నాసా "హలో" సందేశానికి విక్రమ్ లాండర్ ప్రతిచర్య? ఖుషీలో ఇస్రో!

|

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విక్రమ్ తో కమ్యూనికేషన్ పొందడానికి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. ఇండియా చంద్రయాన్ -2 మిషన్‌ ద్వారా విక్రమ్ మూన్ ల్యాండర్ ను చంద్రుడి పైకి పంపిన సంగతి అందరికి తెలుసు. సెప్టెంబర్ 7 న అనుకున్న పథం ప్రకారం చంద్రుని ఉపరితలంపై కిందకు దిగుతున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైన సంగతి అందరికి తెలుసు.

 

విక్రమ్ ల్యాండర్

విక్రమ్ ల్యాండర్ విఫలమైన తరువాత కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్ చంద్రుని ఉపరితలంపైన విక్రమ్ ల్యాండర్ ను గుర్తించినట్లు ఇస్రో చీఫ్ K.శివన్ ఒక రోజు తరువాత ప్రకటించాడు. తమ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (DSN) ద్వారా విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ ను పొందడం కోసం సిగ్నల్స్ పంపుతున్నట్లు అధికారులు ధృవీకరించారు.

విక్రమ్‌తో కమ్యూనికేషన్‌

విక్రమ్‌తో కమ్యూనికేషన్‌

ఇప్పుడు విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ను పొందడం కోసం ఇస్రో అదనపు మద్దతు కోసం సిద్ధంగా ఉంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) కూడా విక్రమ్‌కు రేడియో సిగ్నల్స్ పంపుతున్నట్లు సమాచారం. "మూన్ ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ లింకులను తిరిగి స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమ్ దిగిన ప్రదేశంలో సూర్యరశ్మి ఉండే వరకు సెప్టెంబర్ 20-21 వరకు ఈ ప్రయత్నాలు జరుగుతాయి "అని ఇస్రో అధికారి తెలిపారు. నాసా యొక్క మూడు జియోస్ట్రాటజిక్ ప్రదేశాలలో డీప్-స్పేస్ యాంటెనాలు విక్రమ్ లాండర్‌కు ‘హలో సిగ్నల్స్' పంపినట్లు నివేదిక పేర్కొంది.

స్కాట్ టిల్లె ట్వీట్
 

స్కాట్ టిల్లె ట్వీట్

రెండు అంతరిక్ష సంస్థల మధ్య ముందస్తు ఒప్పందం ప్రకారం విక్రమ్‌తో కనెక్ట్ అవ్వడానికి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇస్రోకు సహాయం చేస్తోంది. చంద్రుడి వద్ద DSN 24 కిలోమీటర్ల 12 కిలోవాట్ల RF వద్ద వున్న చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ విక్రమ్‌ల్యాండర్‌ను తమతో కమ్యూనికేట్ చేయడానికి మరింత ఆశతో అందరు ఎదురుచూస్తున్నారు. 2103.7MHz లో EME (ఎర్త్ మూన్ ఎర్త్) ద్వారా చంద్రుని నుండి తిరిగి భూమికి ప్రతిబింబించే సిగ్నల్ యొక్క వింత రికార్డింగ్ ను పంపినట్లు ఖగోళ శాస్త్రవేత్త స్కాట్ టిల్లె ట్వీట్ చేశారు.

మూన్ రేడియో రిఫ్లెక్టర్‌

మూన్ రేడియో రిఫ్లెక్టర్‌

ల్యాండర్‌కు సిగ్నల్ పంపినప్పుడు మూన్ రేడియో రిఫ్లెక్టర్‌గా పనిచేస్తుంది మరియు 8,00,000 కిలోమీటర్ల రౌండ్ ట్రిప్ తర్వాత భూమిపై కనుగొనగలిగే సిగ్నల్‌లో కొంత భాగాన్ని తిరిగి పంపుతుంది.


"గోల్డ్‌స్టోన్ వద్ద DSN 24 స్థానిక మూన్‌రైజ్ తర్వాత విక్రమ్‌ల్యాండర్ కోసం సంకేతంగా ప్రారంభమవుతుంది" అని టిల్లీ గురువారం ట్వీట్ చేశారు. నాసాకు దక్షిణ కాలిఫోర్నియాలో గోల్డ్‌స్టోన్, స్పెయిన్ యొక్క మాడ్రిడ్, ఆస్ట్రేలియా యొక్క కాన్బెర్రాలో మూడు అతి పెద్ద అంతరిక్ష నెట్‌వర్క్‌ స్టేషన్ లు ఉన్నాయి.

 

విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్

శనివారం తెల్లవారుజామున చంద్రుని ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుది అవరోహణలో గ్రౌండ్-స్టేషన్లతో కమ్యూనికేషన్ పోయిన తరువాత విక్రమ్ లోపల వున్న రోవర్ 'ప్రగ్యాన్' చంద్రుని ఉపరితలంపై అడుగుపెడుతుంది.


విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ను తిరిగి పొందవచ్చో లేదో తెలుసుకోవడానికి గల అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము అని మరొక ఇస్రో అధికారి పిటిఐకి తెలిపారు. ఇస్రో బృందం ఇస్రోటెలెమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) లో పనిచేస్తోంది.

 

 ప్రగ్యాన్ రోవర్

విక్రమ్ ల్యాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్ యొక్క మిషన్ జీవిత కాలం చంద్రుడి మీద ఒక రోజు అంటే ఇది భూమి మీద 14 రోజులకు సమానం. విక్రమ్‌తో కమ్యూనికేషన్ను తిరిగి పొందే అవకాశాలు మసకబారినప్పటికీ పూర్తిగా ఇంకా పోలేదు. ఇందులో ఇస్రోకు శుభవార్త ఏమిటంటే ల్యాండర్ కఠినమైన ల్యాండింగ్ తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండడం.

కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ యొక్క ఆన్-బోర్డ్ కెమెరా పంపిన చిత్రాల ప్రకారం ప్రణాళికాబద్ధమైన (టచ్-డౌన్) సైట్‌కు చాలా దగ్గరగా ఉంది. ల్యాండర్ ముక్కలుగా విభజించబడకుండా ఒకే ముక్కగా ఉంది. అందువలన ల్యాండర్ తో కమ్యూనికేషన్ను తిరిగి పొందడానికి కొద్దిగా అవకాసం ఉంది అని మిషన్తో సంబంధం ఉన్న ఇస్రో అధికారి పేర్కొన్నారు.

 

విక్రమ్‌తో

IMAGE ఉపగ్రహాన్ని నాసా 2000 లో ప్రయోగించింది. ఐదేళ్ల తరువాత దానితో సంబంధాన్ని కోల్పోయింది. గుర్తుచేసుకుంటే చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉన్నప్పుడు చంద్రయాన్ -2 మరియు నియంత్రణ కేంద్రం మధ్య సంబంధం కోల్పోయింది. విక్రమ్‌తో ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంలోకి దిగడానికి ప్రతిష్టాత్మక ప్రయత్నం చేస్తోంది. మిషన్ తన లక్ష్యం 95 శాతం సాధించిందని శివన్ మీడియాతో అన్నారు.

చంద్రయాన్ -2 మీద నాసాకు ఎందుకు ఆసక్తి?

చంద్రయాన్ -2 మీద నాసాకు ఎందుకు ఆసక్తి?

నాసా అనేక కారణాల వల్ల ఇండియా యొక్క చంద్రయాన్ -2 మిషన్ పట్ల చాలా ఆసక్తి చూపుతోంది. మొదటగా "నిష్క్రియాత్మక పేలోడ్" లేజర్ రిఫ్లెక్టర్ శ్రేణి విక్రమ్ ల్యాండర్‌లో ఉపయోగించారు. ఇది ల్యాండర్ యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని ట్రాక్ చేయడానికి మరియు భూమి మరియు చంద్రుల మధ్య ఖచ్చితమైన దూరాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. నాసా తన భవిష్యత్ చంద్ర కార్యకలాపాల కోసం దూర గణనలు మెరుగ్గా ప్లాన్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

 

 

రెండవది

రెండవది ఎనిమిది అధునాతన పేలోడ్‌లతో లోడ్ చేయబడిన చంద్రయాన్ -2 యొక్క కక్ష్య నుండి నాసా చాలా ముఖ్యమైన డేటాను ఆశిస్తోంది. 3D మ్యాపింగ్ మరియు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం యొక్క మెరుగైన చిత్రాల కోసం ఇది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద 2024 నాటికి దక్షిణ ధ్రువానికి మనుషులతో కూడిన మిషన్‌ను పంపాలని యోచిస్తోంది. ఆ మిషన్‌ను మెరుగ్గా ప్లాన్ చేయడానికి చంద్రయాన్ -2 యొక్క జ్ఞానం ఉపయోగపడుతుంది.

చంద్రుడి మీదకు

చంద్రుడి మీదకు మరో రెండు లేదా మూడు ల్యాండర్ మిషన్ల తర్వాత చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో ఒక పరిశోధనా కేంద్రంను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తున్నందున అమెరికా వెనుక ఉండటానికి ఇష్టపడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాసా ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ మరియు జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేటు అంతరిక్ష సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Best Mobiles in India

English summary
Chandrayaan-2 mission: NASA and ISRO Joins together to Establish Vikram Communication

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X