Home
News

కొత్త 4o ఫీచర్ వచ్చేసింది.. చాట్‌జీపీటీలో ఇలా అద్భుతమైన ఫొటోలు సృష్టించుకోవచ్చు.. ఎలాగంటే?

ChatGPT 4o Image Generation: మీరు చాట్‌జీపీటీ వాడుతున్నారా, అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు చాట్‌జీపీటీలోనే మీకు నచ్చినట్టు అద్భుతమైన ఫొటోల (ఇమేజెస్)ను సృష్టించుకోవచ్చు. ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ, చాట్‌జీపీటీలో "4o ఇమేజ్ జనరేషన్" అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు చెప్పిన దానికి తగ్గట్టు చాలా కచ్చితత్వంతో, క్రియేటివ్‌గా, ఎంతో వివరంగా ఫొటోలను తయారు చేయడంలో ఇది ఇప్పటివరకూ వచ్చిన వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం ప్లస్ (Plus), ప్రో (Pro), టీమ్ (Team), ఉచిత (Free) యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. త్వరలోనే ఎంటర్‌ప్రైజ్ (Enterprise), ఎడ్యు (Edu) యూజర్లు కూడా దీన్ని వాడుకోవచ్చు. అంతేకాదు, డెవలపర్లు కూడా త్వరలో GPT-4o API ద్వారా దీని సేవలను పొందగలరు.

ChatGPT 4o Image Generation OpenAI Launches Its Most Advanced AI Art Tool - How to Use It Now

* GPT-4o ఇమేజ్ జనరేషన్‌తో ఏం చేయొచ్చు..

ఇది ఓపెన్ఏఐ వారి మరో అద్భుతమైన టెక్నాలజీ అయిన సోరా (Sora)లో కూడా భాగంగా ఉంది. GPT-4o ఇమేజ్ జనరేషన్ చిత్రాల తయారీలో సరికొత్త విప్లవం లాంటిది. దీని ప్రత్యేకతలు ఏంటంటే చాలా చిన్న చిన్న వివరాలతో కూడిన, హై-క్వాలిటీ ఫొటోల (ఇమేజ్‌ల)ను సృష్టిస్తుంది.

టెక్స్ట్ రూపంలో ఇచ్చే సూచనలను (ప్రాంప్ట్స్) చాలా కచ్చితంగా అర్థం చేసుకుని, దానికి తగ్గట్టే ఫోటోలను ఇస్తుంది. మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోలను మార్చడం లేదా వాటి ఆధారంగా కొత్త ఫొటోలను తయారు చేయడం కూడా చేయగలదు. ఒకే ఫొటోలో 10 నుంచి 20 వేర్వేరు వస్తువులు ఉండే సంక్లిష్టమైన దృశ్యాలను కూడా సులభంగా గీసేస్తుంది.

ఫొటోలలో అక్షరాలను (Text) చాలా స్పష్టంగా, కచ్చితంగా చూపిస్తుంది. అందుకే లోగోలు, పోస్టర్లు వంటివి తయారు చేయడానికి ఇది భలేగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఒకే క్యారెక్టర్‌ను లేదా వస్తువును వేర్వేరు ఫొటోలలో ఒకే విధంగా చూపించాలనుకుంటే, ఈ ఫీచర్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

వివో నుంచి మరో కొత్త ఫోన్.. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, భారీ 6500mAh బ్యాటరీ.. మార్చి 31న లాంచ్..
గేమ్స్ తయారుచేసేవారికి, బ్రాండింగ్ కోసం, చదువుకు సంబంధించిన మెటీరియల్స్ తయారుచేసేవారికి ఇది వరం లాంటిది. OpenAI దీన్ని ఆన్‌లైన్‌లోని బోలెడు ఫొటోలు, టెక్స్ట్ ఆధారంగా ట్రైన్ చేసింది, అందుకే దీనికి బొమ్మలకు, భాషకు మధ్య ఉన్న సంబంధం బాగా తెలుసు. మరి చాట్‌జీపీటీలో 4o ఇమేజ్ జనరేషన్ ఎలా వాడాలి? ఇదే ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.

* ఇమేజ్‌లు ఎలా క్రియేట్ చేయాలి

ఈ కొత్త ఫీచర్‌ను వాడటం చాలా సులభం. మీకు ఎలాంటి ఫోటో కావాలో చాట్‌జీపీటీలో స్పష్టంగా టైప్ చేయండి. మీరు ఎంత వివరంగా చెబితే, ఫోటో అంత బాగా వస్తుంది. ఉదాహరణకు ఫోటో సైజ్ ఎలా ఉండాలి (చదరంగానా, పొడవుగానా?), ఏ రంగులు వాడాలి (హెక్స్ కోడ్స్ కూడా ఇవ్వొచ్చు) ఇలా చెప్పొచ్చు.

బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి (ఏమీ లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గానా లేక ఏదైనా రంగుతోనా?). ఫోటోలో ఏయే వస్తువులు ఉండాలి, అవి ఏం చేస్తుండాలి, ఎలాంటి భావోద్వేగాలు కనిపించాలి? ఇలా అన్నీ చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇంకా గందరగోళంగా ఉంటే ఒక సులభమైన ఉదాహరణ కూడా కింద ఇస్తున్నాం, చదవండి.

ఉదాహరణకు, "సూర్యాస్తమయం వేళ, భవిష్యత్ నగరంలో ఎగిరే కార్లు ఉన్న ఇమేజ్ కావాలి, ఆకాశం నారింజ రంగులో ఉండాలి, బిల్డింగులు మోడ్రన్‌గా కనిపించాలి, చూడటానికి నిజంగా ఉన్నట్టే ఉండాలి" అని అడిగారనుకోండి. చాట్‌జీపీటీ కొద్ది సెకన్లలోనే మీరు అడిగిన అన్ని వివరాలతో ఫొటోను రెడీ చేసి ఇస్తుంది.

* GPT-4o ఇమేజ్ జనరేషన్ ముఖ్యమైన ఉపయోగాలు

ఈ ఫీచర్‌తో చాలా పనులు చేసుకోవచ్చు, కొన్ని ముఖ్యమైనవి చూస్తే బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, యాడ్స్ కోసం యూనిక్‌గా ఉండే ఫొటోలు తయారు చేసుకోవచ్చు. ఇది గేమ్స్‌లోని క్యారెక్టర్లు, లొకేషన్లు, వస్తువులను డిజైన్ చేయడానికి సాయపడుతుంది. పాఠాలు సులభంగా అర్థమవ్వడానికి కావాల్సిన బొమ్మలు, చార్ట్‌లు, డైగ్రామ్‌లు గీయించుకోవచ్చు.

Take a Poll

మీ కంపెనీకి లేదా ప్రొడక్ట్‌కు కావాల్సిన లోగోలు, బ్యానర్లు, ప్రచార చిత్రాలు క్రియేట్ చేసుకోవచ్చు. పుస్తకాల ముఖచిత్రాలు, సినిమా లేదా కథల కోసం కాన్సెప్ట్ ఆర్ట్, స్టోరీబోర్డులు వంటివి విజువలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కటేంటి ఇంకా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి.

* ఇంకా ఏమేం మారాలి..

GPT-4o ఇమేజ్ జనరేషన్ అద్భుతంగా పనిచేస్తున్నా, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇంగ్లీష్ కాని ఇతర భాషల అక్షరాలను (Non-Latin scripts) సరిగ్గా చూపించడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు. పోస్టర్ల లాంటి బాగా పొడవుగా ఉండే ఫొటోలను కొన్నిసార్లు సరిగ్గా క్రాప్ చేయకపోవచ్చు.

అయితే, ఓపెన్ఏఐ టీమ్ ఈ సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు కచ్చితత్వాన్ని పెంచడానికి, అప్‌లోడ్ చేసిన ఫొటోలలోని ముఖ కవళికలు మార్పులు చేసినప్పుడు కూడా స్థిరంగా ఉండేలా చేయడానికి నిరంతరం పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Unlock OpenAI ChatGPT 4o Image Generation. Learn how to create stunning, detailed AI art directly in chat using this advanced text-to-image tool.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X