పేలిన ఐఫోన్ 7 : మంటల్లో కారు దగ్ధం
ఐఫోన్ 7 పేలుడు దెబ్బకి కారు మంటల్లో కాలిపోయింది
స్మార్ట్‌ఫోన్లు పేలడం అనే వార్త ఈ మధ్య అందర్నీ బాగా కలవరపరుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ నోట్ -7 ఫోన్లు ఎక్కువగా పేలుతున్న విషయం వింటూనే ఉన్నాం. దీని దెబ్బకు శాంసంగ్ కుప్పకూలిపోగా ఐఫోన్-7 అమ్మకాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ 7 కూడా పేలిపోయింది. ఐఫోన్ దెబ్బకు కారు లోపలి భాగాలు మంటల్లో చిక్కుకున్నాయి. షాకింగ్ కథనం మీరే చూడండి.
లేటెస్ట్ షాక్ : ఫోన్ బ్యాటరీలో వందకు పైగా విషవాయువులు

జోన్స్ కు చేదు అనుభవం
ఐఫోన్ 7ను కొనుగోలు చేసిన ఆస్ట్రేలియాకు చెందిన సర్ఫింగ్ ఇన్ స్ట్రక్టర్ మ్యాట్ జోన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తన కారులోని బట్టల కింద ఈ ఫోన్ ను ఉంచి సర్ఫింగ్ పాఠాలు చెప్పేందుకు వెళ్లాడు.

కారులో నుంచి పొగలు
తిరిగి వచ్చేటప్పటికీ, కారులో నుంచి పొగలు బయటకు వస్తున్నాయి. దీంతో, విస్తుపోయిన మ్యాట్ జోన్స్ కు ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.

కారులో పెట్టిన తన ఐఫోన్
కారులో పెట్టిన తన ఐఫోన్ కాలుతుండటాన్ని చూశాడు. ఈ ఫోన్ కాలడంతో కారు లోపలి భాగాలు కూడా దెబ్బతిన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోన్ పూర్తిగా కాలిపోయిందని
ముఖ్యంగా తన ఫోన్ పూర్తిగా కాలిపోయిందని, దాని నుంచే మంటలు వచ్చాయని దాని వల్లే ఈ ప్రమాదం జరిగిందని జోన్స్ అంటున్నాడు.

ఫిర్యాదు మేరకు ఆపిల్ సంస్థ
ఈ సంఘటనకు కారణం ఐఫోన్ పేలడమేనని మ్యాట్ జోన్స్ ఫిర్యాదు మేరకు ఆపిల్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని సంస్థ అధికారులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








