రూ. 599కే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

|

అందరూ అలర్టయ్యే వార్త ఇది. ఆన్‌లైన్ మోసాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఈ న్యూస్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అలాగే అమాయకులు ఎలా బలవుతున్నారో కూడా ఈ న్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు. మరీ ఇంత అమాయకంగా ఉంటారా అనే సందేహం రావచ్చు. పరిస్థితులు ఎవరికైనా అలానే వస్తాయి. ఆశ అలాంటిది మరి. ఐ ఫోన్ కోసం ఆశపడితే ఉన్న డబ్బంతా ఊడ్చిపారేశారు. న్యూస్ చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే.

Read more: ఐ ఫోన్ అసలైనదా లేక నకిలీదా తెలుసుకోవడమెలా..?

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

దాదాపు ఐదంకెల ధర కలిగిన ఐఫోన్‌ను కేవలం 599 రూపాయలకు అందిస్తామని చెప్పగానే ఎంతో ఆశతో నమ్మిన వ్యక్తిని నిలువునా మోసం చేసిన ఘటనపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

వివరాల్లోకి వెళ్తే...నారాయణ్ ఘడగే అనే 50 ఏళ్ల వ్యక్తి పూణేలోని కట్రాజ్‌లో నివాసం ఉంటున్నారు. రిటైర్ట్ ప్రైవేట్ ఉద్యోగి కూడా. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన డబ్బును బ్యాంకులో దాచుకున్నారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

ఇంట్లో కంప్యూటర్ వినియోగిస్తుండగా bigsop.comలో ఐఫోన్ కేవలం 599 రూపాయలకే అనే యాడ్ ప్రత్యక్షమైంది. ఇక ఆనందం ఆపుకోలేని ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించి ఆ ఫోన్‌కు ఆర్డర్ చేసి, ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేశారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

పేమెంట్ తర్వాతనే అసలు కథ మొదలైంది. మనోడి బతుకు బస్టాండ్ అయింది. ఓ గంట తరువాత ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఈ కామర్స్ నుంచి మాట్లాడుతున్నామని, ట్రాన్సక్షన్ వివరాలు మీవి అవునో కాదో నిర్ధారించుకోవాలని చెప్పండంటూ అవతలి వ్యక్తులు అడిగారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

అయితే మీవేనని నిర్థారించుకోవాలంటే మీ బ్యాంకు అకౌంట్ నెంబర్, ఏటీఎం పాస్‌వర్డ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలు చెప్పాలనడంతో నారాయణ్ ఐ ఫోన్ వస్తుందన్న ఆశలో అన్ని వివరాలు చెప్పేశారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

దీంతో ఐఫోన్ వచ్చేసిందని నారాయణ్ భావించారు. అయితే ఆ రోజు అర్ధ రాత్రి సమయంలో ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బిత్తరపోవడం నారాయణ్ వంతైంది.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

ఈ విషయంపై తనకు ఫోన్ వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేసి ఆరాతీయగా, చూసి లోపం ఉంటే మీ ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మబలికారు. దీంతో సమస్య పరిష్కారమైందని భావించిన ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

తరువాత రెండు రోజుల వ్యవధిలో ఆయన అకౌంట్ నుంచి 1,98,712 రూపాయలు విత్ డ్రా అయ్యాయి. ఐ ఫోన్ సంగతి పక్కనబెడితే మనోడి అకౌంట్ లో డబ్బులన్నీ వారు ఊడ్చిపారేశారు. నెత్తి నోరు బాదుకున్న నారాయణ్ చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

ఇది 2014లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆయన మరోసారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

2014లో దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, చెబుతూ ఆయన మరోసారి ఫిర్యాదు చేయడంతో, అతని కేసును స్వీకరించిన పోలీసులు, అతనికి న్యాయం చేస్తామని చెప్పారు.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

తక్కువ ధరకే ఐ ఫోన్ వస్తుందని ఆశపడితే ఇలా 2 లక్షలు వదిలించుకోవాల్సి వచ్చింది. సో ఆన్‌లైన్ వచ్చే ప్రకటనలపై కాస్త చూసి ముందుకెళ్లండి మరి.

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

రూ. 599లకే ఐఫోన్ అంటూ రూ. 2 లక్షలు ఊడ్చేశారు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Cheap online iphone deal costs man Rs 2 lakh of his life savings

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X