Home
News

చెత్త పాస్‌వర్డ్స్‌తో సింగపూర్‌కి చుక్కలు

By Hazarath

టెక్నాలజీ పెరిగి కంప్యూటర్లు రాజ్యమేలుతున్న తరుణంలో పాస్‌వర్డ్స్‌కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. తమ వివరాలన్నీ ఆన్‌లైన్లో భద్రపరుచుకోవడానికి అలాగే మిగతా కార్యకలాపాలు ఎవ్వరూ దొంగిలించకుండా గట్టి పాస్‌వర్డ్స్ పెట్టుకుంటాం కూడా. అయితే పాస్‌వర్డ్స్ వీక్‌గా ఉన్న తరుణంలో కంప్యూటర్ నుంచి పదే పదే మీ పాస్‌వర్డ్ వీకంటూ మేసేజ్‌లు కూడా వస్తుంటాయి. సో అలాంటి పాస్‌వర్డ్‌లను ఏ దేశం పకడ్బందీగా వాడుతుంది..మరి ఏ దేశం వీక్ గా ఉంది అన్న అంశంపై పరిశోధన నిర్వహిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Read more: సీక్రెట్‌ విప్లవంతో దడ పుట్టిస్తున్న గూగుల్

పాస్‌వర్డ్స్‌ను మెయింటెన్ చేయడంలో

పాస్‌వర్డ్స్‌ను మెయింటెన్ చేయడంలో

పాస్‌వర్డ్స్‌ను మెయింటెన్ చేయడంలో సింగపూర్ వాసులు పరమ వీక్ అని రుజువైంది. ఒకే పాస్‌వర్డ్‌ను.. అదీ అందరికీ తెలిసే పాస్‌వర్డ్స్‌ను పదే పదే అన్ని సైట్లకూ వాడుతూ ఇప్పుడు ప్రపంచంలోనే వరస్ట్ పాస్‌వర్డ్ వినియోగదారులుగా వారు ముందున్నరని తాజా నివేదికలు చెప్తున్నాయి.

వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్‌వర్డ్స్ వాడటం మంచిది కాదన్న

వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్‌వర్డ్స్ వాడటం మంచిది కాదన్న

వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్‌వర్డ్స్ వాడటం మంచిది కాదన్న విషయం తెలిసినా పట్టించుకోనివారు ఎక్కువమందే ఉంటారు. 2015 లో సింగపూర్ వాసులు అదే తప్పును చేసి.. భారీగా సైబర్ క్రిమినల్స్ వల్లో చిక్కుకుపోయారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.

గతవారం 300 మంది ఖాతాదారుల పాస్‌వర్డ్స్‌ను చోరీచేసి

గతవారం 300 మంది ఖాతాదారుల పాస్‌వర్డ్స్‌ను చోరీచేసి

ప్రైవేటు సమాచారం దొంగిలించాలని చూసే అటువంటి సైబర్ నేరగాళ్ళకు... సింగపూర్ వాసులు లక్ష్యం కావచ్చునని భద్రతాధికారులు హెచ్చరిస్తున్నారు. గతవారం 300 మంది ఖాతాదారుల పాస్‌వర్డ్స్‌ను చోరీచేసి, సింగపూర్ వీసా అప్లికేషన్లు ఉత్పత్తి చేసే చైనా ఆధారిత సిండికేట్‌కు అమ్మకం పెట్టిన ఓ మాజీ నిర్వహణాధికారి పట్టుబడ్డంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అనేక మంది తమ ఎన్‌ఆర్‌ఐసీ నెంబర్‌నే యూజర్ ఐడీ

అనేక మంది తమ ఎన్‌ఆర్‌ఐసీ నెంబర్‌నే యూజర్ ఐడీ

అనేక మంది తమ ఎన్‌ఆర్‌ఐసీ నెంబర్‌నే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ గా వాడుతున్నారని... అంచనా వేసిన 39 ఏళ్ళ జేమ్స్ సిమ్ గాన్ లియాంగ్... తన ప్రయత్నం ఫలించడంతో వేలాది పాస్‌వర్డ్స్‌ను సునాయాసంగా తెలుసుకోగలిగాడు.

తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా

తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా

ముఖ్యంగా తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారు. రీసెట్ పాస్‌వర్డ్స్‌లో కూడ కొన్నిసార్లు ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంద్వారా కూడా వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని.. పాలో ఆల్టో నెట్వర్క్స్ భద్రతా సంస్థ నిఘా విశ్లేషకుడు విక్కీ రే చెప్తున్నారు.

పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను

పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను

పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను లింక్డ్ ఇన్, ఫేస్‌బుక్ వంటి వాటినుంచీ పొందే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. పాస్‌వర్డ్స్‌ను హ్యాక్ చేయడంలో ఇదో పద్ధతి అని, అలాగే అతి సులభమైన పదాలను, నెంబర్లను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడం వల్ల కూడ హాక్ చేయగల్గుతారని చెప్తున్నారు.

అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు

అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు

అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు వాడే వారిపైనే ధ్యాసపెట్టే హాకర్లు ఇటువంటి పాస్ వర్డ్స్ ను సులభంగా హ్యాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అటువంటి 20 మిలియన్ల అతి చెత్త పాస్‌వర్డ్స్ లిస్టును పాస్‌వర్డ్స్ మేనేజ్ మెంట్ సంస్థ స్ల్పాష్ డేటా తాజాగా విడుదల చేసింది.

ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు

ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు

ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు.. వరుసగా ఐదో సంవత్సరం కూడ అగ్రస్థానంలో ఉండగా.. పాప్ సంస్కృతికి సూచనగా తాజాగా విడుదలైన చిత్రాల పేర్లు... స్టార్ వార్స్, సోలో, యువరాణి వంటి పాస్‌వర్డ్స్ కూడ ఈ లిస్టులో ఉండటం విశేషం.

బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి

బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి

బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి ఇటువంటి బలహీనమైన, రహస్య పదాలను హ్యాకర్లు ఊహిస్తుంటారు. సాధారణంగా అన్నీ చిన్న అక్షరాలు కలిగి ఉన్న ఆరు నుంచి పది అక్షరాలు ఉండే పాస్‌వర్డ్స్ ట్రాక్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ కు పది నిమిషాలు పడుతుందని సింగపూర్ సెక్యూరిటీ ట్రెండ్ మైక్రో జనరల్ మేనేజర్ డేవిడ్ షా చెప్తున్నారు.

అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం

అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం

అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం, సింబల్స్ వంటివి కలపడం వల్ల హ్యాక్ చేసేందుకు కనీసం రెండున్నర రోజులు పడుతుందంటున్నారు. అలాగే ఆయా సంస్థలు బలమైన డేటాబేస్ వ్యవస్థను కలిగి ఉండటం కూడ చోరీ కాకుండే ఉండేందుకు సహకరిస్తుందంటున్నారు మరో నిపుణుడు ఛార్లెస్ లిమ్.

ముఖ్యంగా పాస్‌వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి

ముఖ్యంగా పాస్‌వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి

ముఖ్యంగా పాస్‌వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి, లోయర్, క్యాపిటల్ లెటర్లతోపాటు నెంబర్లను, సింబల్స్‌ను కలిపి క్రియేట్ చేసుకోవడం ఎంతో అవసరం అని ఆయన యూజర్లకు సలహా ఇస్తున్నారు.

అలాగే తరచుగా పాస్‌వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల

అలాగే తరచుగా పాస్‌వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల

అలాగే తరచుగా పాస్‌వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల కూడ హ్యాక్ చేసే అవకాశం ఉండదని, ఒకే పాస్‌వర్డ్ ను అన్ని వెబ్‌సైట్లలో వాడటం కూడ మానుకోవాలని సూచిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Check out the worst passwords of 2015 is yours on the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X