఆ ఉపగ్రహం ఉపరితలం వద్ద

భూమితో పోలిస్తే ఆ ఉపగ్రహం ఉపరితలం వద్ద వాతావరణం 1.6 రెట్లు ఎక్కువ సాంద్రంగా ఉన్నట్లు తేలింది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write A monster storm is brewing on Titan: Cassini spots huge ice clouds sweeping across the south pole of Saturn's moon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X