బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

జియోకు పోటీగా మార్కెట్లో మరింత్ అగ్రిసవ్‌గా దూసుకువెళ్లేందుకు సరికొత్త ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

ప్రభుత్వ రంగం టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరం నుంచి మొబైల్ సర్వీసులను మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. ఢీల్లీ ప్రధానం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న బీఎస్ఎన్ఎల్ కు దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడైంది (2015 లెక్కల ప్రకారం).

బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

Read More : ఊరిస్తోన్న సామ్‌సంగ్ 4జీ ఫోన్‌లు

జియో లాంచ్ తరువాత ఒక్కసారిగా మార్కెట్ స్వరూపం మారిపోవటంతో జియోకు పోటీగా మార్కెట్లో మరింత్ అగ్రిసవ్‌గా దూసుకువెళ్లేందుకు సరికొత్త ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఆఫర్లను దృష్టిలో ఉంచుకుని కొత్త సిమ్ తీసుకోవాలనుకంటున్నట్లయితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

రూ.20 చెల్లిస్తే చాలు..

రూ.20 చెల్లిస్తే చాలు..

కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను పొందే క్రమంలో మీరు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. 24 గంటల్లో సిమ్ యాక్టివేషన్ కాబడుతుంది. ఒకేవేళ మీకు నానో సిమ్ కార్డ్ అవసరమైనట్లయితే రూ.59 చెల్లించాల్సి ఉంటుంది.

 

నచ్చిన నెంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..

నచ్చిన నెంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..

మీ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ స్టోర్‌కు వెళ్లటం ద్వారా కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను మీరు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో నచ్చిన నెంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. కొత్త సిమ్‌ను పొందే క్రమంలో అవసరమైన డాక్యుమెంట్‌లను బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది.

 

కొన్ని ప్రాంతాల్లోనే 4జీ..
 

కొన్ని ప్రాంతాల్లోనే 4జీ..

దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీఎస్ఎన్ఎల్ 4జీ లైసెన్స్‌‌లను కలిగి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణంలోకి తీసుకోవల్సి ఉంది. మీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులో లేకపోయినట్లయితే 3జీతో సరిపెట్టకోవల్సి ఉంటుంది. సిగ్నల్ అంతరాయం కారణంగా అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ అలానే నెట్‌వర్క్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియోతో ఒప్పందం..

జియోతో ఒప్పందం..

తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను చేరువ చేసే క్రమంలో బీఎస్ఎన్ఎల్ ఇటీవల రిలయన్స్ జియో జతకట్టిన విషయం తెలిసిందే. జియోతో కుదర్చుకున్న ఒప్పందంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లు రోమింగ్‌లో ఉన్నప్పుడు జియో 4జీ సేవలను ఉపయోగించుకునే వీలుంటుంది. అలాగే జియో కస్టమర్ లు రోమింగ్ ఉన్నప్పుడు వాయిస్ కాల్స్ నిమిత్తం బీఎస్ఎన్ఎల్ 2జీ సర్వీసులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

 

యాక్టివేషన్ చాలా సులభతరం..

యాక్టివేషన్ చాలా సులభతరం..

బీఎస్ఎన్ఎల్ సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ పర్ ఫెక్ట్ గా ఉన్నట్లయితే 24 గంటల్లోపే మీ సిమ్ యాక్టివేట్ కాబడుతుంది.

 

4జీ మొబైల్ డేటా సేవలు డిసెంబర్ నుంచి..?

4జీ మొబైల్ డేటా సేవలు డిసెంబర్ నుంచి..?

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 4జీ మొబైల్ డేటా సేవలను డిసెంబర్ 2016 నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. 4జీ సేవలను అందించేందుకు అవసరమైన 2,500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్ ఇటీవల 8,313 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

 

లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన సమచారం..?

లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన సమచారం..?

బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అతిత్వరలోనే ఈ లాంచ్ తేది ఉండొచ్చని సమచారం. మీమీ పట్టణాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్‌ లాంచ్ తేదీలను ప్రకటించిన తరువాత మీ ఫోటో ఐడీతో పాటు సంబంధిత డాక్యుమెంట్‌లతో బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లినట్లయితే 4జీ సిమ్ మీకు లభిస్తుంది.

 

లేటెస్ట్ 3జీ సిమ్ అయినట్లయితే..?

లేటెస్ట్ 3జీ సిమ్ అయినట్లయితే..?

మీరు వాడుతోన్నది లేటెస్ట్ 3జీ సిమ్ అయినట్లయితే 4జీకి కన్వర్ట్ చేసుకునే అవకాశముంటుంది. 3జీ సిమ్ యూజర్లు 1900కు PORT మెసేజ్ చేయటం ద్వారా 4జీ నెట్‌వర్క్‌లోకి కన్వర్ట్ కావొచ్చు.

జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లాన్స్..

జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లాన్స్..

బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ ఆఫర్ చేసే ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ జియోకు ధీటుగా ఉంటాయని సమాచారం. ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లాన్‌లకు సంబంధించిన ఏ విధమైన వివరాలను www.bsnl.co.in వెబ్‌సైట్‌లో బీఎస్ఎన్ఎల్ పొందుపరచలేదు.

బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులో ఉండే ప్రాంతాలు..

బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులో ఉండే ప్రాంతాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, జార్కండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. యాపిల్‌కు షాకిచ్చిన ఇండియన్ కంపెనీ టాబ్లెట్!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Check Out the 5 Most Important Things Before Buying a BSNL Prepaid SIM Card. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X