ఆకాశం నుంచి అంతు చిక్కని వస్తువులు

By Hazarath
|

అంతుచిక్కని రహస్యమొకటి స్పెయిన్‌వాసులను కలవరపరుస్తోంది. అకస్మాత్తుగా పంటపొలాల్లో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడడం.., వింతైన గోళాకారపు వస్తువులు ఆకాశంలో నుంచి అమాతంగా వచ్చిపడుతుండడంతో ఆ దేశంలోని కలస్పార్రా ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంతరిక్షం నుంచి అమాంతంగా వచ్చిపడుతున్న ఆ వస్తువులేంటి? అవి తమ ప్రాంతంలోనే ఎందుకు పడుతున్నాయి? జవాబు చెప్పమంటూ స్థానిక అధికారులను, శాస్త్రవేత్తలను నిలదీస్తున్నారు.మరి ఏమిటీ ఆ మిస్టరీలు..

Red more: గూగుల్ సీక్రెట్ కోడ్స్ ఇవే

ఆకాశం నుంచి అకస్మాత్తుగా వింత వస్తువులు..
 

ఆకాశం నుంచి అకస్మాత్తుగా వింత వస్తువులు..

ఆకాశం నుంచి అకస్మాత్తుగా వింత వస్తువులు కింద పడుతున్నాయని స్పెయిన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీనకలస్పారా ప్రాంతంలో గోళలాకారంలోని వస్తువు ఒకటి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది.

వస్తువును స్వాధీనం చేసుకుని పరిశోధనల నిమిత్తం

వస్తువును స్వాధీనం చేసుకుని పరిశోధనల నిమిత్తం

దీంతో ఆ పొలం యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిశోధకులు ,అధికారులు వచ్చి ఆ వస్తువును స్వాధీనం చేసుకుని పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లిపోయారు. తాజాగా మర్సియా ప్రాంతంలోని నివాస స్థలంలో మరొకటి పడింది . దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఐదు రోజుల్లో ఇది రెండోసారి..

ఐదు రోజుల్లో ఇది రెండోసారి..

ఈ నెల 3వ తేదీన నల్లని రంగులో, గోళాకారంలో ఉన్న వస్తువు ఇక్కడి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. దీనిని గమనించిన స్థానిక రైతు విషయాన్ని పోలీసు అధికారికి సమాచారం అందించాడు.

శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును..
 

శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును..

సమాచారం అందుకున్న పోలీసులు.. శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడారు. ఆ గోళం ఎక్కడి నుంచి పడింది? ఇంతకీ ఆ వస్తువు ఏ లోహంతో తయారు చేసింది? దానిపై ఉన్న దారపు పోగులవంటి పదార్థమేంటి? తదితర విషయాలపై పరిశోధన చేసేందుకు తీసుకెళ్లారు.

మళ్లీ అలాంటిదే...

మళ్లీ అలాంటిదే...

శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ఒవైపు కొన సాగిస్తుండగానే తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృ తమైంది. 80 డయామీరట్ల వ్యాసా ర్దంతో దాదాపు 20 కేజీల బరువున్న గోళాకారపు వస్తువొకటి మర్సియా ప్రాంతంలో పడింది.

9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో

9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో

కేవలం 9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో పడిన ఈ వస్తువు కూడా ఆకాశం నుంచే పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.

మరి మండిపోలేదెందుకు?

మరి మండిపోలేదెందుకు?

ఈ వస్తువు గురించి తలోరకంగా చెప్పుకుంటున్నారు. స్వర్గం నుంచి పడిన వస్తువంటూ కొందరు, గ్రహాంతరవాసులు విసిరిన వస్తువంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా స్పష్టమైన వివరాలేవీ వెల్లడించలేకపోతున్నారు.

గ్రహంతర వాసులు విసురుతున్న వస్తువులుగా

గ్రహంతర వాసులు విసురుతున్న వస్తువులుగా

గ్రహంతర వాసులు విసురుతున్న వస్తువులుగా వీటిని కొంత మంది భావిస్తుండగా మరికొందరు స్వర్గం నుంచి కిందపడిన వస్తువులుగా పేర్కొంటున్నారు. ఇంకొందరు గతంలో శాస్ర్తవేత్తలు అంతరిక్షంలోకి పంపని వస్తువులే ఇలా కిందపడుతున్నాయని పేర్కొంటున్నారు.

అయితే ఇందులోనూ లాజిక్..

అయితే ఇందులోనూ లాజిక్..

అయితే ఇందులోనూ లాజిక్ తీస్తున్నారు. అలా అంతరిక్షంలోకి పంపిన వస్తువులైతే భూమి మీద పడేటప్పుడు మంటలు చెలరేగి మసైపోవాలని లాజిక్ తీస్తున్నారు. శాస్ర్తవేత్తలు మాత్రం వాటి నిగ్గుతేల్చడంలో మునిగిపోయారు.ప్రజలు మాత్రం బిక్కు బిక్కు మంటూ ఆ మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అని ఎదురు చూస్తున్నారు.

మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు

మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు

గ్రహశకలమని చెప్పలేమని.., అలాగని మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయంతో ఏకీభవిద్దామన కున్నా.. అంతపై నుంచి భూమిపైకి దూసుకొస్తున్నప్పుడు తప్పనిసరిగా మండిపోవాలి.మండుతున్న వస్తువు నేలపై పడినప్పుడు ఆ ప్రాంతంలోని పంటకు తప్పనిసరిగా నిప్పంటుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని మరికొందరు చెబుతున్నారు.

ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో..

ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో..

ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో పడడానికి కారణమేంటో వెల్లడించాలి. మరిన్ని పడే అవకాశముందా? లేదా? అనే విషయం కూడా చెప్పాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
ufo-rumors-second-piece-of-mysterious-space-junk-found-in-murcia-spain

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X