మరో షాక్ : బ్యాంకులను టార్గెట్ చేసిన పాక్ సైబర్ !

Written By:

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ వంటి 19 బ్యాంకుల డెబిట్ కార్డుల సమాచారం హ్యాకయిన నేపథ్యంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ అందర్నీ హడలెత్తిస్తోంది. ఇండియాలో బ్యాంకులను పాకిస్తాన్ సైబర్ అటాక్ చేసే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

పేలిన ఐఫోన్ 7 : మంటల్లో కారు దగ్ధం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశాలు

మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ ఓ నోటీసు జారీచేసింది.

తాజాగా నోటీసులు

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా చేసిన హెచ్చరికలతో తాజాగా ఈ నోటీసులు బ్యాంకులకు అందాయి.

సైబర్ క్రిమినల్స్

పాకిస్తాన్‌కు చెందిన సైబర్ క్రిమినల్స్, బ్యాంకుల సమాచారాన్ని, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ను టార్గెట్ చేశారని అన్ని బ్యాంకులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. ఈ సైబర్ భద్రతా ఏజెన్సీ, కేంద్ర సెంట్రల్ బ్యాంకు ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీయ బ్యాకింగ్‌లో

ఈ గురువారమే భారతీయ బ్యాకింగ్‌లో అతిపెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, ఈ ఉల్లంఘనతో 32 లక్షల అకౌంట్ల డెబిట్ కార్డుల సమచారం నేరగాళ్ల చేతికి వెళ్లిందని తేలింది.

డెబిట్ కార్డుల దొంగతనంపై

డెబిట్ కార్డుల దొంగతనంపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ వంటి వివిధ బ్యాంకులకు కేంద్రం నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తివివరాలతో కూడిన రిపోర్టును తమకు అందజేయాలని ఐటీ మంత్రిత్వశాఖ బ్యాంకులను ఆదేశించింది.

అప్రమత్తం

ఈ క్రమంలోనే మరోమారు పాకిస్తాన్ సైబర్ అటాకర్ల నుంచి కూడా బ్యాంకులకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని తాజా నోటీసులు జారీచేసింది. ఉడీ ఘటన జరిగిన అనంతరం నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో పాకిస్తాన్ భారత్‌పై సైబర్ అటాక్స్‌కు పాల్పడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Centre warns banks of Pak cyber attacks Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting